Wednesday, February 24, 2010

పొగాకుకు ధర కావాలి

‘దొర ’ పొగాకుకు ధర కావాలి
pogakuఏలూరు-మేజర్‌న్యూస్‌ప్రతినిధి : రాష్ర్టంలో ఎక్కడా పండని నాణ్యమైన దొరపొగాకు (వర్జీనియా) పశ్చిమగోదావరి జిల్లాలో పండుతోంది. ఈఏడాది కూడా గత ఏడాది మాదిరిగా గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరు తున్నారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొయ్యలగూడెం- మినహా అ న్ని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్ళు ప్రారంభం అవుతున్నాయి. కొయ్య లగూడెంలో రూ. 8.5 కోట్లతో పొగాకు బోర్డు నియమించిన సొంత వేలం కేంద్రాన్ని మార్చి మొదటి వారంలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయక మంత్రి జ్యోతిరాదిత్య సింథియా దీనిని ప్రారంభించ నున్నారు. కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం లభించడంతో పాటు ప్రత్యక్ష, పరోక్షంగా లక్షలాది మందికి వర్జీనియా సాగు ద్వారా ఉపాధి లభిస్తోంది.

రాష్ట్రంలో ఎస్‌ఎల్‌ఎస్‌, బిఎల్‌ఎస్‌, ఎస్‌విఎస్‌, ఎన్‌ఎల్‌ఎస్‌ పేర్ల తో వివిధ రకాల పొగాకు రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో పశ్చిమగోదావరితో పాటు ఖమ్మం జిల్లాలో కొంత మేర తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోను, శ్రీకాకుళం జిల్లా సాలూరులో కొంతమేర ఎన్‌ఎల్‌ఎస్‌ (ఉత్తర ప్రాంత తేలిక స్వభావనేలలు) పేరుతో వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నారు. దీనికి దొరపొగాకు అనే పేరు కూడా ఉంది. ఈ పంటలో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చే స్తున్నారు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో 28 వేలహెక్టార్లల్లో వర్జీనియా పొగాకు సాగు అవు తోంది. ఇందు కోసం 10 వేల మంది రైతులు, 12 వేల బ్యారన్లను పొగాకు బోర్డు వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ ఏడాది 51 మిలియన్లు పొగాకు పంటకు బోర్డు అనుమతించగా 58 మిలియన్లు ఉత్పత్తి అవుతుందని అంచాన వేస్తున్నారు. అనధికార సాగు మూలంగా రైతులకు గిట్టుబాటు ధర ఏ మేరకు లభిస్తుందోననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

రూ. 130 ప్రారంభ ధర : గత ఏడాది వర్జీనియా వేలం కేంద్రాల్లో కిలో రూ. 100తో పొగాకు వేలం ప్రారంభం కాగా ఈ ఏడాది రూ. 130తో మొద లు పెట్టాలని పొగాకు బోర్డు చైర్మన్‌ సురేష్‌ అఖిలభారత పొగాకు వ్యాపారు లను కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాల పురం కేంద్రాల్లో గురువారం నుంచి వేలం ప్రారంభం కానుంది. గత ఏడాది అత్యధిక ధర రూ.165 కాగా ఈ ఏడాది ఖర్చులు పెరిగినందున రూ. 175 వరకు ధర వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. పొగాకు బోర్డు ద్వారా లైసెన్స్‌ గల రైతులకు పొగాకు క్యూరింగ ్‌కై బొగ్గు, అల్లిక యంత్రాలు, టార్పాలిన్స్‌ తదితర అవసరాలు తీరుస్తున్నారు. ఎరువులు అందజేస్తున్నారు. లైసెన్స్‌ ఉన్నరైతుకు రూ. 3.50 లక్షల వరకు బ్యాంకులు టైఅప్‌ పథకం ద్వారా రుణా లు ఇస్తున్నాయి.

ప్రతి రైతుకు 50 క్వింటాళ్లు లేదా 5 ఎకరాల పంటను బోర్డు అనుమతిస్తోంది. దీంతో రైతులు వెలంవెర్రిగా పొగాకు సాగు చేస్తూ వరి పొలాల్లో కూడా దీనిని పండిస్తున్నారు. దీనివలన నాణ్యత లేని (సైలైన్‌) పొగా కు ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వాతావరణం సహకరించకపోవడం వలన దిగుబడి గణనీయంగా తగ్గింది. గతంలో ఎకరానికి 7.8 క్వింటాళ్ల పొ గాకు సగటు దిగుబడి రాగా ఈ ఏడాది 7 క్వింటాళ్ళు కూడా వచ్చే అవకా శం లేదని రైతులు వాపోతున్నారు. అందుకే పొగాకు ప్రారంభ ధర రూ. 150 చేయాలని కోరుతున్నారు. కష్టపడి నాణ్యమైన పొగాకు ఎన్‌ఎల్‌ఎస్‌ పండిస్తు న్నామని అందుకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని కోరుతున్నారు.