Tuesday, April 20, 2010

ఇక పేదలకే గ్యాస్ రాయితీ!

(ఆన్‌లైన్/విశాఖపట్నం) వంట గ్యాస్ రాయితీపై ప్రభుత్వం పునరా లోచనలో పడింది. ఆయిల్ కంపెనీలన్నీ నష్టా లను భరించలేకపోతున్నామని గగ్గోలు పెడు తున్న నేపథ్యంలో రాయితీలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయా కంపెనీల మార్కెటింగ్ శాఖ ప్రతిని« దులలో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి సుందరేశన్ నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో సమా వేశమై కీలకాంశాలపై చర్చించినట్టు సమాచారం. ఏడాదికి ఐదు సిలెండర్లు మాత్రమే రాయితీ ధర కు ఇచ్చి, అంతకు మించిన వాటికి మార్కెట్ ధర వసూలు చేయాలని ఆయిల్ కంపెనీలు ప్రతిపాదించాయి.

మధ్య తరగతి ప్రజల సగటు వినియోగం ఏడాదికి ఐదు సిలెండర్లే అయినందున ఈ విధానం అధికులకు ఇబ్బందికరం కాబోదని, మిగిలినవారు మార్కెట్ ధరకు కొని వాడుకుంటారని పేర్కొన్నట్టు తెలిసింది. అలాకాకుంటే పేదలకు రాయితీ ధరకు ఇచ్చి, మిగిలినవారి నుంచి వాస్తవ ధర వసూలు చేయాలనే మరో ప్రతిపాదన కూడా సమర్పించారు. అయితే వీటిని పెట్రోలియం కార్యదర్శి సుందరేశన్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. ఒకే ప్రాంతంలో వుండే వినియోగదారులకు వేర్వేరు ధరలు, అందులోనూ రేటు పెంచడం అంటే రాజకీయంగా అనేక సమస్యలకు దారితీస్తుందని నిర్ద్వందంగా తిరిస్కరించినట్టు తెలిసింది.