ఎందుకు కొనాలి...
సొంత ముడిఖనిజపు గనులు, సొంత విద్యుత్ తయారీ భౌగోళికంగా అత్యంత అనుకూలమైన మౌళిక సదుపాయాలు, అత్యంత అధునాతనమైన టెక్నాలజీ, వృత్తి నిపుణుల సారథ్యం, విశ్వవ్యాప్త మార్కెటింగ్ నెట్వర్క్ అన్నీ కలిపి కార్బన్ స్టీల్, స్పెషల్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్‌ను అత్యంత చౌక ధరల్లో ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతున్నాయి. ఈ అంశాలే మదుపుదారులకు లాభాలను అందుకోవడానికి ఇచ్చే ‘వీసా’.
ఆర్థిక ఫలితాలు: 2010-11 ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికంలోనే వైర్ రాడ్ మిల్లును, మెల్టింగ్ షాపును మూడవ దశ 25 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నందు వలన పూర్తి స్థాయి సామర్థ్యం, ఫలితాలు, లాభ నష్టాలు 2011-12 సంవత్సరంలోనే ప్రతి బింబిస్తాయి. ఈ సమీకృత స్టీల్ మిల్లులో దశల వారీగా నిర్మాణాన్ని చేపట్టడం వలన 2010-11 సంవత్స రంలో 1,800 కోట్ల టర్నోవర్‌ను, 2011-12 సంవత్సరంలో 2,400 కోట్ల టర్నోవర్‌ను సాధించనుంది. 2010-11 సంవత్సరంలో 100 కోట్ల లాభాన్ని, 2011-12 సంవత్సరంలో 150 కోట్ల లాభాన్ని ఆర్జించనుంది. ఈ విధంగా రూ.10 ఇపియస్ మరియు రూ.15 ఇపి యస్‌ను ఆర్జించనున్న ఈ షేరు రూ.34.20 లకు లభించడం అత్యంత చౌకగా లభించినట్లే. 2008-09 లో చవిచూచిన 66.81 కోట్ల నికర నష్టం విదేశీ కరెన్సీ మార్పిడిలో వచ్చిన ఒడిదుడుకుల వలన సంభవించిందే తప్ప వ్యాపార నిర్వహణాపరమైనది కాదు. 2009-10 లో ఆర్జించిన 47.42 కోట్ల పన్ను తర్వాత నికర లాభం ఒక్కొక్క షేరుకు రూ.4.31 ఇపియస్ను ఇస్తుంది. ఈ విధంగా కూడా రూ.34 లకు లభిస్తున్న ఈ షేరు చాలా చౌకైనది.
విద్యుత్ ఉత్పత్తి జార్ఖండ్ ప్లాంట్: 2,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి జార్ఖండ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గుజరాత్ ప్లాంట్ గుజరాత్‌లోని పిపాయవ్ నౌకాశ్రయానికి దగ్గరగా రూ.4,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2011 జూన్ నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది.
ఛత్తీస్‌ఘడ్ ప్లాంట్ ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న ఒప్పందం ప్రకారం 5,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో 1,200 (4300) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి సన్నాహాలు ప్రారంభిం చింది. ఇందులో మొదటి దశ 2011 వ సంవత్సరంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ విద్యుత్‌ను మర్చంట్ బేసిస్ ఆధారంగా విక్రయించను న్నందు వలన ఒక్కొక్క (కెడబ్ల్యుహెచ్) యూనిట్‌కు రూ.7 పైగానే లభించనున్నది. ఈ ఒక్క ప్లాంటు నుండే కోటాను కోట్ల రూపా యల లాభాన్ని కంపెనీ పొందబోతుంది. ఒరిస్సా ప్లాంట్ ఒరిస్సా ప్రభుత్వంతో ఏర్పరు చుకున్న ఒప్పందం ప్రకారం కటక్ జిల్లాలో 4,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 2011 జూన్ నాటికి ఈ ప్లాంటు కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. 2012 సంవత్సరం నాటికి ఈ 5,700 మెగావాట్ల సామర్థ్యాన్ని అందు బాటులోకి తీసుకురావడానికి కంపెనీ దాదాపు రూ.25,000 కోట్లను వినియోగించనుంది. ఈ పెట్టుబడులే మదుపు దారులకు లాభాలను అందిస్తాయి.
క్యాపిటివ్ పవర్:కళింగ నగర్‌లోని స్టీల్ ప్లాంటు నుండి విడుదల అవుతున్న వ్యర్థ నీటి ఆవిరి నుండి ప్రస్తుతం 75 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తికి అదనంగా 250 మెగావా ట్లను జతచేసి మొత్తం 325 మెగావాట్ల సామర్థ్యానికి 2012 సంవత్సరానికి చేరుకోనుంది. ఈ సొంత విద్యుత్ స్టీల్‌ను చౌకగా తయారుచేయడానికి ఉప యోగపడుతుంది.
స్టీల్ ప్లాంట్ - రాయఘర్: 2.5 మిలియన్ టన్నుల సమీకృత స్టీల్ ప్లాంటును మరియు క్యాపిటివ్ 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నెలకొల్పడానికి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఫెర్రో క్రోమ్ ప్లాంట్ - ఒరిస్సా: అనుబంధ సంస్థ వీసా బావో స్టీల్స్ ద్వారా 1 లక్ష టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫెర్రో క్రోమ్ ప్లాంటును ఒరిస్సాలో నెలకొల్పనుంది.
కళింగ నగర్ కోల్ వాషరీ: ప్రస్తుతం కళింగనగర్‌లో ఉన్న 2.5 మిలియన్ టన్నుల సమీకృత స్టీల్ ప్లాంటుకు అదనంగా కంపెనీ కళింగ నగర్లోనే 250 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ ప్లాంట్‌తో కోల్‌వాషరీ, 5 లక్షల టన్నుల స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంటు, 4,25,000 టన్నుల పిగ్ ఐరన్ ప్లాంటు, 3లక్షల ట న్నుల స్పాంజ్ ఐరన్ ప్లాంటు, 10 లక్షల టన్నుల సింటర్ ప్లాంటును నెలకొల్పబోతుంది.
డివిడెండ్: 2009-10కి కంపెనీ 10% డివిడెండ్‌ను ప్రకటించింది.
పబ్లిక్ ఇష్యూ: 2006 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో రూ.10 ముఖవిలువ కలిగిన 3 కోట్ల 50 లక్షల షేర్లను రూ.47 ప్రీమియంతో కలుపు కొని రూ.57 లకు ప్రజలకు జారీ చేసి రూ.199.5 కోట్ల నిధులను సమీక రిం చింది. 2006 వ సంవత్సరంలోనే రూ.57 లకు జారీ చేయబడిన ఈ షేరు 4సంవత్సరాల తర్వాత వాణిజ్య ఉత్పత్తి అనంతరం లాభాలను ఆర్జిస్తూ డివిడెం డ్‌ను చెల్లిస్తున్న ఈ షేరు రూ.34లకు లభించడం విలు వైన అద్భుత అవకాశం.
ముగింపు :
5,700 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, 325 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ సామర్థ్యం, 5 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి, 1 లక్ష టన్నుల ఫెర్రో క్రోమ్ ఉత్పత్తితో, 2012 సంవత్సరం తర్వాత ఈ కంపెనీ ప్రపంచ స్టీల్ రంగంలో ప్రముఖ కంపెనీల జాబితాలో చేర నుంది. సంవత్సర కాలంలో రూ.34 షేరు రూ.65 అవుతుంది.
