ముంబాయి: దేశీయ బొమ్మల ఉత్పత్తి మార్కెట్లోకి జర్మన్ దేశానికి చెందిన సింబా డిక్కీ గ్రూప్ ప్రవేశించనుంది. 1500కోట్ల దేశీయ బొమ్మల పరిశ్ర మలోకి మరో ఏడాదిలో ప్రవేశించనుందని సంస్థ అత్యున్నత అధికారి తెలి పారు. దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు పలు ప్రదేశా లను చూసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కె ట్ పై తాము అధ్యయనాలు జరుపుతున్నామని, మరో ఏడాదిలోగా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారం భిస్తా మనీ సింబా టాయ్స్ సీఈఓ (ఉత్తర మధ్య-భారత్) బెన్ నాబర్ట్ తెలి పారు. 2009 లో దేశీయ మార్కె ట్లోకి ప్రవేశించిన ఈ జర్మన్ సంస్థ మరో మూడు సంవ త్సరాల్లో 8శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ తమకు ఎదు గుతున్న మార్కెట్లలో ఒటని, తమ వృద్ధి వ్యాపారాలకు ఇది సానుకూల అంశ మని నాబర్ట్ తెలిపారు.
మొత్తం 10బ్రాండ్లలో 3,000 వివిధ బొమ్మలను ఉత్ప త్తి చేస్తోన్న సింబా సంస్థ, 150 ఉత్పత్తులను 5 బ్రాండ్ల ద్వారా దేశంలో విడుదల చేయగా, మరో 600 ఉత్పత్తులను వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కె ట్లోకి వి డుదల చేయనుందని అన్నారు. ఈ ఏడాది చివర్లో మరిన్న కొత్త దేశీయ బ్రాండ్ లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనా, థాయ్‌ల్యాండ్, ఉత్తర- మధ్య ప్రాంత దేశాల నుండి సింబా బొమ్మల దిగుమతులు జరుగుతున్నాయి. దేశీయ ప్రముఖ రీటైల్ అవుట్‌లెట్లు పాంటలూన్స్, హామ్ లేస్, బిగ్‌బజార్, లైఫ్‌స్టైల్, షాప ర్స్ స్టాప్, ఒడిస్సీ, ల్యాండ్‌మార్క్, మామ్ అండ్ మీ’ ద్వారా తమ బ్రాండ్ సింబా, స్మోబీ, బిగ్, నికొటాయ్, ఏష్‌హార్న్‌ల విక్ర యాలను నిర్వ హిస్తోంది. ప్రస్తుతం 20 డిస్ట్రిబ్యూ షన్ కేంద్రాలు ఉన్న సింబా సంస్థకు ఈ ఏడాదినాటికి 50కు పెంచుకోనుంది.
’సమ్‌థింగ్ ఫర్ ఎవ్రీ వన్’ ట్యాగ్ లైన్‌తో మార్కెట్లో ఉన్న సింబా బొమ్మలు, రు.49 నుండి రూ.20,000 వరకు ధరల్లో అందుబా టు లో ఉన్నాయి. మిగతా అంతర్జాతీయ బ్రాండ్‌లైన ఫన్ స్కూల్, ఫిషర్ ప్రైస్, ప్లే స్కూల్ వంటి వాటికి సింబా గట్టి పోటీ ఇవ్వనుంది. 2011 సంవత్సరంలో జరగనున్న వరల్డ్ కప్‌లో మస్కట్ కొరకై తాము ఇప్పటికే ఐసీసీ నుండి గ్లోబల్ లైసెన్స్‌ను పొంది ఉన్నా మనీ సంస్థ తెలిపింది. దేశంలోని ముంబాయిలో సంస్థ కార్యాల యాన్ని నిర్వహిస్తోన్న సింబా డిక్కీ గ్రూప్ సంస్థకు 10-12శాతం వృద్ధితో కొనసా గు తున్న బొమ్మల పరి శ్రమలో తమదైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఉందని నాబర్ట్ అన్నారు. ఈ ఏడాది దీపావళి నాటికి టీవీ ప్రకటనల ద్వారా ముందుకు వస్తామనీ తెలిపారు.
క్లుప్తంగా
ఎఫ్‌ఐఐలకు అనుమతి
నగదు రంగ లావాదేవీలకు గాను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) దేశీయ, విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకు కొలేటరల్‌గా ఉంచలేందుకు రిజర్వు బ్యాంక్ అనుమతించింది.
సట్లజ్ ఐపీఓ 29న
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ రూ. 1200 కోట్లు సేకరించేందుకు గాను 29న ఐపీఓ జారీ చేయనుంది. మే2 వతేదీతో ఇది ముగియనుంది.