Tuesday, May 11, 2010

ధనవంతుల జాబితాను పట్టించుకోను


ఈ జాబితాల కన్నా తమ సంస్థ వృద్ధి కార్యక్రమాల వార్తలు, వాటాదారుల సృజనాత్మకత వంటి విష యాలకు ప్రాధాన్యమిస్తానని మిట్టల్‌ అన్నారు. పెప్సీకో సంస్థ ఛైర్మ న్‌, సీఈఓ ఇంద్రా నూయి కూడా తాజాగా ఇదే విధంగా స్పందించారు. ప్రపంచ ధనవం తుల జాబితాలు తనకు ప్రధానం కాదని గత మాసంలోనే నూయి వ్యాఖ్యా నించారు. ఈ ఏడాది 2010 సంవత్సరానికి గాను సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌లో ఎల్‌ఎన్‌ మిట్టల్‌కు 6వ స్థానం దక్కింది. పత్రిక కథనం ఆధారంగా గత ఏడాది ఉన్న 10.8 బిలియన్‌ డాలర్ల పౌండ్ల కన్నా అధికంగా ఈ ఏడాది మిట్టల్‌ 22.45 బిలియన్‌ పౌండ్ల ఆస్తులను కలిగి ఉన్నారని సండే టైమ్స్‌ పేర్కొంది.

ఐపీఎల్‌తో దూరంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా
ఎన్‌ఆర్‌ఐ సంపన్నులు లక్ష్మీ మిట్టల్‌ తాను ఐపీఎల్‌ మ్యా చ్‌లకు దూరంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలి పారు. తాజాగా వివాదాల నడుమ కొనసాగిన 20-20 క్రికె ట్‌ ఆటకు దూరంగా ఉన్నందుకు మిట్టల్‌ హర్షం వ్యక్తం చేశారు. తనకు జట్టు టీమ్‌లను కొనే ఉద్దేశం కూడా లేదని అవన్నీ గాలి వార్తలనీ ఖండించారు.

ఐపీఎల్‌ క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించాలంటే చాలా సమ యం పడుతున్నందున, ఈ విషయాలపట్ల దూరంగా ఉన్నా నని పేర్కొన్నారు. దేశీయంగా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఐపీఎల్‌లో పాల్గొన్నారు. ఈ వరుసలో ముకేశ్‌ అంబానీ, యూబి గ్రూప్‌ విజయ్‌ మాల్యా ఉన్నారు. ఐపీఎల్‌ మ్యా చ్‌లపై పెద్దగా ఆసక్తిలేకపోయినప్పటికీ, భారత్‌లో ఉన్న మిట్టల్‌ చాంఫియన్స్‌ ట్రస్ట్‌ (ఎంసిటి) ద్వారా దేశీయ క్రీడలకు లక్ష్మీ మిట్టల్‌ సహ కారాన్నంది స్తున్నారు. ఈ ట్రస్టు ద్వారా బ్యాడ్‌మింటన్‌ తార సానియా నెహ్వాల్‌, ఒలపియ న్‌ బాక్సర్స్‌ అఖిల్‌ కుమార్‌, జితేందర్‌ కుమార్‌లు సహకారాన్ని పొందుతున్నారు. అదనంగా షూటింగ్‌, వ్రెజ్లర్స్‌ ఆటగాళ్ళకు ఎంసిటి సహాయాన్నందిస్తోంది.