Saturday, May 8, 2010

అనిల్‌కే అధిక నష్టం

న్యూఢిల్లీ: అంబానీల కుటుం బ ఒప్పందం చెల్లదని, తక్కువ ధరకు అడాగ్‌ కంపెనీకి గ్యాస్‌ ఇచ్చే అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేయ డంతో పాటు ఎంతకాలం పాటు గ్యాస్‌ సర ఫరా చేయాలనే విషయం కూడా కేజీ బేసిన్‌ క్షేత్రాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని బట్టి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ పాత్ర తిరుగులేనిదని సుప్రీం కోర్టు తేటతెల్లంగా చెప్పిన నేపథ్యంలో అడాగ్‌ గ్రూప్‌ ఇకపై రిల్‌తో చర్చించి సాధించేదేమీలేదని నిపుణులు అభిప్రాయపడు తున్నా రు. ‘‘మరో ఆరు నెలల్లో ఇంతకన్నా జరిగేదేమీ ఉండదు’’ అని ప్రఖ్యాత న్యాయ సంస్థ టిటుస్‌ అండ్‌ కోకు చెందిన సీనియర్‌ న్యాయవాది దిల్జిత్‌ టిటుస్‌ అభిప్రా యపడ్డారు. మదుపరుల స్నేహపూర్వక తీర్పని వ్యాఖ్యానించారు.

గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌కు అనుబంధ చమురు, గ్యాస్‌ విభాగం అసోసి యేట్‌ డైరక్టర్‌ దీపక్‌ మహార్కర్‌ మాట్లాడుతూ అడాగ్‌ సంస్థ కోరుకున్నట్లు ఎంఎంబిటీయుకు 2.34 డాలర్ల చొప్పున ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసినందున కోర్టు సూచనలపై అనిల్‌ రిల్‌తో చర్చించి సాధించేదేమీ లేదని అన్నారు. అధిక ధరలకు అడాగ్‌ సంస్థ గ్యాస్‌ కొనలేదని, రెండవది గ్యాస్‌ సరఫరా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. కుటుంబ ఒప్పందాన్ని తీర్పు అగౌరపరచలేదని, వాటాదారుల ప్రయోజనాల కోసం రెండు సంస్థలు మళ్ళీ చర్చించుకుని సమస్యను పరి ష్కరించుకోవాలని కోర్టు సూచిందని అన్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్‌ గరిష్ట ఉత్పత్తి సామర్ధ్యం 90 ఎంఎంఎస్‌సిఎండిగా ఉన్నప్పటికి, 62-63 ఎంఎంఎస్‌సిఎండి స్థాయిలో మాత్రమే గ్యాస్‌ విడుదలవు తోందని, అలాగే గ్యాస్‌ నిక్షేపాల కాలపరిమితి కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమేనని, గ్యాస్‌ ధరపై ప్రభుత్వందే చివరి నిర్ణయమని వ్యాఖ్యానించారు. గ్యాస్‌ కొనుగోలు ఒప్పందాలపై అంబానీ సోదరులు కలసి తిరిగి చర్చించుకోవడానికి సుప్రీం కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

ముఖేష్‌ షేర్‌ ధరలు హుషారు...అనిల్‌ షేర్లు బేజారు : దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబానీకి అనుకూలంగా సర్వోన్నత స్థానం తీర్పు వెలువరించడంతో రిలయన్స్‌ పరిశ్రమల షేర్లు ధరలు 2.3 శాతం పెరిగి రూ.1033.85కు చేరాయి. కాగా తమ్ముడు అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ షేర్ల ధరలు 23 శాతం అంటే రూ.52.75 లకు పడిపోయాయి.

ప్రభుత్వ విధానాన్ని సమర్ధించిన తీర్పు :శ్రీకాంత్‌ జెనా
న్యూఢిల్లీ: కేజీ గోదావరి గ్యాస్‌ పంపిణీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తోందని కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీకాంత్‌ జెనా హర్షం వ్యక్తం చేశారు. దేశీయంగా గ్యాస్‌ ధరల స్థిరత్వానికి, పెట్టుబడిదారుల విశ్వాసానికి తీర్పు దోహదం చేస్తుందని, ఎరువుల తయారీ సంస్థలకు గ్యాస్‌ సరఫరా ప్రాధాన్యతను ఈ తీర్పు నొక్కి చెబుతోందని పేర్కొన్నారు.దేశంలో యూరియా తయారీ సంస్థలకు కేజీ బేసిన్‌ గ్యాస్‌లో రోజుకు 15 ఎంఎంఎస్‌సిఎం గ్యాస్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్యాస్‌ లభ్యత లేని కారణంగా ఎరువుల తయారీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీ 2001-02లో రూ.12,808 కోట్లు ఉండగా, 2009-10 నాటికి ఇది రూ.57,056 కోట్లకు చేరింది. దేశంలో 128 ఎరువుల తయారీ కర్మాగారాలు ఉన్నాయి.

