Tuesday, May 11, 2010

రూ .28 వేల కోట్లకు చేరనున్న రెస్టారెంట్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: దేశీయ రెస్టారెంట్‌ మార్కెట్‌ 2015 సంవత్సరం నాటికి నాలుగింతల వృద్ధితో రూ.28,000 కోట్ల కు చేరనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పలు విదేశీ సంస్థలైన స్టార్‌బక్స్‌, బర్గర్‌ కింగ్‌ వంటివి దేశీయ మార్కెట్లోకి ప్రవేశించ నుండటంతో రెస్టారెంట్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని అన్నాయి. సుమారు రూ.43,000 కోట్ల విలువైన దేశీయ రెస్టారెంట్‌ పరిశ్రమలో వ్యవస్థీకృత రెస్టారెంట్ల వాటా 16శాతం ఉందని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) తెలిపింది. ఈ వృద్ధి 2015 నాటికి 45శాతం పెరగనుందని పేర్కొంది. ఎన్‌ఆర్‌ఎఐ అందించిన రిపోర్టు ప్రకారం పలు అంతర్జాతీయ బ్రాండ్‌లైన స్టార్‌బక్స్‌, హూటర్స్‌, బర్గర్‌ కింగ్‌, గ్రాండ్‌ కెన్‌యాన్‌ కాఫీ వంటి బడా సంస్థలు తమ సేవలను భారత్‌లో విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.

మొత్తం దేశీయ రెస్టారె ంట్‌ పరిశ్రమ (ఆర్గనైజ్డ్‌, అన్‌-అర్గనైజ్డ్‌ రంగాలు) వచ్చే మూడేళ్లలో 5శాతం వృద్ధితో 2015 నాటికి రూ.62,500 కోట్లకు చేరనుందని రిపోర్టు తెలి పింది. భారత్‌లో మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న వేతనాల కారణంగా ఈ పరిశ్రమ వృద్ధి దిశగా సాగు తోందని తెలియజేసింది. ఈ వరుసలో కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌ సంస్థలు పలు మెట్రో నగరాల్లో తమ కార్య కలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రానున్నాయని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై కూడా దృష్టిని సారించనున్నాయని రిపోర్టు పేర్కొంది. ఈ రంగంలో దేశీయ సంస్థలు కొన్ని జాయింట్‌వెంచర్‌ భాగస్వాములు గా కూడా ఏర్పడవచ్చని తెలిపారు. తాజాగా కాఫీడే హోల్డింగ్స్‌ సంస్థలో మూడు ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన న్యూ సిల్క్‌ రూట్‌, కెకెఆర్‌తో పాటు స్టాండర్డ్‌ చార్టర్డ్‌లు సుమారు రూ.800 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించి కాఫీడే సంస్థలో 25శాతం వాటాను కైవసం చేసుకున్నాయి.