ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీ అమలు సాధ్యంకాదు...
ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీ అమలు సాధ్యంకాదు...
ప్రణబ్ న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్‌టీ)ను వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయడం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. జీఎస్‌టీ అమలు అనుకున్న సమయంలో(ఏప్రిల్,2010) సాధ్యంకాకపోవచ్చని రాష్ట్రాల ఆర్థికమంత్రుల సాధికార కమిటీ ఛైర్మన్ పేర్కొన్నారని రాజ్యసభలో ఓప్రశ్నను లేవనెత్తారు. ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనికిచ్చిన రాతపూర్వక సమాధానంలో 'అవును' అని తెలిపారు. జీఎస్‌టీ అమలుపై చర్చించేందుకు ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏప్రిల్‌లో సమావేశమవనున్నారు.