Wednesday, February 24, 2010

బడ్జెట్‌ పదజాలం

బడ్జెట్‌ పదజాలం

దేశ దిశా నిర్దేశాన్ని చూపించే బడ్జెట్‌ ఎంతో క్రియాశీలకమైనది. ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 26వ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ వాతావరణ సందర్భంగా కనిపించి, విని పించే పదజాలానికి సంబంధించిన అవగాహన పాఠకులలో కల్పించ డానికి వాటి అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాము.

  • బ్యాలెన్స్‌ షీట్‌ : అంటే యేడాది పొడవునా ప్రభుత్వం ద్వారా చేపట్టిన పను లు, రావాల్సిన ఆదాయంతో పాటు ప్రభుత్వం ఖర్చులు ఇందులో వివ రంగా ఉంటాయి.
  • ఏకీకృత నిధి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌): ఇది ప్రభుత్వానికి ఆయువు పట్టు వంటిది. ప్రభుత్వం సేకరించే రకాల రుణాల ద్వారా వచ్చే ఆదాయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రాలకు కేటాయించే నిధులు కూడా దీని ద్వారా జారీ అవుతాయి.
  • కంటిన్‌జన్సీ ఫండ్‌: అంటే ఇది ఆపదకాల నిధి అంటారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆపదకాలపు అవసరాలను ఈ 500కోట్ల రూపా యల ఫండ్‌ ద్వారా పూర్తి చేయబడతాయి. దీని కోసం రాష్టప్రతి ఆమోదం తప్పనిసరి. ఈ ఫండ్‌ ద్వారా ఉపయోగపరుచుకున్న నిధులను కన్సాలి డేటెడ్‌ ఫండ్‌ ద్వారా తిరిగి జమ చేస్తారు.
  • ప్రభుత్వ ఖాతా: ఈ అకౌంట్‌ పేరులోనే మనకు అర్థం స్పష్టం అవుతుంది. ఇందులో ప్రభుత్వ పాత్ర ఒక రుణదాత లేదా బ్యాంకరు కంటే ఎక్కువేమి కాదు. ఇది పబ్లిక్‌ ఫ్రావిడెంట్‌ ఫండ్‌ల మాదిరిగానే సామాన్య ప్రజల డబ్బులతో తయారవుతుంది.
  • ప్రత్యక్ష పన్ను :ఇందులో మీరు, మేము (మనమంతా అంటే ఇండియా ఇంక్‌ సంస్థలన్నీ) కూడా తమ ఆదాయాలపై ప్రభుత్వానికి చెల్లించే సుం కం. ఇందులో ఎఫ్‌బీటీ, ఎస్‌టీటీ, సీటీటీ సుంకాలు అదనంగా ఉంటా యి.
  • పరోక్ష పన్ను: ఈ సుంకం మరో చెంప పెట్టువంటిది. మనం చేసే ఖర్చు లపై విధించే అత్యవసరమైన సుంకం ఇది. ఇందులో కస్టమ్‌, ఎకై్సజ్‌, సర్వీ స్‌ ట్యాక్స్‌లు కూడా వేరుగా ఉంటాయి.
  • కార్పొరేషన్‌ ట్యాక్స్‌: అంటే ఈ సుంకం భారం భారత దేశంలో స్థాపింప బడిన పరిశ్రమల (ఇండియా ఇంక్‌) లాభాలపై ఆధారపడి ఉంటుంది.
  • కస్టమ్‌ పన్ను : విదేశాల్లో ద్వారా ఖరీదు చేసిన ఏ వస్తువు మీదనైనా ఈ సుంకం అమలౌతుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రెండు రకాల లాభా లుంటాయి. ఒకటి సర్కారు ఖజానాలో డబ్బు చేరడం, రెండవది దేశీయ ఉద్యోగుల శ్రేయస్సుకై ప్రభుత్వం రక్షణగా నిలుస్తుంది.
  • సేవా పన్ను : బజారులో లభ్యమయ్యే పలు రకాల సేవలు అంటే మొబైల్‌ ఫోన్లు, సెలూన్లు, కోచింగ్‌ సెంటర్లు తదితరులు కొంత మేర సుంకం కట్టా ల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ సేవల ద్వారా సర్వీసు పన్నును వసూలు చేస్తుంది.
