Wednesday, February 24, 2010

వ్యాట్‌ తగ్గించాలి : సిమెంట్‌ కంపెనీలు

వ్యాట్‌ తగ్గించాలి ః సిమెంట్‌ కంపెనీలు
bag_Cementన్యూఢిల్లీ: సిమెంట్‌పై వాల్యూ యాడెడ్‌ టాక్స్‌ (వ్యాట్‌)ను, స్టీల్‌ లాంటి ఇతర భవన నిర్మా ణ సామగ్రిపై ఉన్న స్థాయికి తగ్గించాలని సిమెంట్‌ పరిశ్రమ కోరుతోంది. జిప్సం, బొగ్గుపై దిగుమతి సుంకాన్ని తగ్గిం చాలని కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇతర భవన నిర్మాణ సామగ్రితో పోలిస్తే సిమెంట్‌పై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఏసీసీ లిమిటెడ్‌ ఎండీ సుమిత్‌ బెనర్జీ అన్నారు. స్టీల్‌ పై వ్యాట్‌ నాలు గు శాతం మాత్రమే ఉండగా, సిమెంట్‌పై అది 12.5 శాతంగా ఉందన్నారు. ఈ రెండు కూడా భవన నిర్మాణం లో ఉపయోగించేవే కాబట్టి స్టీల్‌తో సమానంగా సిమెం ట్‌పై వ్యాట్‌ విధించాలని పరిశ్రమ కోరుకుంటోంది. భవన నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిలో అత్యధిక స్థాయిలో వ్యాట్‌ సిమెంట్‌పైనే ఉంది.

ప్రభుత్వాలు విధించే పన్నులు, సుంకాలు అన్నీ కలిపితే, ఎక్స్‌ ఫ్యాక రీ ధరలో 60 శాతానికి మించే అవే ఉంటాయని ఫిక్కీ ఆ ర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో మరే దేశంలో లేనంతగా మనదేశంలో సిమెంటు పై పన్నుల భారం ఉందని తెలిపింది. ఆయా దేశాల్లో సగటు పన్ను శాతం 11.4గా ఉందని, శ్రీలంక లో మాత్రమే 20 శాతంగా ఉందని పేర్కొంది. బొగ్గు, జిప్సం లాంటి వాటిపై దిగుమతి సుంకాలను తొలగించాలని బెనర్జీ డిమాండ్‌ చేశారు. దేశంలోకి దిగుమతి అయ్యే సిమెంటుపై సుంకాలు విధించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దాల్మియా సిమెంట్‌ (భారత్‌) ఎండీ పునీత్‌ దాల్మియా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టీల్‌ తరహాలో సిమెంట్‌కు కూడా డిక్లేర్డ్‌ గూడ్స్‌ హోదాను పరిశ్రమ కోరుకుంటున్నదని అన్నారు. దీని వల్ల పరిశ్రమకు పన్నుల వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. సిమెంటు పరిశ్రమ ఇప్పుడు మిగులు సామర్థ్యం దశకు చేరుకుంది.

ఎగుమతులపై గనుక నిషేధాన్ని తొలగిస్తే, నూత నంగా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా చేయకుంటే, మధ్యప్రాచ్యంలో లభించే అవకాశాలను పాకిస్తాన్‌ లాంటి ఇ తర దేశాలకు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దాల్మియా అన్నారు. సిమెంటు, క్లింకర్‌ ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్‌ పాస్‌బుక్‌ (డీఈపీబీ) రూపంలో ఎగుమతి ప్రోత్సాహకాలను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. సిమెంటు తలసరి వినియోగంలో దేశం బాగా వెనుకబడి ఉంది. మౌలికవసతులను బాగా వృద్ధి చేయ డం ద్వారా దేశంలో సిమెంటు వినియోగాన్ని పెంచవచ్చని పరిశ్రమ భావిస్తోంది.