Thursday, April 22, 2010

గూగుల్‌కు భారీ స్థాయిలో భారత్ అభ్యంతరాలు

న్యూయార్క్: సెన్సార్ వ్యవహారంపై చైనా నుంచి వైదొలిగిన ఇంటర్‌నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు భారత్ కూడా అనేక అంశాల విషయంలో తీవ్రమైన అభ్యంతరాలను తెలిపింది. గూగుల్ ఇచ్చిన సమాచారంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వాటినితొలగించాలనిలేదా సెన్సార్ చేయాలని కోరిన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. గత సంవత్సరంలో సమాచారాన్ని తొలిగించాలని లేదా సెన్సార్ చేయాలని కోరిన దేశాల జాబితాను గూగుల్ తొలిసారిగా విడుదల చేసింది.

ఈ జాబితాలో భారత్ 142 అభ్యంతరాలతో మూడవ స్థానంలో ఉండగా, బ్రెజిల్ 291 అభ్యంతరాలతో ప్రథమస్థానంలో, 188 అభ్యంతరాలతో జర్మనీ ద్వితీయ స్థానంలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. బ్రెజిల్, ఇండియాలనుంచి ప్రధానంగా తమ సోషల్ నెట్ వర్క్ సైట్ ఆర్కూట్‌లోని ఉన్న సమాచారంపైనే ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. ఈరెండు దేశాలలో ఆర్కూట్ బాగా ప్రజాదరణ పొందిందని పేర్కొంది. అమెరికా ఈ విధంగా 123 అభ్యంతరాలను తెలుపగా మన దేశం అంతకంటే అధికంగా 142 అభ్యంతరాలను ప్రకటించింది.