  • వ్యాట్‌, జీఎస్‌టీ: ఇందులో ఉత్పత్తులు ధర, ఉత్పత్తుల తయారీ కోసం అయిన వ్యవధి మధ్యన ఉన్న అంతరంపై ఆధారపడి ఉంటుంది. అంటే సంస్థల ఉత్పత్తులు తయారు చేసే ప్రక్రియ మొత్తంపైన కూడా ఈ సుంకం విధిస్తారు.దీని ద్వారా ఉత్పత్తి అయిన వస్తువు పై విధించే మరిన్ని సుం కాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఉత్పతి వస్తువు వేరు వేరు మాధ్యమాలు లేదా చరణాల ద్వారా పూర్తవుతుంది. మరో వైపు జీఎస్‌టీ లేదా గూడ్స్‌ ఎండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌లో ఎలాంటి సామానుకు సం బంధించిన వ్యయంపైన కూడా అన్ని రకాలుగా సుంకాలు అమలౌతా యి. ఇందులో కేంద్ర, రాజ్య సంబంధిత సుంకాలు కూడా ఉంటాయి.
  • ట్రెజరీ బిల్‌ : ఈ ట్రెజరీ బిల్లు ఓ బాండ్‌ వంటిది. సంవత్సరం కాలపరి మి తి లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ గల బాండ్‌ల ద్వారా ఖర్చులు, రా బడులపై వచ్చే స్వల్ప కాలిక సమస్యలను పరిష్కరిస్తారు. ఇందులో దీర్ఘ కాల వ్యవధి గల పరిపక్వత బాండ్లను డేటెడ్‌ సెక్యూరిటీ అని కూడా అంటారు.
  • మార్కెట్‌ స్టెబిలైజేషన్‌ : (ఎంఎస్‌ఎస్‌) ఈ పథకాన్ని 2004లో అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ సెక్యూరిటీ ఖర్చులను పూర్తి చేయడానికే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద సెక్యూరిటీ ఆస్తు ల కింద పెట్టడం జరుగుతుంది. తద్వారా ఆరబీఐకు మార్కెట్లో లిక్విడిటీ పెంచేందుకు తగిన వీలు కల్పిస్తుంది.
  • ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌: అంటే ఆర్థిక సమ్మిళితం. ఇందులో చిన్న చిన్న గ్రామాలను దత్తత తీసుకుంటారు. దీని ద్వారా ప్రజలందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండాలనేది దీని ఉద్దేశ్యలక్ష్యం.సామాన్య ప్రజలందరికీ సమ యానికి అందుబాటులో రుణ సదుపాయం. ఆధునిక బ్యాంకుల హడావుడి ఇందులో మనకు కనిపించదు. అందరికీ అర్థమయ్యేలా ప్రతి ఒక్కరు బ్యాంకుల వద్దకు వెళ్లి పనులు పూర్తిచేసుకునే వీలుంటుంది. మొదటి నుంచీ ఈ పథకం వడివడిగా నడుస్తోంది.
  • గుత్త సంస్థల నిరోధక చట్టాలు: గుత్త సంస్థలు మిగిలిన సంస్థలను విలీ నం చేసుకొని మొత్తం మార్కెట్‌ను ఆధీనంలోకి తెచ్చుకొనే ధోరణిని ఈ చట్టాలు నిరోధిస్తాయి. మార్కెట్‌లోని పోటీని కాపాడడం, ప్రోత్సాహిం చడం కోసం ఈ చట్టాలు చేస్తారు.
  • ద్రవ్య వినియోగాధికారం : ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక నిర్ధిష్టమైన పనికోసం లేదా పద్దు కోసం నిధులు వెచ్చించడానికి చట్ట సభ ఇచ్చే అధికారం.
  • ద్రవ్య వినియోగ పద్దులు: ఏయే శాఖకు ఎంతెంత కేటాయింపులు జరుపుతూ పార్లమెంటు ఆమోదం తెలిపిందో సూచించే పద్దులు.
