Wednesday, February 24, 2010

రాష్ట్రానికి మమత వరాలు

రాష్ట్రానికి మమత వరాలు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ పార్లమెంటులో రెండో సారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి రైలు ఛార్జీలు పెంచే యోచన లేదని ఆమె తెలిపారు.
రాష్ట్రానికి మమత వరాలు..
* సికింద్రాబాద్‌లో క్రీడా అకాడమీ.
* సికింద్రాబాద్‌లో రైల్వే వేగన్స్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు.
రాష్ట్రానికి మంజూరైన కొత్త రైల్వేలైన్లు..
* భద్రాచలం- కొవ్వూరు
* భద్రాచలం- కొత్తగూడెం
* భద్రాచలం- సత్తుపల్లి
* మంత్రాలయం రోడ్డు- కర్నూలు
* నిజామాబాద్‌- రామగుండం
* పాండురంగాపురం భద్రాచలం
* పటాన్‌చెరు- ఆదిలాబాద్‌
* హైదరాబాద్‌- గజ్వేల్‌
* సిద్ధిపేట-సిరిసిల్ల-జగిత్యాల
* జగ్దల్‌పూర్‌-మిర్యాలగూడ
* కాచిగూడ- చిట్యాల
* గిద్దలూరు-బాకారావుపేట
* నిజాంపట్నం- రేపల్లె
* విజయనగరం-పలాస-రాజాం
* విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం డబ్లింగ్‌ పనులు
రాష్ట్రానికి కొత్తరైళ్లు..
* ముంబయి- పుణె- తిరుపతి- కంచి
* మైసూర్‌- బెంగళూరు- తిరుపతి- పుణె
* భోపాల్‌- తిరుపతి- కంచి- చెన్నై- రామేశ్వరం- కన్యాకుమారి
* ముంబయి- సికింద్రాబాద్‌
* మధురై- తిరుపతి
* బెంగళూరు- తిరుపతి(ఇంటర్‌ సిటీ)
* తిరుపతి- సికింద్రాబాద్‌
* తిరుపతి- మదనపల్లె(ప్యాసింజర్‌)
* విజయవాడ- గుంటూరు- చెన్నై(ప్యాసింజర్‌)
* కాచిగూడ- మిర్యాలగూడ(ప్యాసింజర్‌)
* కాకినాడ-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ షిర్డీ వరకూ పొడిగింపు
* సికింద్రాబాద్‌-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ షిర్డీ వరకు
* ఫలక్‌నుమా-లింగపల్లి మధ్య మహిళలకు ప్రత్యేక రైలు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసే కొత్త లైన్లు
* కోటిపల్లి-నర్సాపూర్‌
* పుట్టపర్తి- తిరుపతి
* నడికుడి- శ్రీకాళహస్తి
* మిర్యాలగూడ- జగ్గయ్యపేట