న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ఆకర్షదాయక, శరవేగంతో విస్తరిస్తున్న టెలికామ్ మార్కెట్‌గా ఉన్నప్పటికీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతీయ టెలికాం పరిశ్రమపై శీతకన్ను వేసినట్లుగా ఉంది. ఏప్రిల్ 9న జరిగే 3జీ వేలంలో పాల్గొంటున్న 9 కంపెనీల యాజమాన్యాల తీరుతెన్నులను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ కంపెనీల్లో సగటు ఎఫ్‌డీఐలు 40 శాతానికి మించలేదు. టెలికామ్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్థాయి అధికంగా ఉందని భావించే సాధారణ నమ్మకానికి భిన్నంగా ఈ గణాంకాలున్నాయి. గతం లో టెలికామ్ రంగంలో ఎఫ్‌డీఐలపై 49 శాతం పరిమితి ఉండేది.
ఐదేళ్ళ క్రితం దీన్ని 74 శాతానికి పెంచారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. దీనికి తోడు 3జీ వేలంపై ఎఫ్‌డీఐలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టెలికాం రంగంలోకి తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న ఆశలను ఇది వమ్ము చేసింది. అంతేగాకుండా, 3జీ వేలం ద్వారా రూ. 40 వేల కోట్ల దాకా భారీ మొత్తాన్ని సముపార్జించవచ్చని భావించిన టెలికాం శాఖ మంత్రి ఎ. రాజా ఆశలపై నీళ్ళు చల్లింది. ఈ తొమ్మిది మంది బిడ్డర్లలో వోడాఫోన్ మాత్రమే అత్యధికంగా 70.9 శాతం ఎఫ్‌డీఐలను కలిగిఉంది. ఇందులో వోడాఫోన్ పెట్టుబడులతో పాటుగా ఎస్సార్ సొంత ఎఫ్డీఐలూ కలసి ఉన్నాయి.
ఎయిర్‌సెల్ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో గ్లోబల్ కమ్యూకేషన్ సర్వీసెస్ హోల్డింగ్ (జీసీఎస్హెచ్) 64.9 శాతం మేర వాటాను కలిగి ఉంది. దక్కన్ డిజిటల్ లోనూ జీసీఎస్హెచ్కు 25 శాతం మేర వాటా ఉండడం విశేషం. ఆ విధంగా చూస్తే ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా ఎయిర్‌సెల్‌లో 74 శాతం మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నట్లు లెక్క తేలుతుంది. ఇతిసాలత్ సంస్థ, ఎస్టెల్లలో కూడా ఎఫ్‌డీఐలు గణనీయంగానే ఉన్నాయి. ఇతిసాలత్ ఇండియాలో ఇతిసాలత్ మారిషస్ సంస్థ 44.73 శాతం దాకా పెట్టుబడులను కలిగిఉంది.
ఎస్టెల్లో బహ్రెయిన్ కేంద్రంగా పని చేస్తున్న బీఎంఐసీ లిమిటెడ్ 42.7 శాతం దాకా వాటా కలిగిఉంది. భారతి ఎయిర్టెల్, ఐడియా రెండూ కూ డా సుమారు 40 శాతం దాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కలిగి ఉన్నా యి.15.5 శాతం వాటాతో పిస్టెల్ లిమిటెడ్ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో అధి మొత్తంలో వాటా కలిగిఉంది. టీఎంఐ, పీ5 ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు ఐడియాలో 40.5 శాతం దాకా వాటా కలిగిఉన్నాయి. టాటాలు 34.1 శాతం మేర విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను కలిగిఉన్నారు. వీటిల్లో ఎన్టీటీ డొకొమొ అ దిక శాతం వాటాను కలిగిఉంది. దానికి 26.5 శాతం మేర వాటా ఉంది. నూట కి నూరు శాతం భారతీయ పెట్టుబడులను కలిగిఉంది వీడియోకాన్ మాత్రమే.
23 ఎఫ్‌డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం సోమవారం నాడిక్కడ రూ. 2,325.21 కోట్ల విలువైన 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో బ్రాడ్‌బాండ్ సర్వీ స్ ప్రొవైడర్ టికోనా డిజిటల్ నెట్వర్క్, ఆటో విడి భాగాల తయారీ సంస్థ భారత్ ఫోర్జ్‌ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. టికోనా సంస్థ రూ. 1,142.21 కోట్ల మొత్తంతో భారీ ప్రతిపాదనను కలిగిఉంది. కళ్యాని గ్రూప్ కంపెనీ భారత్ ఫోర్జ్ ప్రతిపాదన విలు రూ. 576 కోట్ల మేరకు ఉంది. ఎస్సార్ క్యాపిటల్ హోల్డింగ్, వెరిజోన్ కమ్యూనికేషన్స్ తదితర 8 సంస్థల ప్రతిపాదనలను వాయిదా వేసింది.
