పరిశ్రమల ప్యాకేజీల్లో మార్పు
న్యూఢిల్లీ: ఎగుమతులు ప్రధాన లక్ష్యంగా గల సంస్థల కు ఇప్పటి వరకూ వర్తింపచేసిన ఉద్దీపన ప్యాకేజీల్లో కొ న్నింటిని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఉపసంహరించుకోనుంది. ఆయా పరిశ్రమల స్థితిగతులను ఏప్రిల్‌లో సమీక్షించిన అనంతరం, అవసరమైన పరిశ్రమలకు తిరిగి కొన్ని ప్యాకేజీలను ప్రకటించనుంది. మార్చి 31 తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వాణి జ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అసోచామ్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య మాట్లాడు తూ, పొగాకు, మసాలా దినుసులు, వజ్రాలు, రసాయనాలు, ఆభరణాలు లాంటి పరిశ్రమలు గత కొద్దినెలల్లో సంతృప్తికరస్థాయిలో వృద్ధిని కనబర్చాయని అన్నారు.
టెక్స్‌టైల్స్, హస్తకళలు, కార్పెట్, ఇంజినీరింగ్ వస్తువులు లాంటి రంగాలపై నేటికీ అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందన్నారు. ఇతర రాయితీలతో పాటుగా, నూతన మార్కెట్ల అన్వేషణలో సహాయం, డ్యూటీ రిఫండ్ స్కీమ్‌ను 2010 డిసెంబర్ వరకు పొడిగించడం లాంటి ప్రోత్సాహక చర్యలను మంత్రిత్వ శాఖ ప్రకటించిందని అ న్నారు. బడ్జెట్ అంచనాల గురించి మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖకు గతంలో కేటాయించిన రూ. 3,652 కోట్ల కేటాయింపులను తగ్గించవద్దని కోరినట్లు సింధియా తెలిపారు. ఎగుమతులు మెరుగుపడడం, పారిశ్రామిక ఉత్పత్తి పెరగడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకునిధులను తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.