ఆంధ్రప్రదేశ్‌పై 'మమత'ల వర్షం
కోరుకున్న కొత్తమార్గాలు, కొత్తరైళ్ళు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : రైల్వే బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం లభించింది. ఎన్నాళ్ళ నుంచో వేచిచూస్తున్న రైల్వేలేన్లతో పాటు కొన్ని కొత్త రైళ్ళను రాష్ట్రానికి కేటాయించిన మమత ప్రత్యేక ప్రాజెక్టుల్లోనూ సికింద్రాబాద్‌కు స్థానం కల్పించారు. సికింద్రాబాద్ లో వాటర్ ప్లాంట్, స్పోర్ట్స్ అకాడమీ, సరకు రవాణా కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పదికిపైగా కొత్త రైలు మార్గాలను, డజనుకు పైగా కొత్త రైళ్ళను రాష్ట్రానికి కేటాయించారు.
రాష్ట్రానికి కొత్త రైల్వే మార్గాలు :
* కర్నూలు-మంత్రాలయం
* నిజామాబాద్-రామగుండం
* పాండురంగపురం-భద్రాచలం
* పటాన్‌చెరువు-అదిలాబాద్
* భద్రాచలం-కొవ్వూరు
* భద్రాచలం-కొత్తగూడెం
* భద్రాచలం-మల్కా్‌గిరి
* హైదరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల-జగిత్యాల
* జగయ్యపేట-మిర్యాలగూడ
* కాచిగూడ-చిట్యాల
* కాచిగూడ-చిత్తూరు
* కొత్తగూడెం-విశాఖ
* హైదరాబాద్-గజ్వేల్
* జగదల్‌పూర్-మిర్యాలగూడ
కొత్త రైల్వే లేన్ల సర్వే ప్రతిపాదనలు :
* గిద్దలూరు-బాక్రాపేట రైలుమార్గం
* విజయనగరం-పలాస వయా రాజాం
* పగిడిపల్లి-శంకరపల్లి
* భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి
* నిజాంపట్నం-రేపల్లె
* అదిలాబాద్-బోధన్