నెల రోజులుగా పెరిగాయ్
వారం రోజుల్లో కుంగాయ్

కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ షేర్లనే తీసుకుంటే నవంబరులో ఇవి మంచి జోరుతో దూసుకుపోయాయి. ఆ తర్వాత కుంగుతూ వచ్చాయి. ఫిబ్రవరి 15న రూ.181 వద్ద ఉన్న ఈ కంపెనీ షేరు ధర మంగళవారానికి రూ.160కు చేరింది. కాళిందీ రైల్, టిటాగఢ్ వ్యాగన్స్, టెక్స్‌మ్యాకో షేర్లది సైతం అదే బాట.(పట్టిక చూడండి).

ఈసారి బడ్జెట్ నుంచి మార్కెట్ పెద్దగా ఆశించడం లేదు కాబట్టి బడ్జెట్ అయిపోయేంత వరకూ వేచిచూడలేదు. ర్యాలీ ముందే ప్రారంభమై.. ముందే ముగిసింది.
* ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతను పెంచడం. ఆ దిశగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) పెంచడం.* కొత్త లైన్లు, గేజ్ మార్పిడి, డబుల్ లైన్లు, మెట్రోల వంటి అన్ని విభాగాలకు మంచి కేటాయింపులు.
* పాలక్కడ్(కేరళ)లో కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన.
* కోల్‌కతాలో మెట్రో రైలు సేవల రూట్ల కొనసాగింపు కోసం రూ.10,000 కోట్ల కేటాయింపు.