Tuesday, March 30, 2010
ఎఫ్‌డీఐలు అంతంతే!
రూ.2300 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
బీఎస్ఎన్ఎల్ నుంచి మౌలిక కంపెనీ ఏర్పాటు!
గ్రామీణ ఇంటర్నెట్ సేవల కోసమే
అత్యున్నత స్థాయీ సంఘం సిఫారసు
ఇంటర్నెట్లో ప్రకటనల వ్యాపారానికి రెక్కలు
ఈ ఏడాది 50% వృద్ధి అంచనా
భవిష్యత్‌పై మరిన్ని ఆశలు
ఇంటర్నెట్టే ఎందుకు: చాలా కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలకు ఇంటర్నెట్నే ఆశ్రయిస్తున్నాయి. ఎక్కువ మందిని తక్కువ ఖర్చుతోనే ఆకర్షిస్తుండడంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారని వారంటున్నారు. ప్రత్యేక లక్ష్యిత వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరైన మార్గమని చెబుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరిగేదే కానీ తగ్గదు కాబట్టి వర్తమానం..భవిష్యత్ కూడా ఇంటర్నెట్ ప్రకటనలకు ఊతం ఇవ్వగలదు. ముఖ్యంగా ఇప్పటి యువతను ఆకట్టుకోవాలంటే ఇంటర్నెట్ సరైన మాధ్యమమని కంపెనీలు భావిస్తున్నాయి. అదీ కాక సంప్రదాయ మాధ్యమాలైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో పోలిస్తే ఇంటర్నెట్ ప్రకటనలకు వ్యాప్తి ఎక్కువ. అంతర్జాతీయంగా కంపెనీలు తమ ప్రకటనలను గుప్పించేయొచ్చు. తక్కువ ఫీజు ఉండడంతో పాటు పెట్టుబడిపై తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. అంతే కాదు వినియోగదారుల స్పందనను తెలుసుకోవడంతో పాటు వారితో దీర్ఘకాలం పాటు అనుబంధాన్ని కొనసాగించే వీలుంటుంది.
విద్య, వాహన రంగాలదే పైచేయి
ఆన్లైన్ వ్యాపార ప్రకటనల కోసం ఖర్చు చేసే వాటిలో విద్యా సంస్థలు ముందున్నాయి. ఇవి ఈ ఏడాది ఈ విభాగంపై 76 శాతం అధికంగా వెచ్చిస్తున్నాయి. వాహన రంగం సైతం తమ ఈ మాధ్యమ ప్రకటనలపై 46 శాతం ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు అంచనాలున్నాయి. కోకకోలా, హెచ్‌యూఎల్, పెప్సి, హ్యుందాయ్, ఐసీఐసీఐలు సైతం ఎక్కువ మొత్తాన్నే ఇందుకోసం పక్కనబెడుతున్నాయి. ఐపీఎల్.. 3జీ ప్రభావం కూడా
అన్ని క్రికెట్ మ్యాచ్‌లనూ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి యూట్యూబ్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత హెచ్ఎస్బీసీ వంటి ప్రధాన ప్రకటనదారులూ రంగంలోకి దిగాయి. మరో పక్క 3జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రకటనదారులకు మరో ప్లాట్‌ఫాం దొరికినట్లయింది. ఇవి ప్రకటనల విభాగంలో కొత్త విప్లవానికి దారితీస్తున్నాయి. టీవీ, పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటివన్నిటిని ఒక దగ్గరకు తీసుకురావడం కూడా కంపెనీలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఇదీ సమస్య
అయితే తక్కువ మందికే ఈ ప్రకటనలు చేరుతుండడం ప్రధాన సమస్య. కనెక్టివిటీ కాస్త నెమ్మదిగా ఉండడం కూడా ప్రకటనల దారులను అసంతృప్తిని కలిగించేదే.
2013 నాటికి రూ.5,520 కోట్లకు!
ఐపీఎల్ ఉన్నా జోరు తగ్గని టీవీ ధారావాహికలు
నేడు భారతీ-జైన్ ఒప్పందం!
