ఇటీవలి సుప్రీం తీర్పుతో అంబానీ సోదరులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్నదమ్ములే అయినప్పటికీ వ్యక్తిత్వాల్లో వారిద్దరూ భిన్న ధ్రువాలు. చతురతతో కూడిన వ్యూహం ముకేష్ అంబానీది కాగా అతి విశ్వాసంతో మెట్టు దిగాల్సిన స్థితి అనిల్‌ది. ఒక్క తండ్రి పిల్లలే అయినప్పటికీ ఇద్దరి వ్యక్తిత్వాల్లో ఎన్నో వైరుధ్యాలు. ఆ వైరుధ్యాల వెనుక గల మానసిక జ్యోతిష కారణాలపై ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్.వి.నాగనాథ్ విశ్లేషణ ఇది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఆ వ్యక్తి మానసిక బలా బలాలను విశ్లేషించి, బలాలను మరింత మెరుగుపర్చుకునేందుకు, బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు అవసరమైన సూచనలు ఇచ్చేదే మానసిక జ్యోతిష శాస్త్రం.
ముకేష్ అంబానీ: 19 ఏప్రిల్, 1957, (రాశి: ధనుర్ రాశి)
1. గడుసరితనానికి మారుపేరు ముఖేష్. మొండి పట్టుదల అయన వెన్నంటి ఉంటుంది. ఇతరుల కోసం ఎన్నటికీ ఏదీ త్యాగం చేయని తత్వం ఆయనది. ప్రతీ దాంట్లోనూ ఏదో ఒక అవకాశం అన్వేషిస్తారు. తిమ్మిని బమ్మి చేయకుండానే, మసి బూసి మారేడు కాయ చేయకుండానే ఆ అవకాశాన్ని చేజిక్కించుకోగలు గుతారు.
2. అధికారం చలాయించాలనే తపన ఆయనలో అంతర్గతంగా ఉంటుంది. ఇత రుల పై ఆధిక్యాన్ని ప్రదర్శించాలనే కాంక్ష మదిలో ఉంటుంది. ఆయన దృష్టి ఎన్నడూ తన లక్ష్యం సాధించడంపైనే ఉంటుంది. ఎప్పుడూ విజయం కోసం పరితపిస్తుంటారు. వైఫల్యం ఆయనను గుక్క తిప్పుకోనీయకుండా చేస్తుంది. జాప్యాన్ని, అయోమయాన్ని ఆయన అసహ్యించుకుంటారు. ఆ రెండూ ఎదురైతే ఆత్మన్యూనతకు లోనవుతారు. ప్ర త్యామ్నాయ పరిష్కారమార్గాలను అన్వేషించుకొని ఉండడం వల్ల నిలకడగా ఉండ గలుగుతారు.
3. అహంకారం అధికమే. తన నిర్ణయాలకు, ఆలోచనలకు కారణాలు తెలియపరిచేందుకు, సంజాయిషీలు ఇచ్చుకునేందుకు ఇష్టపడరు.ఇతరులతో వ్యవహరించే సమయంలో నియంతలా ఉంటారు.
4. ఇతరులతో పోటీని ఎదుర్కోవడంలో అసూయ చెందుతారు. తన రంగంలో ఉండే వారి పట్ల అభద్రతాభావంతో ఉంటారు. తన రంగానికి చెందని వ్యక్తుల ప్రభావం ఆయనపై ఏమాత్రం ఉండదు.
5. ఎప్పుడూ చేపట్టిన పనులు పూర్తి చేయాలని పరితపించే నాయకుడి కోవకు చెందిన వ్యక్తి. ఇతరులను ప్రభావితం చేయగల నాయకత్వ గుణాలున్నాయి. నాయకులను రూపుదిద్దగల వ్యక్తి.
