Monday, April 5, 2010

అప్రమత్తత అవశ్యం!

నిఫ్టీ ఫ్యూచర్స్ వరుసగా ఎనిమిదో వారం కూడా ఎగువ దిశగా పయనాన్ని కొనసాగించినప్పటికీ వారం మొత్తం మీద ఫ్లాట్‌గా ముగిసింది. గత రెండు వారాలుగా పరిమితంగానే కదలాడుతూ గత వారం అనిశ్చితంగా ముగిసి టెక్నికల్‌గా దోజీ పాటర్న్‌ను సాధించింది. వారం మొత్తం మీద ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉండగా అంతర్జాతీయ, దేశీయ సంకేతాలు పాజిటివ్‌గానే ఉన్నాయి.


ఈ వారం నుంచి కార్పొరేట్ కంపెనీలు నాలుగో త్రైమాసికం/వార్షిక ఫలితాల వెల్లడి ప్రారంభం కానుండడం, ఆర్థిక రంగం మౌలికాంశాలు కూడా మెరుగ్గానే ఉండడం కారణంగా టెక్నికల్‌గాను, ఫండమెంటల్‌గాను కూడా మార్కెట్ మంచి స్థాయిలోనే ఉండాలి. మధ్యకాలిక ధోరణి నుంచి దీర్ఘకాలిక ధోరణిపరంగా చూస్తే మార్కెట్లు సాధారణంగా మెరుగ్గా ఉండే ఆస్కారమే అధికం. కాని స్వభావరీత్యా మార్కెట్ భవిష్యత్తుని డిస్కౌంట్ చేసి స్వల్పకాలంలో మార్కెట్ భాగస్వాములను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది.

జ్యోతిష్యపరంగా మాత్రం ముందున్నది గడ్డుకాలంగానే కనిపిస్తోంది. వచ్చే నెల రోజుల వ్యవధిలోను ప్రత్యేకించి ఏప్రిల్ 16 సమయంలో ఒకసారి, మే మొదటి వారంలో మరో సారి విశేషమైన కరెక్షన్ చవి చూసే ఆస్కారం ఉంది. అప్రమత్తత అవశ్యం. ఈ వారానికి ట్రెండ్ మార్పునకు అవకాశం ఉన్న రోజు మంగళవారం (ఏప్రిల్ 6). టెక్నికల్‌గా మార్కెట్ బలహీనపడినట్టు కనిపిస్తే లాంగ్ పొజిషన్ల నుంచి వైదొలగి కరెక్షన్ అనంతరం తిరిగి ప్రవేశించడం ఉత్తమం.

టెక్నికల్‌గా మాత్రం నిఫ్టీ 5250 దిగువన ముగిస్తే మాత్రమే బలహీనపడుతుంది. 5300 ఎగువన బలంగా ఉంటుంది. 5250-5300 మధ్య తటస్థంగా నిలుస్తుంది. ఈ స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వ్యూహాలను రచించుకోవడం మంచిది.

వారానికి టెక్నికల్ స్థాయిలు... నిఫ్టీ ఫ్యూచర్స్ ఈ వారానికి 5315 ఎగువన బలంగా ఉంటూ 5400, 5470 నిరోధస్థాయిలుగాను, 5265 దిగువన బలహీనంగా ఉంటూ 5180, 5110 బేరిష్ స్థాయిలుగాను ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ స్థితిని బట్టి ఇండెక్స్ ఈ వారానికి 5305 ఎగువన బుల్లిష్ జోన్‌లోను, 5285 దిగువన బేరిష్ జోన్‌లోను ఉన్నట్టుగా భావించాలి. గాన్ సహజసంఖ్యల ప్రకారం 5077, 5149, 5221, 5293, 5366, 5440 ఈ వారానికి సహజసిద్ధమైన మద్దతు, నిరోధ స్థాయిలుగా ఉంటాయి.

ద్వితీయార్ధంలో ఆటుపోట్లు!
(సోమవారానికి సూచన) చంద్రుడు కేతు సంబంధమైన మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రోహిణి, శ్రవణం, హస్త నక్షత్ర జాతకులు, వృషభ, మకర రాశుల వారు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.

ట్రెండ్ మార్పు వేళలు: ఉదయం 10.45, మధ్యాహ్నం 2.25
ఇంట్రాడే ట్రెండ్ : గ్రహస్థితి ఆధారంగా సోమవారం మార్కెట్ నిలకడ/కొంత మెరుగ్గా ప్రారంభమై తొలి అర్ధ భాగంలో నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. రెండో అర్ధ భాగంలో ఆటుపోట్లు (అధికంగా బుల్లిష్‌నెస్ దిశగా) ఎదుర్కొనవచ్చు. కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎఫ్ఎంసిజి స్టాక్‌లు మెరుగ్గాను, ఫార్మా, పవర్ స్టాక్‌లు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు.

ఆస్ట్రో టెక్నికల్ వ్యూహం : సోమవారం ఉదయం 10 గంటల తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రారంభ స్థాయి, డే యావరేజ్ రెండింటి కన్నా దిగువన ట్రేడ్ అవుతూ ఉంటే డే గరిష్ఠ స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని షార్ట్ పొజిషన్లు తీసుకోవచ్చు. వీటిని మధ్యాహ్నం 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఇండెక్స్ ప్రారంభ స్థాయి, డే యావరేజ్ రెండింటి కన్నా ఎగువన ట్రేడ్ అవుతూ ఉంటే 10 పాయింట్ల దిగువన స్టాప్‌లాస్‌గా పెట్టుకుని లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.వీటిని ట్రేడింగ్ ముగిసేలోగా క్లోజ్ చేసుకోవాలి. ప్రారంభ స్థాయి అత్యంత కీలకం. దానికి ఎగువన మాత్రమే లాంగ్ పొజిషన్లు సమర్థనీయం. ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్టాప్‌లాస్ తప్పనిసరి.

టెక్నికల్ స్థాయిలు : సోమవారానికి నిఫ్టీ ఫ్యూచర్స్ 5310 ఎగువన బుల్లిష్‌గా ఉంటూ 5340, 5370 నిరోధ స్థాయిలుగా ఉంటాయి. 5290 దిగువన బేరిష్‌గా ఉంటూ 5260, 5230 మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. ప్రస్తుత మార్కెట్ స్థితిని బట్టి సోమవారానికి ఇండెక్స్ 5305 ఎగువన బుల్లిష్ జోన్‌లోను, 5290 దిగువన బేరిష్ జోన్‌లోను ఉన్నట్టుగా భావించాలి.