
కృత్రిమ కొరతతో రైతు బేజారు
వ్యాపారులు చెప్పిందే ధర
బస్తాకి గరిష్ఠంగా రూ.125వరకు అధికం
చేష్టలుడిగిన వ్యవసాయశాఖ

దోచేస్తున్నారిలా..: అధికారికంగా బస్తా ధర రూ.250.80
*సాగర్ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం జిల్లాలో కొన్నిచోట్ల రూ.375కి విక్రయిస్తున్నారు. అంటే 50శాతం అధిక ధర.
*నల్గొండజిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో రూ. 100 వరకు ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి.
*ప్రకాశం జిల్లాలో రూ.100 అధిక ధరకు విక్రయిస్తున్నారు.
*కడప జిల్లాలో నాలుగు రోజుల కిందటి వరకు యూరియా నిల్వలే లేవు. తాజాగా సరుకు వచ్చినా ఎక్కువ ధర పెట్టక తప్పడం లేదు.
*వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి సొంత జిల్లా అనంతపురంలోనూ బస్తాకి రూ.30 అధిక ధర పెట్టాల్సి వస్తోంది.
*మెదక్ జిల్లాలో రైతులకు అవసరం లేని గుళికల మందులు కొంటేనే యూరియా అమ్ముతామని కొందరు వ్యాపారులు షరతు విధిస్తున్నారు. ఈ జిల్లాలో 2వేల టన్నుల కొరత ఉందని అంచనా.
*కరీంనగర్ జిల్లాలో కొరత అధికంగా ఉంది. అదనంగా మరో 9వేల టన్నులు అవసరమని అంచనా.
*తూర్పు గోదావరి జిల్లాలో రూ.70వరకు అధికం.
*గుంటూరు జిల్లాలో రూ.60 వరకు అధిక ధర ఉండగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో ఏకంగా రూ.125కి పైగా ఎక్కువకు విక్రయిస్తున్నట్లు సమాచారం. 
కృత్రిమ కొరత, అధిక ధరలపై వ్యవసాయ శాఖ దృష్టి సారించడం లేదు. పకడ్బందీగా తనిఖీలు చేయడం లేదు. ఈ పరిస్థితిపై 'న్యూస్‌టుడే' వ్యవసాయశాఖ కమిషనర్ సునీల్‌శర్మను సంప్రదించగా అధిక ధరకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పడం గమనార్హం.