విశాఖ ఉక్కు ధరల మోత
విశాఖ ఉక్కుకు ఐఎఫ్‌టీడీవో పురస్కారం
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఐఎఫ్‌టీడీవో) ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి పురస్కారం-2010ను విశాఖ ఉక్కు కర్మాగారం అందుకోనుంది. అవార్డును ఏప్రిల్ 20న లండన్‌లో జరగనున్న 39వ ఐఎఫ్‌టీడీవో సదస్సులో అందజేస్తారు.
రాష్ట్రంలో తగ్గిన చక్కెర ఉత్పత్తి
రికవరీదీ అదే వరుస..
ముగిసిన చెరకు క్రషింగ్
హైదరాబాద్ - న్యూస్‌టుడే

కారణాలు ఇవీ
అంతక్రితం సంవత్సరం చెరకు మద్దతు ధరపై నెలకొన్న అనిశ్చితిప్రభావం సాగు విస్తీర్ణంపై పడింది. 2008-09లో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు కాగా 2009-10 సంవత్సరంలో అది కాస్తా 1.20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయంగా పంచదార ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర రూ.15 నుంచి రూ.45ను తాకింది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడంతో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువే రైతులకు చెల్లించాయి. కేంద్రం ప్రతిపాదించిన లాభదాయకమైన ధర.. రూ.1,298..తో నిమిత్తం లేకుండా, టన్ను చెరకుకు రూ.1,700 నుంచి రూ.2,200 వరకు చెల్లించాయి.

రికవరీపై కరవు, వరదలు ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా సహకార రంగంలో నడుస్తున్న కర్మాగారాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. గత ఏడాది 9.66% రాగా ఈ ఏడు అది 8.44 శాతంగా ఉంది. సంయుక్త రంగంలో నడుస్తున్న కర్మాగారాలోనూఅదే క్షీణత కనిపించింది. ప్రైవేటు వాటిల్లో ఫరవాలేదనిపిస్తోంది. మొత్తంమీద 35 కర్మాగారాల పరిధిలో రికవరీ శాతం నిరుటి కన్నా 0.69% తగ్గింది. ఇది గతేడాది 9.89% ఉండగా, ఈసారి 9.20% ఉంది.
ఒకటి హిట్..మరొకటి ఫట్
![]() యూకే కంపెనీతో ఒప్పందం |
![]() |
ఆరేళ్లలో అప్పులు రెట్టింపు
పెరుగుతున్న వడ్డీల భారం
ప్రజలపై ప్రభావం


వివిధ ఆర్థిక సంస్థలకు వేలం ద్వారా పదేళ్ల వ్యవధి గల సెక్యురిటీలను (బాండ్లు) విక్రయించి రుణాలను తీసుకురావడానికి రాష్ట్రం ఇటీవల ప్రాధాన్యం ఇస్తోంది. 2009-10లో దాదాపు ప్రతినెలా ఇలా సెక్యురిటీలను విక్రయించింది. గత పదేళ్లలో తెచ్చిన రుణం రూ.38,336 కోట్లకు చేరింది. దీన్ని రానున్న పదేళ్లలోను ఏటా కొంత మొత్తం చొప్పున చెల్లించాల్సివుంటుంది. ఇలా 2010-11లో రూ.1,639 కోట్లు ఇవ్వాలి. ఆ తర్వాత సంవత్సరాల నుంచి ఈ మొత్తం క్రమేణా పెరుగుతూ 2018-19లో రూ.10,934 కోట్లను చెల్లించాలి. ఆర్బీఐ విశ్లేషణలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..
* 2009-10లో స్థూలరాష్ట్రోత్పత్తి (జీఎస్డీపీ)లో 4% మేర అప్పుల్ని తెచ్చుకోవచ్చనే వెసులుబాటును 10 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగించుకుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా మిగతా రాష్ట్రాలు 3 శాతం అప్పులతో సరిపుచ్చుకున్నాయి.
* వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లకపోవటం తన ఘనతగా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. 2005-06 తర్వాత చాలా రాష్ట్రాలు కూడా వీటి జోలికి వెళ్లటమేలేదు.
* మొత్తం అప్పులు స్థూలరాష్ట్రోత్పత్తిలో 30 శాతానికి పరిమితం కావాలనే నిబంధనను 2008-09లో సాధించినా ఇప్పుడది 31.30 శాతానికి పెరిగింది.
