ఆర్‌ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్.ప్రసాద్

* (గ్యాస్) సరఫరా వ్యవధి కేజీ-డీ6 క్షేత్రం అభివృద్ధి కోసం ఆమోదించిన ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి.
* 2006 జనవరిలో రాసుకున్న గ్యాస్ సరఫరా మాస్టర్ అగ్రిమెంట్ (జీఎస్‌ఎంఏ)పై ఆర్‌ఐఎల్ తిరిగి సంప్రదింపులకు సిద్ధం.
* గ్యాస్ రంగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నదని, ప్రభుత్వ విధానాల పరిధిలోనే మేం పనిచేయాల్సి ఉంటుందని ఇన్నాళ్లూ ఆర్‌ఐఎల్ చెప్తున్న దానిని తీర్పు పూర్తిగా ప్రమాణీకరించింది.
* మంత్రుల సాధికార బృందం (ఈజీఓఎమ్) నిర్ణయం, ఉత్పత్తి పంపకపు ఒప్పందం (పీఎస్‌సీ), ప్రభుత్వ విధానం.. వీటికి అనుగుణంగా ఎంఓయూపై మరోమారు చర్చలు జరిపి అవగాహనకు రావాలని కోర్టు చెప్పింది. మేం అదే చేయనున్నాం.
* కాంట్రాక్టరు మార్కెట్ ధరను శోధిస్తారు. దానిని మార్పులతో ఆమోదించే, లేదా తిరస్కరించే హక్కు ప్రభుత్వానిదని ఆర్‌ఐఎల్ అంటూ వస్తోంది. ప్రభుత్వ హక్కును మేం ఎన్నడూ కాదనలేదు.
* తీర్పు వెలువడ్డాక ముకేశ్ అంబానీ ఊరడిల్లారు. మనమంతా ఇక కాఠిన్యాన్ని వదలిపెడదామన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ వాటాదారులకు విలువను మరింత పెంపొందింపచేయడం కోసం చేతిలో ఉన్న పని పైన దృష్టి సారిద్దామని మా అందరితో అన్నారు.. కాఠిన్యం అనేది ఏ పక్షానికీ మంచిది కాదు అని ఆయనతో పాటు ఆయన సతీమణి నీతా సైతం అభిలషించారు.
కేజీ డీ-6లో 62 ఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి
ప్రస్తుతం కేజీ-డీ6 వద్ద నుంచి ఆర్‌ఐఎల్ రోజుకు 62- 63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. కేజీ-డీ6 బ్లాకులోని ధీరుభాయ్-1, ధీరుభాయ్- 3 క్షేత్రాలను 9 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయడానికి, అలాగే ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ దాని అనుబంధ సంస్థలు సహా ఇతర కస్టమర్లకు కూడా సరఫరా చేయడానికి అనుమతించారు. ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ విద్యుత్తు కర్మాగారం మూడేళ్ల లోపు రాకపోవచ్చు. ఈ లెక్కన సరఫరాలు అయిదేళ్లకు మించి ఉండకపోవచ్చు.