Wednesday, April 21, 2010

పరిశ్రమలకు ఛార్జీలు పెంపు!

యూనిట్‌కు అదనంగా 50 పైసలు ఖరారు
గృహావసర విద్యుత్‌పై వడ్డనకు తర్జనభర్జన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పారిశ్రామికరంగానికి విద్యుత్‌ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిటుకు 50పైసల చొప్పున ఈ పెరుగుదల ఉంటుందని తెలిసింది. గృహ వినియోగదారులకు ఛార్జీలు పెంచాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం అమలు చేయాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతోంది. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే వీలుంది. నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రతిపాదనల్ని వార్షిక వ్యయని వేదిక (ఏఆర్‌ఆర్‌) రూపంలో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాల్సి ఉంది. కొద్దిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఏపీఈఆర్‌సీ ఆ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ ద్వారా అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం తుది ఆదేశాలు జారీచేస్తుంది.