బ్రహ్మణి ఉక్కులో జిందాల్‌కు వాటాలు?
Monday, March 29, 2010
సామ్సంగ్ సంచలనం త్రీడీ టీవీ
40 నుంచి 65 అంగుళాల వరకు 3డీ లెడ్ టీవీలు, ప్లాస్మా టీవీలను సామ్సంగ్ రూపొందించింది. త్రీడీ ప్రాసెసర్‌తో కూడిన బిల్ట్ ఇన్ వీడియో ప్రాసెసర్, 3డి ఆప్టిమైజ్డ్ ప్యానెల్, ఫ్రేమ్ రేట్ కన్వర్షన్ టెక్నాలజీ లాంటివి త్రీడీలో అత్యుత్తమ పిక్చర్ క్వాలిటీని అందిస్తాయి. హైపర్ రియల్ ఇంజన్ సాయంతో, ఫ్లూయిడ్ మోషన్, ఎక్స్పాండెడ్ నేచురల్ కలర్ చక్కగా కన్పిస్తాయి. పరిశ్రమలోనే తొలిసారిగా 2డీ కంటెంట్‌ను రియల్ టైమ్‌లో త్రీడీ కంటెంట్‌గా మార్చే సదుపాయాన్ని, టెక్నాలజీని ఈ టీవీలు కలిగిఉన్నాయి. లైవ్ మ్యాచ్‌లకు మరింత డెప్త్, క్లారిటీని ఈ టెక్నాలజీ అందిస్తుంది. బిల్ట్ ఇన్ ఇథర్నెట్ కనెక్షన్, వైర్లెస్ రెడీ సామర్థ్యాలతో కంటెంట్ వితౌట్ బార్డర్స్ అనే వీక్షకుల డిమాండ్‌ను ఇది తీర్చగలుగుతుంది. అప్‌గ్రేడెడ్ ఇంటర్నెట్ ఎట్ టీవీ ఫీచర్ కూడా దీనిలో ఉంది. దీని ద్వారా ది అసోసియేటెడ్ ప్రెస్, బ్లాక్ బస్టర్, ఫ్యాషన్ టీవీ, యూ ట్యూబ్ లాంటి వాటి కంటెంట్‌ను కూడా వీక్షించవచ్చు. ఆల్‌షేర్ ఫీచ ర్ ద్వారా యూజర్లు తమ టీవీని కంపాటబుల్ మొబైల్ ఉప కరణాలతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మూవీలు, ఫోటోలు, మ్యూజిక్ ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
పర్యావరణ స్నేహపూర్వక టెక్నాలజీలను ఈ టీవీల రూప కల్పనలో వినియోగించారు. త్రీడీ టీవీలపై కొనుగో లుదారులకు ఆసక్తి కల్పించేందుకు సామ్సంగ్ వినూత్న మార్కెటింగ్ క్యాంపెయిన్‌కు కూడా శ్రీకారం చుట్టింది. సామ్సంగ్ ప్లాజాలతో పాటు ముఖ్యమైన మల్టీబ్రాండెడ్ కౌంటర్లలో ఇన్‌స్టోర్ డిస్ప్లే చేయాలని కూడా యోచిస్తోంది. ఈ ఏడాది మొత్తం లెడ్ టీవీ వి క్రయాల్లో త్రీడీ టీవీల వాటా 10 శాతం దాకా ఉండ గలదని భావిస్తున్నట్లు సంస్థ డిప్యూటీ ఎండీ రవీందర్ జుత్షి అన్నారు. సామ్సంగ్ త్రీడీ లెడ్ టీవీలు 40-65 అంగుళాల స్క్రీన్‌సైజుల్లో రూ. 1,30,000 నుంచి రూ. 4.35 లక్షల వరకూ లభ్యమవుతాయి. 3డీ ఎల్సీడీ సిరీస్ 46-55 అంగుళాల స్క్రీన్‌సైజుల్లో రూ. 1,29,000 నుంచి రూ. 1.87 లక్షల వరకూ లభ్యమవుతాయి. 63 అంగుళాల త్రీడీ ప్లాస్మా టీవీ ధర రూ. 3 లక్షలు.
