Tuesday, May 11, 2010

నిరాశ కలిగించినా... ‘సుప్రీం ’ రక్ష మనకుంది !

న్యూఢిల్లీ: తన గ్రూప్‌ కంపెనీలకు చౌక ధరలకు గ్యాస్‌ను అందించాలన్న తన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వాటాదారుల మనస్థయిర్యాన్ని పెంచేలా వారికి అనిల్‌ అంబానీ ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు నిరాశ కలిగించినప్పటికీ, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ వాటాదారుల ప్రయోజనాలను సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని ఆయన గ్రూప్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్‌ లో పేర్కొన్నారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తమే ఆఖరి ప్రయ త్నంగా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఆరు వారాల్లోగా ఆర్‌ఐఎల్‌తో తిరిగి జరుగబోయే చర్చలు విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆర్థిక ఫలితాల వెల్లడి వాయిదా
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రిల యన్స్‌ పవర్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌లతో సహా మొత్తం మూడు అడాగ్‌ సంస్థల ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 15కు వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకా రం వీటిని మే 14ననే వెల్లడించాల్సి ఉండింది. రిలయన్స్‌ పవర్‌ బోర్డ్‌ మీ టింగ్‌ను కూడా 14 వతేదీ నుంచి 15వ తేదీకి వాయిదా వేశారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డ్‌ మీటింగ్‌ను 10వ తేదీ నుంచి 15 వేదీకి వాయిదా వేశారు.

వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ క్రీడపై పన్ను మోత
ముంబాయి: వివాదాలతో ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లకు వచ్చే సీజన్‌ నుంచి మహా రాష్ట్ర ప్రభుత్వం పన్నును విధించనుం ది. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై వినోదం ప న్నును విధించాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి చగన్‌ భుజ్‌బల్‌ తెలిపారు. గత నెల లోనే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్నట్టు పేర్కొన్నారు. గత సీజన్‌ లోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై మహరాష్ర్ట ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఐపీఎల్‌ సీజన్‌-3పై సుంకం విధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టాయి. ఐపిఎల్‌ మ్యాచ్‌లపై సుంకం విధించే విషయంలో మహరాష్ట్ర మంత్రి మండలిలో తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. పొరుగు రాష్ట్రాలేవీ మ్యాచ్‌లపై సుంకం విధించడం లేదని ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఈ సందర్భంగా శాసనసభలో తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై సుంకా లను విధించకపోవడం వల్ల సుమారు 5 కోట్ల రూపాయలు ఆదా యాన్ని ప్రభు త్వం నష్టపోయిందని ది కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) పేర్కొంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు పూర్తిగా వినోద కార్యక్రమాల కిందకు వస్తాయని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది.

ద్రవ్యోల్బణ లెక్కింపులో కొత్తగా 676 ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌ మాసం నుంచి ప్రవేశపెట్టనున్న కొత్త ద్రవ్యో ల్బణ గణన పద్ధతిలో 676 వస్తువుల ను టోకు ధరల సూచీలో చేర్చారు. ఇందులో ఎల్‌సీడీ టీవీలు, మోబైల్‌ ఫో న్‌లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ వంటి ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. ఈ కొత్త విధానంలో టైప్‌రైటర్లు, వీసీఆర్‌ వంటి వస్తువులు ఉండబోవు. 2004-05 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని టోకు ధరల సూచీలో అదనంగా 241 కొత్త వస్తువులను చేర్చారు.

ఉత్పత్తుల ధరల విషయంలో పారదర్శత, సాధా రణ ప్రజలపై ఈ ధరల ప్రభావం ఎలా ఉండనుందనే విషయాలను పరిగ ణలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం టోకు ధరల ఆధారిత సూచీలో 435 ఉత్ప త్తులు మాత్రమే ఉన్నాయి. కొత్త విధానం ఆధారంగా డేటాను విడుదల చేసేం దుకు కృషి చేస్తున్నామని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ద్రవ్యో ల్బణం లెక్కింపులో వాడుకలో లేని కొన్ని ఉత్పత్తులను తీసి వాటి స్థానంలో కొత్త ఉత్పత్తులను చేర్చామని తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా మరింత మెరుగైన ధరల పరిస్థితులు తెలియవస్తాయని పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణలోకి తీసుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధానాలను రూపొందిస్తోంది.