రైల్వే బడ్జెట్‌లో ప్రత్యేకతలెన్నో ?
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో ఈసారి ప్రత్యేకత ఏంటి..? మమతా బెనర్జీ ఎన్ని కొత్త రైళ్ళను ప్రవేశపెడుతోంది.. ప్యాసింజర్ ధరలు తగ్గేనా..లేక అంతేనా..?! ఇలా బుధ వారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ గురించిన ప్రశ్నలు. ఈసారి రైల్వే బడ్జెట్‌లోని ప్యాసెంజర్ ధరల్లో మార్పు ఉండ బోదనే సమాచారం. ఇదే నిజమైతే వరుసగా ఏడు సంవ త్సరాల నుంచి ప్యాసెంజర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండ దు. రైల్వే వర్గాల ప్రకారం సామాన్యుడికి చేరువలోనే మమతా రైల్వే బడ్జెట్ అంచనాలు ఉండబోతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్‌లో సమాజం లోని అన్ని వర్గాల కోసం ఏదో ఒకటి ఉండనుంది. కొత్తగా 12 నాన్-స్టాప్ రైళ్ళను మమ తా బెనర్జీ ప్రకటించనున్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చి మ బెంగాల్ రాష్ట్రాల్లో లొకోమోటివ్, కోచ్ మ్యానుఫ్యా రింగ్ యూనిట్స్ పనులను వేగవంతం చేయడంతో పాటు విస్తృతపరచనున్నారు. వీటికి అదనంగా కోల్‌కతా మెట్రో నెట్‌వర్క్ పనులకు కూడా పచ్చజెండా ఊపనున్నారు. రైలు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్న నేపథ్యంలో వీటి కోసం అధికంగా బడ్జెట్‌ను కేటాయించే అవకాశాలు న్నాయి. ఈ విషయంపై మమతా బెనర్జీ ఆర్థిక మంత్రి ప్రణ బ్ ముఖర్జీతో మంతనాలు కూడా జరిపారు. కొన్ని ప్రత్యేక ప్రాంత రూట్లలో యాంటీ కాలిజన్ డివైజ్ (ఎసీడీ)లను, ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్ (టీపీడబ్ల్యూఎస్)ను ప్రవేశ పెట్టనున్నారు. సామాన్య ప్రజల సౌకర్యాలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందిచారు. మహిళా ప్యాసెంజర్ల రక్షణ కోసం స్పెషల్ ఆల్ ఉమన్ ఫోర్స్‌ను ప్రకటించడంతో పాటు రైల్వే రిజ ర్వేషన్ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచే అవకా శాలున్నాయి. రైల్వే ఎంకై్వరీ కొరకు మరో కొత్త నంబరు 138 ప్రారంభం కానుంది.
రైల్వే స్లేషన్లలో దొరికే తినుబండారాల నాణ్యతకు సంబంధించిన విషయం, జనాహార్ వంటి అవుట్‌లెట్ల సంఖ్యను పెంచే అవకాశాలున్నా యి.యూపీఏ ప్రభు త్వం మళ్లీ అధికారంలోకి రావడం తరువాత మమతా బెనర్జీకి ఇది రెండ వ రైల్వే బడ్జెట్ అవుతుంది. రాబోయే దశాబ్దా నికి అందుబాటులో విజన్ డాక్యుమెంట్ 20 20ను మమతా ప్రవేశపెట్టనున్నారు. ఈ విజన్ 2020 డాక్యుమెంట్‌లో సమన్విత వికాసం, ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే అనేకాంశాలు ఇందులో ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరం శీతాకాల సమావేశాల్లో విజన్ 20 20 డాక్యుమెంట్‌ను మమతా బెనర్జీ మొదలు పెట్టారు.
విశ్వస నీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విజన్ 2020 డాక్యుమెంట్లో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, రైళ్ల వేగం పెంచే యోచనతో పాటు రైల్వే భూములను కమ ర్షియల్ చేయడం వంటివి కూడా ఉన్నాయి. రైల్వే బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ఒత్తిడి ఆమెపై ఉన్నా కూడా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలను దృష్టి లో ఉంచుకుని మమతా బెనర్జీ, ప్యాసెంజర్ ధరలపై ఎలాం టి సవరణలు చేయబోదు.