దేశీయ వాహన విక్రయాల్లో మారుతీ సంస 22.12 శాతం వృద్ధితో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 68,668 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, హ్యుందాయ్ సంస్థ కూడా 28.15శాతం వృద్ధితో 28,501 యూనిట్ల దేశీయ విక్రయాలను జరిపింది. టాటా మోటార్స్ విక్రాయాలు ఏప్రిల్ నెలలో 76.41శాతం వృద్ధితో 19,762 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. హీరో హోండా ద్విచక్రవాహన విక్ర యాలు మాత్రం గత ఏడాది కన్నా స్వల్పంగా 2.71శాతం తగ్గి 3,38,708 యూనిట్లుగా ఏప్రిల్ మాసానికి నమోదయ్యాయి.
ద్విచక్ర వాహనాల్లో మార్కెట్ పోటీదారు బజాజ్ సంస్థ విక్రయాలు 76.49 శాతం వృద్ధితో 1,87,994 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ వరుసలో చెనై్న కు చెందిన టీవీఎస్ మోటార్ సంస్థ 10.78శాతం వృద్దితో 49,008 యూనిట్లు విక్రయాలను ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో నమోదు చేసింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 48.31శాతం వృద్దితో 58, 041 యూనిట్ల బైక్‌ల విక్రయాలను నమోదు చేసింది. స్కూటర్ విభాగంలో మొత్తం విక్రయాలు గత ఏడా ది కన్నా 52.63శాతం వృద్ధితో 1,48,247 యూనిట్లుగా నమోదు చేసింది.
ఎగుమతుల్లో కూడా అదే జోరు
దేశీయ ప్యాసెంజర్ కార్ల ఎగుమతులు కూడా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రోత్సాహకరమైన వృద్ధి శాతాన్ని నమోదు చేశాయి. దేశీయ కార్ల ఎగుమతులు గత ఏడాది కన్నా 27.88శాతం వృద్ధితో ఉండగా, మోటార్‌సైకిళ్ళ ఎగుమతులు 95.71శాతం వృద్దిని నమోదు చేశాయని సియామ్ రిపోర్టు తెలిపింది. అంతర్జాతీయ ఆటోమార్కెట్లలో మెరుగుదలతో దేశీయ ఆటో సంస్థలు ప్రోత్సాహకరంగా వృద్ధి ఎగుమతులను నమోదు చేశాయి. సియామ్ డేటా ఆధారంగా దేశీయ కార్ల ఎగుమతలు ఏప్రిల్ మాసంలో 37,479 యూనిట్లుగా నమోదయ్యాయి.

అంతర్జాతీ య మార్కెట్లలో పెరిగి ఆటో మోబైల్ డిమాండ్ కారణంగా ఈ ఎగుమతులు ప్రోత్సాహకరంగా నమోదయ్యా యని అన్నారు. ప్యాసెంజర్ వాహనాల ఎగుమతులు 28.63శాతంతో గత ఏడాది కన్నా 37,893 యూనిట్లుగా నమోదయ్యాయి. సియామ్ డేటా ఆధా రంగా మోటార్‌సైకిళ్ళ ఎగుమతులు 95.71శాతం వృద్ధితో ఏప్రిల్ మాసంలో 1,27,336 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ విభాగంలో బజాజ్ ఆటో సంస్థ రెండింతల వృద్ధితో 88,101 యూని ట్ల మాసాంతపు విక్రయాలను నమోదు చేసింది.
టీవీఎస్ మోటార్స్ ఈ వరుసలో 88.86శాతం వృద్ధితో 16,992 యూనిట్ల విక్రయాల ను జరిపిందని సియామ్ పేర్కొంది. మొత్తం దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు గత ఏడాది ఉన్న 67,267 యూనిట్ల విక్రయాల కన్నా 96.91శాతం వృద్ధితో 1,32,458 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. వాణిజ్య వాహనాల విభాగంలో దేశీయ ఎగుమతులు రెండింతల వృద్ధితో గత ఏడాది కన్నా 3,888 యూనిట్లుగా నమోదయ్యాయని సియామ్ తెలిపింది. లైట్ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్‌సివి) విభాగంలో కూడా రెండితల వృద్ధితో 2,451 యూనిట్ల ఎగుమతులు నమోదయ్యాయి. మధ్య-భారీ వాణిజ్య వాహనాల్లో ఎగుమతులు 99.86శాతంతో 1,437 యూనిట్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల్లో దేశీయ ఎగు మతులకు మూడింతల వృద్ధితో ఏప్రిల్ మాసంలో 27,304 యూనిట్ల ఎగు మతులు నమోదయ్యాయని సియామ్ పేర్కొంది. ఈ గణాంకా వివరాలను బట్టి ప్రస్తుతానికి పరిస్థితి ఆశాజనకంగానే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.