అదృశ్యమవుతున్న ఎక్స్పోర్లర్
దీంతో పలువురు యూజర్లు ఆయా బ్రౌజర్లను డౌన్లోడ్ చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఎక్స్‌ప్లోరర్ గత రెండేళ్ళలో దాదాపుగా 20 శాతం మార్కెట్ షేర్‌ను కోల్పోయింది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు దేశంలో పీసీల్లో నూటికి 99 శాతం వాటిల్లో ఇంటర్నెట్ బ్రౌజర్‌గా మైక్రోసాఫ్ట్ ఉత్పాదన ఎక్స్‌ప్లోరర్ ఉండేది. 2008 నాటికి అది 70 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం 51 శాతానికి దిగజారిపోయింది. యురోపియన్ యూనియన్‌లో, ఇతర పలు దేశాల్లో ట్రేడ్ కమిషన్ నియమ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆయా దేశాల్లో వాటి ఆదేశాల ప్రభావం ఎక్స్‌ప్లోరర్‌పై పడింది. మనదేశంలో అలాంటి ట్రేడ్ కమిషన్ లాంటివి ఏమీ లేకున్నా కూడా ఎక్స్‌ప్లోరర్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.
యూరప్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గతంలో కంటే కూడా మూడింతల మార్కెట్ షేర్‌ను కోల్పోయింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్7 ద్వారా ఎక్స్ ప్లోరర్ను వాడేటప్పుడు ఒక బ్యాలెట్ నిర్వహించాల్సిందిగా యురోపియన్ యూనియన్ ఆదేశించింది. ఈ బ్యాలెట్ స్క్రీన్ యూజర్లకు మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఆపిల్ సఫారి, ఒపెరా లాంటి బ్రౌజర్లను కూడా ప్రద ర్శిస్తుంది. వీటిలో యూజర్లు తమకు నచ్చిన బ్రౌజర్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల కూడా ఆయా దేశాల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వినియోగం పడిపో యింది. ప్రపంచ వ్యా ప్తంగా బ్రౌజర్ మార్కెట్లో ఎక్స్‌ప్లోరర్ వాటా 55 శాతం. ఫైర్ఫాక్స్ 31 శాతం వాటాను, క్రోమ్ 7 శాతం వాటాను, సఫారీ 4 శాతం వాటాను కలిగి ఉన్నా యి. స్టాట్ కౌంటర్ కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వినియోగం ఒక్కసారిగా పడిపోవడం ఆరంభమైంది. క్రోమ్, ఫైర్ ఫాక్స్‌ల వంటి బ్రౌజర్ల వినియోగం పెరిగిపోయింది.
భద్రత పరమైన కారణా ల వల్లే గా కుండా స్లో కనెక్టివిటీ వంటి కారణాలతో కూడా యూజర్లు ఇతర బ్రౌజర్ల వాడ కంపై మొగ్గు చూపుతున్నారు. దేశంలో 71 మిలియన్ల ఇంటర్నె ట్ యూజర్లు ఉండగా కేవలం 8 మిలియన్ల మంది మాత్రమే బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారు. పీసీ తయారీదారులు, యూజర్లు పీసీలపై దేన్ని కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశాన్ని కలిగిఉన్నా రంటూ మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఫైర్ఫాక్స్ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లో రర్‌ను అధిగమించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వినియోగం తగ్గి తమ బ్రౌజర్ల వినియోగం పెరగడంతో క్రోమ్, ఒపెరా లాంటి వాటికి ఎంతో ఆనందం కలిగి స్తోంది. యురోపియన్ మార్కెట్లో బ్రౌజర్ బ్యాలెట్ నిర్వహించడంపై గూగుల్ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానిస్తూ యూజర్ల ఎంపిక అవకాశం ఎంతో ముఖ్యమని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్నెట్ కంపెనీలకు బ్రౌజర్లు ఎంతో ముఖ్యం. వాటి ద్వారా కూడా ఎంతో ఆదాయం పొందే అవకాశం ఉండ డమే దీనికి కారణం. బ్రౌ జర్ అనేది ఇంటర్నెట్కు గేట్వేగా తోడ్పడుతుంది. ఈ గేట్‌వే కు జోడించే ఏ అప్లికేషన్ అయినా ఆ బ్రౌజర్ కంపెనీకి ఎంతో ఆదాయం అందించగలుగుతుంది. వినియోగదారులకు ఎంపిక అవకాశం పెరగడం వల్లే తమకు మార్కెట్ బాగా పెరిగిందని ఒపెరా సంస్థ విశ్వసిస్తోంది. మిలియన్ల కొద్దీ ఇం టర్నెట్ యూజర్లు నూతన బ్రౌజర్లను వినియోగించి వాటి పనితీరుకు ఆక ర్షితులై వాటిని తమ డిఫాల్ట్ బ్రౌజర్లుగా ఉపయోగి స్తున్నారు. ఫలి తంగా ఎక్స్‌ప్లోరర్‌కు మేలైన, దీటైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సంగతిని తెలుసుకోగలుగుతున్నారని ఒపెరా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది మరో 41 అమెరికా బ్యాంకులు దివాళా
హ్యుండయ్ నుంచి 800 సిసి కారు
ఈ కారును దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. త్వరలో 800 సిసి వేరియంట్ ఉత్పత్తిని కంపెనీ చేపట్టనుంది. ఇదిలాఉండగా టాటా నానో కారుకు పోటీగా కారును తీసుకువచ్చే ఉద్దేశం లేదని కంపెనీ పేర్కొంది.