  • ద్రవ్య వినియోగ బిల్లు: ప్రభుత్వ ఖజానా నుంచి ఒక నిర్ధిష్ఠమైన పని కోసం నిధులు వెచ్చించడానికి అనుమతించే బిల్లు. నిధుల డిమాండుల పద్దు లను పార్లమెంటు ఆమోదించిన తరువాతే ఈ బిల్లు ప్రతిపాదిస్తారు. నిధుల డిమాండుల పద్దులో చూపించిన మోత్తాలను సంచిత నిధి నుంచి వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా కోరుతూ పార్లమెంటు కు సమర్పించే బిల్లు. ఈ బిల్లు ఆమోదం పొందితేనే ఆయా మంత్రిత్వ శాఖలకు నిధుల్ని ఖర్చు చేసే అధికారం సంక్రమిస్తుంది.
  • సంతులిత బడ్జెట్‌: ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం సరిసమానమైనప్పుడు ఈ బడ్జెట్‌ సాధ్యమౌ తుంది. ప్రభుత్వ ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు అది లోటు బడ్జెట్‌ అవుతుంది. ఆదాయం ఎక్కువయ్యి వ్యయం తక్కువగా ఉన్నప్పుడు అది మిగులు బడ్జెట్‌ అవుతుంది.
  • సమాభివృద్ధి : జాతీయ ఆర్థిక సూచికలైన ఆదాయం, వినియోగశక్తి, పెట్టు బడుల నిల్వ, ఉపాధి అవకాశాలు నాలుగూ ఒకే రేటు చొప్పున పెరు గుతూ ఉంటే దానిని సమాభి వృద్ధి అంటారు.
  • చెల్లింపుల సమతుల్యం:ఒక దేశం నిర్ధిష్ఠకాలంలో పెట్టుబడులు, పర్యా టక వ్యయం, బంగారం రూపేణా విదేశాలకు చెల్లించే మొత్తానికి, విదే శాల నుండి స్వీకరించే ఆదాయానికి ఉన్న తేడా. విదేశాల నుండి మన దేశం స్వీకరించే ఆదాయం ఎక్కువగా ఉంటే మన దేశం వద్ద విదేశీ మార కపు నిల్వలు పెరుగుతాయి. ఇలా ఉండడం దేశ ఆర్థికాభివృద్ధికి చిహ్నం. మన దేశం చెల్లించే మొత్తాలు ఎక్కువైతే విదేశీ మారక నిల్వలకు కొరత ఏర్పడుతుంది. ఇది దేశ ఆర్థిక వెనుకబాటుతనానికి చిహ్నం.
  • బెలూన్‌ పేమెంట్‌ : తక్కువ మొత్తాలు చెల్లించడంతో ప్రారంభమై ఎక్కువ మొత్తాలు చెల్లించే వాయిదాల పద్ధతి.
  • బ్యాంకు రేటు: రిజర్వు బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. బ్యాంకులకు నగదు నిల్వల కొరత ఏర్పడినప్పుడు రిజర్వు బ్యాంకు ఇలాంటి రుణాలను ఇస్తుంది. ఆరి క వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు బ్యాంకు రేటు తగ్గిస్తారు. ద్రవ్యో ల్బణాన్ని అదుపు చేయవలసి వచ్చినప్పుడు ఈ రేటు పెంచుతారు.
  • బ్యాంకు నిల్వలు: రిజర్వు బ్యాంకు వద్ద నిల్వ ఉన్న మొత్తం కరెన్సీ. ఒక నిర్ధిష్ఠ సమయంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల ఖజానాల్లో తనిఖీకు వీలైన డిపాజిట్లలో నిల్వ ఉండే మొత్తం ధనం.
  • బెనెలక్స్‌: బెల్జియం, నెదర్లాండ్స్‌, లగ్జంబర్గ్‌ దేశాలు కలిపి 1948లో ఏర్పా టు చేసుకున్న ఆర్థిక కూటమి. మూడు దేశాల తొలి అక్షరాలను కూర్చి ఈ కూటమి పేరు ఖాయం చేశారు. ఉమ్మడి విదేశీ వాణిజ్య విధానాన్ని అమలుచేయడం, సభ్యదేశాల మధ్య సరుకులు, సేవల రవాణాపై పరి మితులు ఎత్తివేయడం ఈ కూటమి లక్ష్యాలు.