ద్రవ్యోల్బణం నియంత్రణపై కసరత్తు
న్యూఢిల్లీ: నానాటికి పెరిగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. దీనిని ఎలాగైనా కట్టడి చేయాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం తీసు కోవాల్సిన ఆర్ధిక, కార్యనిర్వాహక చర్యలపై ప్రభుత్వం కస రత్తులు జరుపుతోంది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా రాజ్యసభలో మంగళవారం ఒక ప్రకటన చేస్తూ ద్రవ్యోల్యణం నియంత్రణపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించిం దని అన్నారు. అందులో భాగంగా బియ్యం, గోధు మ, ఆహార ధాన్యాలు, వంట నూనెలు, మొక్క జొన్న, వెన్న, నెయ్యి వంటి ఆహారోత్పత్తులపై దిగుమతి పన్నులను పూర్తిగా ఎత్తివేశామని, అలాగే ఈ ఏడాది చివరి వరకు ముడి పంచదార దిగుమతులపై కూడా పన్నులు రద్దు చేశామని, నాన్ బాసుమతి బియ్య ఎగుమతులు నిషేధించామని చెప్పారు.
బియ్యం, ఉరద్, పసుపు వంటి వాటిల్లో ఫ్యూచర్ ట్రేడిం గ్ నిషేధించామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఈ ఏడాది మొత్తం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజ్యసభలో స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జనవరి 2వ తేదీ తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలకు సంబంధించి ద్రవ్యోల్బణ సూచీలు 14.77, 47.82 శాతం ఉండగా, ఈనెల 6వ తేదీ నాటికి వరుసగా 12.20, 38.04 శాతానికి తగ్గాయని వివరించారు. రాష్ట్రాల వద్ద ఉన్న మిగులు ఆహారోత్పత్తులను మార్కెట్లో విడుదల చేయాల్సిందిగా, గత నెలలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావే శంలో ప్రణబ్ కోరారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిం చిన 10 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా, ఫిబ్రవరి 18 నాటికి కేవలం 4.3 లక్షల టన్నుల మిగుల బియ్యం మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ అయిందని మీనా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, కనీస మద్దతు ధర పెంపు బియ్యం ఉత్పత్తి తగ్గడానికి కారణాలయ్యాయని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల, అంతర్జాతీయంగా అక్కడ క్కడా ధరలు పెరగడం, మార్కెట్ అంచనాలు, సెంటిమెంట్లు కూడా బియ్యం ధరలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. టోకు ధరల సూచీ ఆధా రిత ద్రవ్యోల్బణం ఈ నెలలో 8.56 శాతం ఉండగా, ఆర్‌బిఐ అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం వచ్చే మార్చి చివరి నాటికి 8.5 శాతంగా ఉంటుంది.
రికవరీని బట్టి రాయితీల ఉపసంహరణ
మాంద్యం కారణంగా ఆర్ధిక వ్యవస్థను ఆదు కునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీల ను, అవి ఇచ్చిన ఫలితాలను బట్టి ఉపసం హరిస్తామని మీనా రాజ్యసభలో మరో ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. మాంద్యానికి ముందు, తరువాత ఉన్న పరిస్థితులు, రాయితీల ప్రభావం, సహజ సానుకూలత, ఆయా రంగాలలో వృద్ది రేటు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్దీపన ప్యాకేజీలను ఎంత వరకు ఏయే రంగాలలో ఏ స్థాయిలలో ఉపసంహరించుకోవాలనేది ప్రభు త్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
2008 డిసెంబర్ నుండి ప్రభుత్వం మూడు అంచెలుగా రాయితీలను ప్రకటించింది. వస్త్ర పరిశ్రమ, ఎగు మతులు, తోలు ఉత్పత్తులు, వజ్రాలు, ఆభరణాలు, చిన్న, మధ్య పరి శ్రమలు, మౌలిక వసతులు, గృహ నిర్మాణ రంగాలలో ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించిందని చెప్పారు. గత ఏడాది జూలై 6వతేదీ ప్రక టించిన 2009-10 బడ్జెట్‌లో ఆర్ధిక లోటు 4,00,996 కోట్ల రూ.లుగా ఉంది. అలాగే స్థూల జాతీయోత్పత్తి 6.8 శాతంగా అంచ నా వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర ఆర్ధిక విధానంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో లోటు జిడిపిలో గత ఏడాది కంటే 5.5 శాతం తగ్గవచ్చునని భావించింది.
జిఎస్‌టి అమలు ప్రస్తుతం సాధ్యం కాదు
పన్నుల సంస్కరణలలో భాగంగా ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తూ ప్రతిపాదిత సరుకులు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబం ధించిన కొత్త చట్టాన్ని వచ్చే ఏప్రిల్ నుండి అమలు చేయడం సాధ్యం కాదని అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు భావించడంతో కేంద్రం కూడా అందుకు అంగీ కరిస్తున్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ విషయమై వచ్చే ఏప్రిల్‌లో రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రులతో మరో విడత చర్చిస్తామన్నా రు. జిఎస్‌టిపై చర్చించి ఒక విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొందరు అధికారులు, కొన్ని రాష్ట్రాల మంత్రులతో ఒక సాధికార కమిటీని నియమించింది. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి జిఎస్‌టి అమలు చేసే విషయమై కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే ఖరారు చేయ డం జరిగిందని, వీటిల్లో కేంద్ర ఎకై్సజ్, సేవా పన్ను, వ్యాట్ తరహా పన్నులు కూడా ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మరో సహాయ మంత్రి ఎస్.ఎస్. పళని మాణిక్యం తెలిపారు.
రేపే 13వ ఆర్థిక సంఘం నివేదిక
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను ఆదా యానికి సంబంధించి పంపిణీపై రేపు ఒక స్పష్టత రానుంది. 13వ ఆర్ధిక సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్ సమర్పించనుంది. కేంద్ర పన్నుల రంగంలో సంస్కరణలు తీసుకురానున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించు కుంది. 2011-12 ఆర్ధిక సంవత్సరం నుండి సాధా రణ అమ్మకం పన్ను, ప్రత్యక్ష పన్నులలో ప్రభుత్వం సమూలంగా మార్పులు తీసుకురావడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. విజయ కేల్కర్ నేతృ త్వంలోని 13వ ఆర్ధిక సంఘం తన నివేదికను గత డిసెంబర్ 30న రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సమర్పించింది.
తరువాత దానిని కేంద్ర మంత్రి మండలి పరి శీలనకు పంపించారు. ఈ ఆర్ధిక సంఘం ఇచ్చే నివేదిక ప్రభావం ఈనెల 26 ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రతిఫలించవచ్చు నని తెలుస్తోంది. ఆర్ధిక సంఘం ఇచ్చే సిఫ