2011 చివరికి ఫియట్ చిన్నకారు
ఫియట్ ఇండియా ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చిన పాలియో, గ్రాండ్ పుంటోలతో కార్ల విక్రయాలు, మార్కెటింగ్‌లో నేర్చుకున్న వ్యాపార పాఠాలను రంగరించి తాము తాజాగా తీసుకువచ్చే చిన్న కారులో పొందు పరుస్తామని ఫియట్ ఇండియా సిఇఒ రాజీవ్ కపూర్పేర్కొన్నారు.
డిస్కౌంట్ల జాతర...
ఏప్రిల్ 1 నుంచి 13 పట్టణాల్లో యూరో ప్రమాణాలు తప్పనిసరిగా మారాయి. మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో సగం ఈ నగరాల్లోనే జరుగుతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రమాణాల అమలుకు పూర్వమే పాత స్టాక్‌ను వదిలించుకోవాలని డీలర్లు చూస్తున్నారు. కార్ల ధరపై గరిష్ఠంగా 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు డిస్కౌంట్లను అందజేస్తున్నారు.
ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలు పెరగడం మూలా న గత రెండు వారాల్లో కొత్త కార్ల బుకింగ్స్ బాగా తగ్గాయని, తాజాగా భారత్ స్టేజ్ ఐగ నిబంధనల కారణంగా కార్ల ధరలు మరింత పెంచితే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని డీలర్ వర్గాలు అంటున్నాయి.
కార్ల ధరలకు యూరో పోటు
బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం మూలాన పలు కంపెనీలు వెనువెంటనే కార్ల ధరలను పెంచాయి. ఈ పరిణామం చోటుచేసుకొని నెల రోజులు కూడా గడవక ముందే మరో మారు ధరల వాత పడుతోంది. ధరలను పెంచడానికి రంగం సిద్ధం చేసుకున్న కంపెనీలలో టాటా మోటార్స్, ఫియట్, హ్యుండయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ ఉన్నాయి.
13 పెద్ద నగరాల్లో యూరో ఐగ ఇంధనాన్ని విక్రయించనున్నట్టు ఇటీవలనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇంధనానికి తగిన విధంగా వాహనాల ఇంజన్లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పదమూడు నగరాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో యూరో ఐఐఐ ప్రమాణాలను అమలు చేయనున్నారు.
యూరో ఐగ ప్రమాణాలకు దీటుగా ఇంధనం ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని వినియోగదారులకు పంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించి వారం కూడా గడవక ముందే కార్ల కంపెనీలు చేసిన ఈ ప్రకటన వినియోగదారులను గుక్క తిప్పుకోనీయనిదిగా ఉన్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఏ కంపెనీ ఎంతెంత?
షెవర్లే బీట్, స్పార్క్ మినహా మిగతా అన్ని మోడళ్ల ధరపై 6,000 రూపాయల వరకు పెంచనున్నట్లు జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పి.బాలేందర్ తెలిపారు. హ్యుండయ్ మోటార్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ మొదటి వారం నుంచి 5,000 రూపాయల వరకు పెంచాలని భావిస్తోంది.