తీర్పును స్వాగతించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రకృతిలో లభ్యమయ్యే ఏ సహజ సంపద అయినా, జాతి సంపద గా భావించాలని, అది ఏ ఒక్కరి కుటుంబ సోత్తో కాదని నిర్వచిస్తూ కేజీ బేసిన్‌ సహజవాయువు పంపిణీపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. సముద్ర గర్భం నుండి వెలికితీసే సహజవాయువుపై ధర నిర్ణయం, వినియోగం, మార్కెటింగ్‌ మొదలైన అన్ని విషయాలలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికే హక్కులు సంక్రమి స్తాయని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. అంబానీ సోదరుల నడుమ వివాదంతో తాను కూడా నలిగిపోయిన కేంద్ర చమురు మంత్రి మురళీ దేవరా సుప్రీం తీర్పుపై హర్షాన్ని వ్యక్తం చేశారు. సహజవాయువు జాతి సొత్తుగా సుప్రీం కోర్టు ప్రకటించడం ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

ఒకరు జాతి ప్రయో జనాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేరని అనిల్‌ అంబానీని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. చమురు మంత్రిత్వ శాఖ తన అన్న ముఖేష్‌ అంబానీకి వత్తాసు పలుకుతున్నదని అనిల్‌ అంబానీ గతంలో ఆరోపిం చిన విష యం తెలిసిందే. అంతేగాక ఈ విషయంలో అన్ని ప్రముఖ జాతీయ ది నపత్రి కలలో మురళీ దేవరాను లక్ష్యంగా చేసుకుని చమురు శాఖపై ఆరోప ణలు కు మ్మరిస్తూ భారీ ప్రకటనలను కూడా అడాగ్‌ కంపెనీ విడుదల చేసింది. తమకు కుటుంబ ఒప్పందం ప్రకారం తనకు వరుసగా 17 సంవత్సరాల పాటు రోజు కు 28 మిలియన్‌ మెట్రిక్‌ ఘనపు అడుగుల గ్యాస్‌ను 2.34 ఎంఎం బిటీయు ధరకు సరఫరా చేయకుండా చమురు మంత్రిత్వ శాఖ అడ్డుకుం టుం దని అని ల్‌ ధ్వజమెత్తారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కూడా ఇం ప్లీడ్‌ పిట ీషన్‌ దాఖలు చేసింది. కాగా అంబానీ కుటుంబం మధ్య జరిగిన ఆస్తుల పంపిణీ ఒప్పందం అటు న్యాయపరంగా, ఇటు సాంకేతికంగా కార్పొ రేట్‌ ప్ర పంచానికి వర్తించదని, అది ప్రైవేట్‌ ఒడంబడికని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేసింది. గ్యాస్‌పై ధర నిర్ణయం, వినియోగంపై ప్రభుత్వానికి ఉన్న సర్వాధికారం ఎవరూ ప్రశ్నించ లేరని దీంతో తేలిపోయిం ది. ముఖేష్‌ అంబానీ కూడా ప్రభుత్వం విధానం ప్రకా రం ఎంఎం బిటీయు గ్యా స్‌ ధర 4.20 డాలర్లు నిర్ణయించగా అసంతృప్తిగా ఉన్నా మిన్నకుండి పోయారు. ఇదిలాఉండగా సుప్రీం తీర్పుపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ‘‘మంచి’’గా ఉందని వ్యాఖ్యానించగా, కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తీర్పు నిష్పక్షపాతంగా ఉందని, ప్రభుత్వానికి చెందిన ఎన్‌టిపిసి గ్యాస్‌ కోసం ఇకపై రిల్‌తో పోరాటం చేసే అవసరం లేదని పేర్కొన్నారు.

2004లో ఎన్‌టిపిసికి రోజుకు 12 మిలియన్‌ మెట్రిక్‌ ఘనపు అడుగుల గ్యాస్‌ను సరఫరా చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఒప్పందం అమలు విషయంలో విబేధాలు రావడంతో ఎన్‌టిపిసి రిల్‌ బొంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ తీర్పుతో ఎన్‌టిపిసికి ఎటు వంటి సంబంధం ఉం డదని షిండే స్పష్టం చేశారు. సహజవాయువు వంటి వన రులపై ప్రభుత్వానికి ఉన్న సార్వ భౌమాధికారాన్ని, రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని కోర్టు తీర్పు విస్పష్టం చేసిందని కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తీర్పు ఎవరి పక్షాన వచ్చిందనేది ప్రశ్న కాదని, ప్రభుత్వం, చమురు మంత్రిత్వ శాఖలు తీసుకున్న నిర్ణయాలు సక్రమమైనవని దీంతో తేటతెల్లమైందని అన్నారు.

