* ప్రైవేటీకరణ ఉండదు
* స్థానిక భాషల్లోనే రైల్వే పరీక్షలు
* రైల్వే భద్రత రాష్ట్రాలకు బదలాయింపు

రైల్వే బడ్జెట్ వివరాలు...
* ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో పాటు స్థానిక భాషల్లోనే రైల్వే పరీక్షలు.
* రైల్వేలో ప్రైవేటీకరణ, వాటాల విక్రయం ఉండదు.
* వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక రైళ్లు.
* రైల్వే విచారణకు 138 కొత్త నెంబర్
* ఢిల్లీ, సికింద్రాబాద్, చెన్నై, కోల్‌కతా ముంబయిల్లో క్రీడా అకాడమీలు.
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కొత్తగా శాంతి ఎక్స్‌ప్రెస్.
* రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల విస్తరణ.
* రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం.
* ప్రైవేటు భాగస్వామ్యంతో ఆదాయం పంచుకునే పద్ధతిలో కొత్త రైలు మార్గాల రూపకల్పన.
* రైలు ప్రమాదాల నివారణకు నిధుల పెంపు.
* పర్యాటక కేంద్రాలను కలుపుతూ కొత్తగా సంస్కృతి ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు.
* పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనల సరళీకరణ.
* గత బడ్జెట్‌లో చెప్పినట్లు 120 రైళ్లలో 117 వచ్చే నెలలోనే ప్రారంభం.
* ఏడాదికి సుమారు వెయ్యి కిలోమీటర్ల కొత్తరౖౖెలు మార్గాలు.
* ప్రయాణీకులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఆరు ప్రాంతాల్లో రక్షిత నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు.
* రైల్వే అభివృద్ధి మిషన్-2020 కార్యక్రమం.
* ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యాలకు అదనంగా రూ.400కోట్లు.
* ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టులు, పంచాయితీలు, ఐఐటీల్లోనూ ఈ టికెట్ రిజర్వేషన్ల ఏర్పాటు.
* మూడు డివిజన్లలో రైళ్లు ఢీ కొనకుండా ప్రత్యేక వ్యవస్థ.
* మౌలిక సదుపాయాల పెంపునకు ప్రత్యేక దృష్టి.
* రైల్వే ఉద్యోగులకు పదేళ్లలో కొత్త ఇళ్ల నిర్మాణం.
* రైల్వే ఉద్యోగులకు వైద్య సౌకర్యాల పెంపు.
* 93 ప్రధాన స్టేషన్లలో మల్లీలెవల్ పార్కింగ్ కేంద్రాలు.
* తమిళనాడులో పెరంబూదురు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ.
* ప్రమాదాల నివారణకు క్రాసింగ్‌ల వద్ద 17వేల కొత్త సిబ్బంది.
* రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో మాజీ సైనికుల నియామకం.
* ఖరగ్‌పూర్‌లో లోకో పైలట్ శిక్షణ కేంద్రం.
* భూమి లభిస్తే సింగూర్‌లో రైల్వే ఫ్యాక్టరీ.
* డబుల్ డెక్కర్ రైలు ప్రయోగాత్మకంగా అమలు.
* కామన్‌వెల్త్ క్రీడలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.
* సరకు రవాణా ఛార్జీల పెంపులేదు.
* ఏడాదిలోగా రాయబరేలి ఫ్యాక్టరీ పనులు.
* సికింద్రాబాద్‌లో వేగన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
* స్లీపర్ క్లాస్‌లో సర్వీస్ ఛార్జి రూ. 10 తగ్గింపు.
* హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ఏర్పాటు.
* వ్యాన్ల ద్వారా రైల్వే టికెట్ల అమ్మకం.
* రవీంద్రనాథ్ ఠాగూర్- కాలిత భారత తీర్థ పేరుతో దేశం నలుమూలలను కలిపే కొత్త సర్వీసు.
* భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు రైల్వే లింకు.
* బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
* మహారాష్ట్రలో సరకు రవాణా కేంద్రం.
* 10 ఎకో పార్కింగ్ కేంద్రాలు.
* బెంగళూరులో డిజైన్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ సెంటర్.
* రైళ్లలో గ్రీన్ టాయిలెట్ల నిర్మాణం.
* రైళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.1300కోట్లు.
* 12 మహిళా ఆర్పీఎఫ్ బెటాలియన్లు.
* కొత్త రైల్వేలైన్లకు రూ.4,848కోట్లు
* దేశవ్యాప్తంగా గోల్డెన్ కారిడార్ ఏర్పాటు.