తమ కార్ల ధరల పెరుగుదల ఏప్రిల్ తొలి వారంలో ఉంటుందని, ధరల స్థాయి 4,000- 5,000 రూపాలయ మధ్య ఉంటుందని హ్యుండయ్ మోటార్ రీజినల్ సేల్స్ మేనేజర్ కుమార్ ప్రియేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భారత్ స్టేజ్ ఐగఉద్గార ప్రమాణాలను పాటించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 1 తరువాత కార్ల ధరల పెరుగుదల ఉంటుందని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వర్గాలు వెల్లడించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తన అన్ని మోడల్ కార్ల ధరలను పెంచనుంది. ఫియట్, మెర్సిడెస్ బెంజ్, టొయోటా కూడా ఈ కంపెనీల బాటలోనే పయనించనున్నాయి. కాగా ఏప్రిల్ నుంచి దేశంలో ప్రస్తుతం భారత్ స్టేజ్ ఐఐఐ సిటీలు భారత్ స్టేజ్ ఐగ సిటీలుగా మారనున్నాయి.
మిగతా ప్రాంతాల్లో బిఎస్ ఐఐ నుంచి బిఎస్ ఐఐఐ కి అప్‌గ్రేడ్ అవుతాయి. ఇదిలా ఉండగా 2009 ఏప్రిల్ నుంచి 2010 జనవరి మధ్య కాలంలో సుమారు 1.22 మిలియన్ల కార్ల విక్రయాలు జరిగినట్లు ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంఘం (సియామ్) వెల్లడించింది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 25 శాతం అధికం.
'నవ్వు' రత్న... డాబుకు పోతే..
డాబుకు పోతే..

ఆ..! ఓకే.. అలాగే చేద్దాం. డీల్ వెంటనే పూర్తి చేసేయ్. రూ.2 కోట్లు పంపిస్తున్నా..
అంటూ గడగడా మాట్లాడేస్తున్నాడు.
ఇంతలో ఆ వ్యక్తి లోపలికొచ్చి సార్..! అని పిలిచాడు
ఏమిటీ..? అని ఫోన్ మాట్లాడుతూనే సైగ చేశాడు రామకృష్ణ
ఏంలేదు సార్..! మీరు మాట్లాడుతున్న ఫోన్‌కు కనెక్షన్ ఇద్దామని వచ్చా.
ఆఁ...
బిజినెస్ గారడీలు
డీమ్యాట్ ఉంటేనే గాని షేరు కొనడం సాధ్యం కాదు
* గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు..
పాతిక రూపాయల బాకీ తీరిస్తే పోయేదానికి మొత్తం కంపెనీనే అమ్ముకోవాల్సి వచ్చినట్లు.
* పోయిన చోటే వెతుక్కోవాలి
నష్టపోయిన స్టాక్ మార్కెట్లోనే మళ్లీ నోట్ల కట్టలు కుమ్మరించడమన్న మాట.
* తానొకటి తలస్తే దైవమొకటి తల్చిందట.
లాభం వస్తుంది అనుకుంటే నష్టాలు ముంచేశాయని.
* కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక వూడిందని..
ఎక్కువ వడ్డీ వస్తుందని అప్పు ఇస్తే.. చివరకు టీ తాగడానికి చిల్లర కూడా మిగల్లేదు.
* అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదు
ఆర్థిక మంత్రి ఏదో చేస్తారని అనుకుంటూ కూర్చుంటే.. పెరిగే ధరలు పెరక్క మానవు.
* రాజుగారు తలుచుకొంటే దెబ్బలకు కొదువా!
(కంపెనీ డైరెక్టర్ల) బోర్డు తలుచుకొంటే బోనస్ ఇష్యూలకేం తక్కువ.
అభిరుచి
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
షేర్ సర్టిఫికెట్లు బదిలీ చేయకపోవడం సేవాలోపమే
షేర్ సర్టిఫికెట్లు సకాలంలో షేర్ సర్టిఫికెట్లను బదిలీ చేయని కారణంగా వాటిల్లిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందిగా సదరు కంపెనీని వినియోగదారుల న్యాయస్థానం ఆదేశించిన ఉదంతం ఇది..
బదిలీ చేయకపోవడం సేవాలోపమేకంపెనీ పేరు: యాడ్వెంట్ కంప్యూటర్ సర్వీసెస్
ఫిర్యాదుదారులు: వి.ఆర్.కణ్నన్ తదితరులు
న్యాయస్థానం: జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం, న్యూఢిల్లీ

బఫెట్ సూత్రావళి టెక్నాలజీ షేర్లకు ఈయన దూరం!
టెక్నాలజీ షేర్లకు ఈయన దూరం!