తేలిన గ్యాస్‌ వివాదం... తమ్ముడికి పరాజయం
GRAPH‘‘జాతి సంపద అయిన గ్యాస్‌ ధర నిర్ణయం, వినియోగంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’
‘‘గ్యాస్‌ పంపిణీ విషయంలో అంబానీల కుటుంబ ఒప్పందానికి న్యాయపరంగా, సాంకేతికంగా కట్టుబడాల్సిన అవసరం లేదు’’
‘‘ప్రభుత్వ విధానానికి అనుగుణంగా గ్యాస్‌ కొనుగోలు ఒప్పందంపై రిలయన్స్‌ పరిశ్రమలు, రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ ఆరు వారాలలోగా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావచ్చు’’
ప్రభావం
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విద్యుత్‌, ఎరువుల కంపెనీలపై ప్రభావం చూపిస్తుంది. గ్యాస్‌ మార్కెట్‌పై స్పష్టత ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆదాయంపై కూడా తీర్పు ప్రభావం ఉంటుంది.
2002 : కృష్టా-గోదావరి బేసిన్‌లోని 1.9 మిలియన్‌ ఎకరాలలో 14 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగుల సహజవాయువు నిక్షేపాలను రిలయన్స్‌ పరిశ్రమలు కనుగొంది.
2006 : కేజీ బేసిన్‌ గ్యాస్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 42 శాతం తక్కువగా రోజుకు 28 మిలియన్‌ మెట్రిక్‌ ఘనపుటడుగుల గ్యాస్‌ను మిలియన్‌ మెట్రిక్‌ బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్‌కు 2.34 డాలర్ల చొప్పున 17 సంవత్సరాల పాటు తనకు సరఫరా చేయాలని అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో తాను నిర్మిస్తున్న 7,800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ర్మాగారం కోసం ఈ గ్యాస్‌ అవసరమని అడాగ్‌ వాదించింది.
2009 ఏప్రిల్‌ : కేజీ బేసిన్‌ డి6 బావి నుండి రిల్‌ గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించింది.
2009 జూలై : 40 ఎంఎంఎస్‌ఎంసిడి గ్యాస్‌ను రిల్‌ ఇతర కంపెనీలకు విక్రయ ఒపందాలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది.

రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయం : అనిల్‌ అంబానీ
anilముంబాయి: తమ డిమాండ్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అనిల్‌ ధీరూభాయి అంబానీ గ్రూప్‌ (అడాగ్‌) కంపెనీల సారధి అనిల్‌ అంబానీ ప్రతిస్పందన ఇలా ఉంది.
1. సుప్పీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. తీర్పు పూర్తి పాఠం అందుకోవాల్సి ఉంది. రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌)కు చెందిన 25 లక్షల మంది వాటాదారుల ప్రయో జనాల రక్షణకు సర్వోన్నత న్యాయస్థానం రక్షణ చర్యలు తీసుకుంది. గ్యాస్‌ కొనుగోలు ఒప్పందంపై రిలయన్స్‌ పరిశ్రమలతో తిరిగి చర్చలు ప్రారంభించడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
2. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణకు, తిరిగి చర్చలు జరపడానికి 2005 జూన్‌ 18 నాటికి కుటుంబ ఒప్పందాన్ని ప్రాతిపదికగా తీసుకోవడానికి గౌరవ న్యాయస్థానం అంగీకరించింది.
3. తీర్పు ఒక్కరి ప్రయోజనాలకే పట్టం కట్టకూడదని కోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. తద్వారా ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ హక్కులు రక్షించబడతాయి.
4. బెంచ్‌లో మెజార్టీ తీర్పు ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ దావాను గౌరవించింది. కుటుంబ ఒప్పందాన్ని చర్చల ద్వారా సాకారం అయ్యేందుకు అవకాశం కల్పించింది.
5. ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌, రిల్‌తో ఆరు వారాలలోగా విజయవంతంగా చర్చలు జరిపి గ్రూప్‌ ఆధ్వర్యంలోని పవర్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ తగువిధంగా సరఫరా అయ్యేందుకు చర్యలు తీసుకుంటుంది.
6. సుప్పీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్‌ వేసే ఆలోచన లేదు
7. విద్యుత్‌ రంగంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగేందుకు మాకున్న నిబద్ధతలో ఎటువంటి మార్పు ఉండదు. దేశంలో 35,000 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన గ్రీన్‌ఫీల్డ్‌ పవర్‌ జనరేషన్‌ యూనిట్లను నిర్మిస్తాం. విద్యుత్‌లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తాం.
8. గ్యాస్‌ ఆధారిత 8000 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన తమ విద్యుత్‌ ప్రాజెక్టులు క్లీన్‌, గ్రీన్‌ విద్యుత్‌ అందిస్తాయి. గ్యాస్‌ సరఫరాలో విద్యుత్‌ రంగానికి రెండవ స్థాయి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఏనాడో నిర్ణయించింది.
చివరిగా మా పరిశ్రమల అభివృద్ధికి పాటు పడుతున్న కోటి పది లక్షల మంది వాటాదారులకు, 1,50,000 మంది ఉద్యోగులకు, వ్యక్తిగతంగా నాకు అండదండలు అందిస్తున్న నా భార్య టీనా, కుమారులు అన్మోల్‌, అన్షూల్‌, ఇతర కుటుంబ సభ్యులకు, గత ఐదు సంవత్సరాల సంక్షిష్ట కాలంలో తనకు మద్దతు ప్రకటించిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మీడియాకు కృతజ్ఞతలు.