Tuesday, April 20, 2010

ఐపిఎల్ ఫ్రాంచైజీలపై ఆరా

న్యూఢిల్లీ: ఐపిఎల్ జట్ల యాజమాన్యం విషయంలో పెనువివాదం చెలరేగిన నేపధ్యంలో ఐపిఎల్ జట్లను కొను గోలు చేసిన అన్ని ఫ్రాచైజీ కంపెనీలు ఈవిషయంలో నిబంధనలను పాటించాయా, లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. కోచీ టీమ్ ఫ్రాంచైజ్ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారటంతో ఆదాయపుపన్నుశాఖ ఈ వ్యవహారాలపై కూపీ లాగు తోంది. ఐపిఎల్ ఫ్రాంచైజీల విషయంలో యథాతథ నివేదికను ఇవ్వాలని అధికారులను కోరినట్లు సల్మాన్ కుర్షీద్ పేర్కొన్నారు.

కోచీ టీమ్‌ను ఫ్రాంచైజ్ చేసిన రెండే జ్యువస్ కంపెనీ ఈ విషయంలో నిబంధనలను అతిక్రమించిందా లేదా అన్న విషయాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ పరిశీలిస్తుందని ఆయన తెలియజేశారు. కాగా ఈమొత్తం వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బిసిసిఐ, ఐపిఎల్‌లపై ప్రస్తుతం తాము దృష్టి సారించటం లేదని ఇవి రెండూ కంపెనీలు కావని ఖుర్షీద్ పేర్కొన్నారు. కోచీ ఫ్రాంచైజ్ సునందా పుష్కర్‌కు స్వేద వాటా ఇవ్వటం నిబంధనలకు లోబడి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తా మని కార్పొరేట్ వ్యవహారాల శాఖ అదికారులు పేర్కొన్నారు.