Monday, April 5, 2010

సత్వర సేవలే ... సంస్థ పురోభివృద్ధికి దోహదం

న్యూఢిల్లీ: ఖాతా దారులు తమ నుండి సత్వరంగా సేవలు అందుకోవ డం వల్లనే బిహెచ్‌ఇఎల్‌ సంస్థ శరవేగంగా పురోగమిస్తోందని, వారి వాణిజ్య ప్రయోజనాలే ప్రధానంగా తాము పనిచేస్తున్నామని , ఇది సంస్థ ప్రగతి ప్రధాన కారణంగా నిలిచిందని ప్రభుత్వ రంగంలోని పెద్ద సంస్థ నవరత్న హోదా పొందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌ఇఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డై రక్టర్‌ బి.ప్రసాదరావు తెలిపారు.ిహెచ్‌ఇఎల్‌ ప్రస్థానంపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.‘‘విద్యుత్‌ ఉపకరణాల తయారీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను తట్టుకోగలిగిన సామర్ధ్యం సంస్థకు ఉందా?’’

‘‘తప్పకుండా ఉంది. 11వ పంచవర్ష ప్రణాళికలో అదనపు విద్యుత్‌ సామ ర్ధ్యాన్ని భారత్‌ సంతరించుకునే క్రమంలో భెల్‌ తన కృషి తాను ఎంతో సమర్థ వంతంగా నిర్వహిస్తోంది. మా సామర్ధ్యం పెంచుకోవడానికి మేము మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నాం.

అందులో మొదటిది థర్మల్‌, జల, గ్యాస్‌ ప్రాజెకు ్టలకు సంబంధించి మా ప్రధాన ప్లాంట్‌ ద్వారా 15,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కావాల్సిన పరికరాలను వార్షికంగా తయారు చేయడం, రెండవది పాత వెండార్లకు సక్రమంగా సరఫరాలను నిర్వర్తించడంతో పాటు అదనంగా కొత్త వెండార్లను వెతికిపట్టుకుంటున్నాం. గత ఏడాది 700 మంది కొత్త ఖాతా దారులు మాకు జతయ్యారు. మూడవది సంస్థ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాం. ఆ క్రమంలో 4000 మంది కొత్త ఉద్యోగుల నియామకం జరిపాం. మెటీరియల్‌ సరఫరాపై దృష్టి కేంద్రీకరి స్తున్నాం. కాస్టింగ్‌, ఫోర్జింగ్‌ ప్లాంట్లను అత్యాధునీకరిస్తున్నాం. ఈ విషయంలో బ్రిటన్‌కు చెందిన ఫెఫీల్డ్‌ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. దిగుమతు లపై ఆధారపడడం తగ్గిస్తున్నాం. మాకు తగినంత సామర్ధ్యమే లేకుంటే ఇంత డిమాండ్‌ను తట్టుకోలేం గదా!’’

‘‘అప్పుడప్పుడు సంస్థపై విద్యుత్‌ రంగం నుండి వస్తున్న విమర్శలకు మీ సమాధానం?’’
‘‘విద్యుత్‌ రంగంలో అనేక ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ప్రధాన యంత్రాల తయారీ వరకు తమ పాత్ర ఉంటుంది. మిగిలిన ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌ మెంట్‌, నిర్మాణ బాధ్యతలు వేరేవారు నిర్వహిస్తారు. ఆయా ప్రాజెక్ట్‌లకు సంబం దించి మెటీరియల్‌ అంతా ఒకేచోట పోగవుతుంది. దానివల్ల నిర్వహణలో కొం చెం ఆలస్యం కావచ్చు. క్యాస్టింగ్‌, ఫోర్జింగ్‌లకు ప్రత్యేకమైన గ్రేడ్‌ కలిగిన ఉక్కు వాడాల్సి వస్తోంది. ఇది పూర్తిగా దిగుమతులపై ఆధారపడ్డ వ్యవహారం. మా కాంట్రాక్టర్ల నుండి కూడా సమస్య ఉంది. ప్రాజెక్ట్‌ల దగ్గరకు మానవ వనరుల ను సమీకరించడం కూడా కష్టతరంగా ఉంది. ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి ఇలాంటి కారణాలెన్నో ఉంటాయి. బాధ్యత మాదొక్కటే కాదు.