పోలికలు
ముకేష్ అంబానీ

2. ముకేష్‌లో అంతర్బుద్ధి, సహజ జ్ఞానం అధికం. మది నిండా ఆలోచన లుంటాయి. ప్రతీ పరిస్థితికి ఓ ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంటుంది. లక్ష్యం పూర్తయ్యే వరకూ అవిశ్రాంతంగా పని చేస్తారు. ఆలోచనల్లో స్వచ్ఛత, స్పష్టత ఉంటాయి. స్వీయ మదింపు చక్కగా చేసుకోగలుగుతారు. లక్ష్యాలను సాధించడంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు.
3. వ్యక్తిత్వ ధోరణిలో తండ్రి ప్రభావం అధికం. తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలను ఎన్నటికీ మర్చిపోరు. సాధ్యమైనంత వరకూ నలుగురిలో కలసిమె లసి తిరగడాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
4. కుటుంబంతో అనుబంధం అధికం. సెంటిమెంట్ అధికమే అయినప్పటికీ బయటికి మాత్రం కుటుంబసభ్యులతో వ్యవహరించే విషయంలో నిక్కచ్చి గానే ఉంటారు. పెద్దల పట్ల ప్రేమానురాగాలను బయటకు వ్యక్తం చేయలేక పోవడాన్ని వారు తప్పుగా భావించే అవకాశం ఉంటుంది.
అనిల్ అంబానీ (4 జూన్, 1959) (మేషరాశి)
1. సోదరుడి మాదిరిగానే అనిల్ అంబానీ కూడా అందుబాటులో వనరుల నుంచి అవకాశాలను వెతుక్కునే వ్యక్తి అయినా, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటారు.
2. మానసిక భావోద్వేగాలు అధికం. భయస్తుడు. అంతర్ముఖం.
3. తన ప్రాధాన్యాన్ని పెంచుకునేందుకు అప్పటి వరకూ ఉన్న వాతావరణానికి నష్టం కలిగిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా లేదా వ్యక్తినైనా తాను ఎంచుకున్న విధంగా మారుస్తారు. ఆయనలో అంతర్గతంగా ఉన్న అసూయ కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తుంది.
4. ఇతరులతో పోల్చిచూసుకునే ధోరణి ఎక్కువే. తన రంగంతో సంబంధం ఉన్నా లేకపోయినా అందరినీ తనతో పోల్చిచూసుకుంటారు. తాను పరిపూర్ణతను కోరుకునే వ్యక్తి నని భావిస్తుంటారు. భావోద్వేగాలపరంగా ఇతరులపై ఆధారపడేరకం. తిమ్మిని బమ్మి చేసే స్వభావం. ఆత్మవిశ్వాసంలో అతి.
5. ఎవరి వ్యక్తిత్వాన్నీ ప్రశంసించలేకపోతారు. కొన్ని పరిమితుల్లోనే పని చేయాల్సిందిగా కిందివారిని ఒత్తిడికి గురి చేస్తారు. ఎదుటి వ్యక్తి స్వతంత్రంగా పనిచేయడాన్ని అనుమతించక పోవడం ద్వారా ఆయన లోని అభద్రతాభావం బయటపడుతుంది. స్వతంత్ర వైఖరి గల వ్యక్తులు తన చుట్టూ ఉండడం ఆయన సహించలేరు.
6. ఏ విషయంలోనైనా నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోనే ఉంచుకుంటారు. సృజనాత్మకత గల వ్యక్తులు ఈ రకమైన ధోరణితో ఇబ్బంది పడుతుంటారు.
7. నాయకులను తయారుచేయడంలో విఫలమవుతుంటారు. తరచూ అనుచరులు ఆయనను వదిలి వెళ్తుంటారు.
అనిల్ అంబానీ

2. ్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాదు. ఆలోచనల్లో సరళత్వం, మార్చుకునే ధోరణి అధికం. తండ్రి నుంచి తనకు తెలియకుండానే కొన్ని గుణాలను పుణికిపుచ్చుకున్నప్పటికీ, అవసరాలకు, పరిస్థి తులకు తగ్గట్టుగా వాటిని మలుచుకుంటారు.
