Saturday, May 8, 2010

సంప్రదింపుల కోసం వేచి ఉంటాం

గ్యాస్‌ సరఫరా ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేసే దిశగా మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా 25 లక్షల మంది ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ వాటాదారుల ప్రయోజనాలను సుప్రీం కోర్టు కాపాడింది. గ్యాస్‌ సరఫరాకు చేసే ఏర్పాట్లు ఆర్‌ఐఎల్‌కే కాకుండా ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ వాటాదారులకు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పింది. 2005 జులై 18 నాటి ఎంఓయూ ఆర్‌ఐఎల్‌ వ్యాపార పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదికగా ఉండాలన్న విషయంలో కోర్టు ఆమోదం తెలిపింది. మెజారిటీ తీర్పును వెలువరించడం ద్వారా ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ పిటిషన్‌ కొనసాగించదగ్గదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్కీమును సవరించడానికి ఆచరణసాధ్యంగా మలచడానికి న్యాయస్థానానికి ఉన్న అధికారాలను తీర్పు నిలబెట్టింది. సుప్రీం కోర్టు తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ను వేసే ఉద్దేశాలు ప్రస్తుతానికి ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు లేవు. కోర్టు ఆదేశానికి అనుగుణంగా గ్రూపు విద్యుత్తు కర్మాగారాలకు గ్యాస్‌ సరఫరాను సాధించడం కోసం నిర్దేశిత ఆరు వారాల గడువు లోపల ఆర్‌ఐఎల్‌తో సత్వర, ఫలప్రద పునఃసంప్రదింపుల కోసం ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ ఎదురుచూస్తుంది. - తీర్పు వెలువడిన కొద్ది సేపటికి విలేకరులతో అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ చెప్పింది ఇదీ