మార్కెటింగ్ మార్జిన్లపై రాయల్టీ అక్కర్లేదు
ఆర్ఐఎల్ గ్యాస్ వివాదంపై మురళీ దేవరా వివరణ
గ్యాస్ విక్రయాల మార్కెటింగ్ మార్జిన్లపై ఆర్ఐఎల్ రాయల్టీ చెల్లించక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్ఐఎల్‌కు, ప్రభుత్వానికి కుదిరిన ప్రొడక్షన్‌షేరింగ్ ఒప్పందం ప్రకారం గ్యాస్ విక్రయాలపై మాత్రమే రాయల్టీని చెల్లించాలని, మార్కెటింగ్ మార్జిన్లు ఇందులో కలపరని రాజ్యసభలో పెట్రోలియం మంత్రి మురళీ దేవరా ప్రకటించారు. ఒక ఎంబిటియు గ్యాస్‌ను 4.2 డాలర్ల చొప్పున ప్రస్తుతం ఆర్ఐఎల్ విక్రయిస్తోంది. ప్రతీ ఎంబిటియు గ్యాస్ విక్రయాలపై 0.134 డాలర్ల మార్కెటింగ్ మార్జిన్‌ను కూడా రిలయన్స్ వసూలు చేస్తోంది.
అయితే.. ఈ మార్కెటింగ్ మార్జిన్ల మొత్తాన్ని గ్యాస్ ధరకు ఆర్ఐఎల్ కలపడం లేదు. కేవలం గ్యాస్‌ధరపై మాత్రమే రాయల్టీని ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనని తీవ్రంగా వ్యతిరేకించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్(డిజిహెచ్) మార్కెటింగ్ రూపంలో వచ్చే రెవిన్యూను మొత్తం ఆదాయానికి కలపాలని డిమాండ్ చేస్తోంది.