3. కుటుంబ సెంటిమెంటు, ప్రేమ వ్యవహారాల్లో వాటిని బయటకు ప్రదర్శించేందుకు ఇష్టపడుతారు. వారి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతారు. వ్యక్తిగత సంబంధాలను కొనసాగించడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు.
ధనుర్ రాశి అచేతన స్థితి
1. ధనుర్ రాశికి అధిపతి బృహస్పతి. మనిషి అచేతనస్థితిని ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ లాభాపేక్ష ధోరణితో వ్యవహరిస్తుంటారు. తమ పనులతో ముడిపడి ఉండేలా సంబంధాలను కొనసాగిస్తుంటారు. నలుగురితో కలసి ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమకు ఎలా ఉపయోగపడగలరా అని ఆలోచిస్తుంటారు. ఇతరుల ప్రతిభను తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.
2. మేషరాశిలో ఉండే బుధుడు బలహీనమైన మేధను కలిగిఉంటాడు. ముకేష్ అంబానీ పనిలో ఏకపక్షంగా ఉంటారు. ప్రవర్తనా ధోరణి ఆయన హోదాకు తగ్గట్టుగా ఉండదు. కలివిడిగా ఉండకపోవడం లాంటివి ఆయన వ్యక్తిత్వంపై ప్రభావం కనబరుస్తాయి. చిన్నతనం నుంచీ ఆయన చుట్టుపక్కల వ్యక్తులతో కలసిమెలసి తిరిగేందుకు ఇష్టపడకపోవడం ఆయనలో ఆత్మన్యూనత భావాన్ని పెంపొందించి ఉంటాయి. అందుకే ఆయన తన లక్ష్యాలను సాధించడంలో చతురతను, తెలివిని ప్రదర్శిస్తారు. అందుకు తగ్గ సమయ సందర్భాలు వచ్చినప్పుడే ఈ ధోరణి బయటపడుతుంది. ప్రస్తుత భారత రాజకీయ పరిస్థితుల్లో ఈ విధమైన మైండ్‌సెట్ ఆయనకు మరిన్ని విజయాలను అందిస్తుంది.
మేష రాశిలో అచేతన స్థితి
1. స్ఫూర్తిప్రదాయక గ్రహమైన కుజుడు కర్కాటక రాశిలో నీచస్థితిలో ఉన్నాడు. దీంతో జాతకుడి సుగుణాలపై ఆత్మరక్షణ ధోరణి నీడలు పడుతుంటాయి. ఆయనలో ఉండే భయపడే మనస్తత్వం ఇందుకు కారణమని చెప్పవచ్చు. మనస్సులో ఎప్పుడూ ద్వంద్వ ఆలోచనలుంటాయి. ఎప్పుడూ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తన అవసరాలకు ఇతరులను వాడుకుంటారు.
2. మేషరాశిలో చంద్రుడి స్థానం భావోద్వేగ అస్థిరతను, భయాన్ని, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది.

ఇతరుల్లో సుగుణాలను ప్రశంసించడానికన్నా కూడా అవతలి వారి దయనీయ స్థితిపై జాలి కనబర్చేందుకే ఇష్టపడుతారు.
4. అనిల్ అంబానీ భవిష్యత్తులో పలు అనిశ్చిత పరిస్థితులు కనబడుతున్నాయి. అతిగా ఆలోచించడం, ఊహాగానం వల్ల భవిష్యత్తులో ఆయన జ్ఞాపకశక్తి, మెదడు సంబంధిత లేదా మానసిక సమస్యలను ఎదు ర్కొనే అవకాశం ఉంది. ఆ దశలో ఆయన తాను నమ్ముకున్న వారిపై ఆధారపడక తప్పదు.
- ఎస్.వి.నాగనాథ్
ఆస్ట్రో సైకాలజిస్ట్