‘‘మీ అణు విద్యుత్‌ పథకాలు ఎంతవరకు వచ్చాయి?’’
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్లకు కావాల్సిన అధిక సామర్ధ్యంతో కూడిన టర్బో జనరే టర్ల తయారీకి సంబంధించి న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇందుకు సాంకేతిక సహకారం అందించే విదేశీ భాగస్వామితో ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకోవాలని నిర్ణయించాం. త్వర లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాం.’’

‘‘చైనా నుండి భెల్‌ ఎలాంటి పోటీని ఎదుర్కొంటోంది’’?
‘‘చూడండి. ఎలాంటి పోటీని మనం తక్కువ తీసుకోవడానికి వీలు లేదు. చైనాతో మేము గట్టిపోటీ ఎదుర్కొంటున్న మాట నిజం. గతంలో పరిస్థితి ఇప్పు డు లేదు. అధిక నాణ్యతా సామర్ధ్యాలతో కూడిన యంత్ర సామాగ్రి తయారు చేయడంలో మేమేంటో నిరూపించుకున్నాం. చైనా తయారు చేసిన సామాగ్రికి మేము మార్పులు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మేము సరఫరా చేసిన సామాగ్రిలో అధిక శాతం ఇంతకు ముందు చైనా నుండి ఖాతాదారులు పొందినవే. అధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ అందించడంలో భెల్‌ సామాగ్రి మంచిదని మార్కెట్లో వినిపిస్తోంది’’

‘‘పునరుత్పాదక ఇంధన రంగంలో భెల్‌ పాత్ర ఎలా ఉంది?’’
‘‘పవన విద్యుత్‌ రంగంలో మేము ఎప్పుడో ప్రవేశించాం. స్వంతంగా విండ్‌ మిల్స్‌ నెలకొల్పి నిర్వహించాం. కొన్ని కారణాల వల్ల కొనసాగించలేక పోయాం. తాజాగా ఈ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్నాం. తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నాం. ఇక సౌర విద్యుత్‌కు సంబంధించి సమీకృత ఫోటో వోల్టాయిక్‌ పరికరాలు, సిలికా తయారీ కేంద్రం కోసం బిఇఎల్‌ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. సౌర శక్తితో 5000 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. సౌర విద్యుత్‌ రంగంలో తగిన సాంకేతిక పరిజ్ఞానంతో తమ రెండు సంస్థలు ఎదుగుతాయని ఆశిస్తున్నాం’’

‘‘రవాణా, ముఖ్యంగా రైల్వే రంగంతో మీ అనుబంధం ఎలా ఉంది?
‘‘సరుకు రవాణా అనేది ఒక ముఖ్యమైన విభాగం. ఎదగడానికి ఎంతో అవకాశం ఉన్న రంగం కూడా ఇదే. రైల్వేకి ఇదే ప్రధాన ఆదాయ వనరు. భెల్‌ ఇప్పటికే రైల్వేకు ప్రధాన ఖాతాదారుగా ఉంది. డీజిల్‌, ఎలక్ట్రికల్‌ లోకోమోటీవ్‌ల తయారీలో సహకరిస్తున్నాం.భెల్‌ నుండి రైల్వే శాఖ ఏటా 200 లోకోలను అందుకుంటోంది. ఇటీవల 150 లోకోమోటివ్‌లకు సంబంధించి రైల్వే నుండి 990 కోట్ల రూ.ల ఆర్డర్‌ అందుకున్నాం.

ఇది అంతకుముందు అందుకున్న 50 లోకోలకు అదనం. రైల్వే అందిస్తున్న సహకారం వల్లనే ఝాన్సీలోని మా ఉత్పత్తి కేంద్రం సామర్ధ్యాన్ని పెంచడానికి నిర్ణయించాం. పశ్చిమ బెంగాల్‌లోని దాన్‌కుని ప్రాంతంలో ఎలక్ట్రి కల్‌ లోకో మోటివ్‌ టెండర్లు కూడా మాకే దక్కాయి. ఇందుకోసం అల్స్‌స్టోమ్‌ సంస్థతో ఒప్పందాన్ని కుదర్చుకున్నాం. బీహార్‌లో డీజిల్‌ లోకోమోటివ్‌ కేంద్రా నికి సంబంధించి జిఇతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇక్కడే ఎలక్ట్రి కల్‌ లోకోమోటివ్‌ కేంద్రం కోసం భాగస్వామిని వెతికే పనిలో ఉన్నాం. మొత్తం మీద సంస్థ వృద్ధిపథంలో పయనిస్తోంది.