Thursday, February 25, 2010

రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు

రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు
* వలస కార్మికుల కోసం కర్మభూమి రైళ్లు.
* దేశంలో 10 ఆటోమొబైల్‌ హబ్‌లు.
* సికింద్రాబాద్‌, బర్దమాన్‌, గౌహతి, భువనేశ్వర్‌, హల్దియాలలో వ్యాగన్ల పరిశ్రమలు
* సికింద్రాబాద్‌, ఢిల్లీ, చెన్నై, ముంబయిలలో క్రీడా అకాడమీలు.
* ఢిల్లీ, సికింద్రాబాద్‌, కోల్‌కతా, చెన్నై, ముంబయిలో క్రీడాకారులకు మరింతగా ఉపాధి.
* దక్షిణ మధ్య రైల్వేకు గతేడాది కంటే రూ.288 కోట్లు అదనంగా కేటాయింపులు.
* అత్యంత వేగంతో రైళ్ల ప్రయాణానికి వీలుగా ప్రత్యేకంగా 'హైస్పీడ్‌ ప్యాసింజర్‌ క్యారిడార్లు'
* ఖరగ్‌పూర్‌లో రైల్వే పరిశోధన కేంద్రం.
* 2010 కామన్‌వెల్త్‌ క్రీడా పోటీలకు ప్రత్యేక రైళ్లు.
* 2010 మార్చిలోపు ఇప్పటికే ప్రకటించిన 117 రైళ్లు ప్రారంభం.
* ప్రైవేటు పెట్టుబడుల ప్రతిపాదనలపై 100 రోజుల్లో నిర్ణయం తీసుకొనేలా టాస్క్‌ ఫోర్స్‌.
* అండమాన్‌, నికోబార్‌దీవుల్లో తొలిరైలు మార్గం.
* శీతలీకరణ సదుపాయాలున్న కంటైనర్ల తయారీకి 'కిసాన్‌ విజన్‌ ప్రాజెక్ట్‌'
* రైల్వే ఉద్యోగులకు బీమా
* ప్రైవేట్‌ నిర్వాహకులు ప్రత్యేక సరకు రవాణా రైళ్లను నిర్వహించుకునే వెసులుబాటు.
* అగర్తాలా నుంచి బంగ్లాదేశ్‌లోని అకూరా వరకు రైలు మార్గం.
* అక్రెడిటెడ్‌ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో ఒకసారి ఛార్జీల్లో 50% దాకా రాయితీ. జర్నలిస్టుల 18 ఏళ్లలోపు పిల్లలకు ఏడాదిలో ఒకసారి 50 శాతం రాయితీ.
బీహారీల హవా
*బీహార్‌ నేతలు అత్యధికంగా 25 రైల్వే బడ్జెట్లను రూపొందించారు.
*రాష్ట్రం నుంచి ఏడుగురిని రైల్వే మంత్రులుగా చేసిన ఘనత కూడా బీహార్‌దే
*బీహార్‌ నుంచి జగ్జీవన్‌రామ్‌ ఏడుసార్లు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
*ప్రస్తుత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గతంలో ఆరుసార్లు రైల్వే బడ్జెట్‌ను సమర్పించారు
*లాలు తన హయాంలో ఐదు రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.