బఫెట్ పెట్టుబడి మంత్రాంగం ఏమంత సంక్లిష్టమైనదేమీ కాదు. మంచి కంపెనీలు నష్టాల్లో ఉన్నపుడు ఆ షేర్లు కొనడం..ఆయన పాటించిన ఏకైక సూత్రం. కేవలం ఈ సూత్రంతోనే ఆయన బిలియన్లల కొద్దీ డాలర్లను సంపాదించారు.
సంపద ఎక్కువైతే సంపాదించడం కష్టం!: 1957-66 మధ్య కాలంలో ఎస్&పీ-500 ఆర్జించిన లాభం కంటే 14.5 రెట్ల మేర సంపదను బఫెట్ తన జేబులో వేసుకున్నారు. తాజా దశాబ్దంలో మాత్రం సూచీ కంటే కేవలం 2.2 రెట్ల మేర ధనాన్నే ఆయన కూడగట్టుకోగలిగారు. ఏమైంది? బఫెట్ మంత్రం బఫెట్‌కే పనిచేయలేదా..అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే..
బఫెట్ మొత్తం పెట్టుబడులు ఇపుడు 110 బిలియన్ డాలర్లుగా ఉన్నాయనుకుంటే.. మొత్తం మీద తేడా కనిపించాలీ అంటే కనీసం 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలి. ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఏదైనా కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ షేర్లను కొనలేం, అమ్మలేం. ఆ లెక్కన బఫెట్ 2 బిలియన్ డాలర్లు పెట్టాలంటే ఆ కంపెనీ మార్కెట్ విలువ కనీసం 20 బిలియన్ డాలర్లు పైగా ఉండాలి. మరి ఆ స్థాయి కంపెనీలు ఎన్ని ఉంటాయి.
బఫెట్ మాటల్లో చెప్పాలంటే.. 'ఒక మిలియన్ డాలర్లపై ఏడాదిలో 50 శాతం లాభాలను తెచ్చిపెట్టగలను.. అందుకు నేను హామీ ఇవ్వగలను' అంటారాయన. దీన్ని బట్టి భారీ స్థాయి పెట్టుబడులున్నా కష్టమేనని తెలుస్తోంది. అయితే ఈ తరహాలో బఫెట్ లాంటి వ్యక్తులే ఉంటారు. కేవలం ఆరు నెలల్లోపు తన సంపదను 50 శాతానికి పెంచుకున్న మోనిష్ పబ్రాయ్ అనే హెడ్జ్ ఫండ్ మేనేజరు ఏం చెబుతారంటే..' నేను బఫెట్‌ను ఏమాత్రం సంకోచం లేకుండా అనుకరించా.. ఈ ఘనతంతా ఆయనదే'నంటారు. ఈయన ఇటీవలే క్రిప్టోలాజిక్ అనే కంపెనీలో షేర్లు కొన్నారు. ఆ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ 250 మిలియన్ డాలర్లే.
ఇక గ్రీన్బ్లాట్ అనే మరో హెడ్జ్ ఫండ్ మేనేజరు కూడా తొలి పదేళ్లలో ఏటా 50 శాతం లాభాలు పొందారు. ఇరవై ఏళ్లలో మాత్రం 40 శాతానికే పరిమితమయ్యారు. అంటే బఫెట్‌లాగే ఎక్కువ పెట్టుబడులుంటే తక్కువ లాభాలొస్తాయని అర్థమైంది. ఆయన ఏం చేశారంటే మొత్తం బయటి పెట్టుబడుదారులందరినీ ఫండ్ నుంచి బయటకు పంపించి తన సొంత డబ్బుతో పెట్టుబడులను కొనసాగించారు.
చిరుతిళ్లు .రూ.14,000 కోట్లు
చిన్నప్పుడు బామ్మో, అమ్మమ్మో పావలా ఇస్తే.. ఠక్కున షావుకారు కొట్టుకెళ్లి బఠాణీలు, చెగోడీలు, జంతికలు, శెనగపప్పు ఉండలు, మామిడి తాండ్ర కొనుక్కుని.. జేబులో వేసుకుని ఆరారగా లాగించేసిన రోజులు గుర్తున్నాయి కదూ..! ఇప్పుడూ అదే.. కాకపోతే కాస్త ఛేంజ్.. పిల్లలకు ఓ యాభై రూపాయలు చేతిలో పెడితే.. పక్కనే ఉన్న షాపుకెళ్లి కుర్కురే, లేస్, చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకుని కరకరా నమిలేస్తున్నారు. రేట్ల సంగతి పక్కనపెడితే.. కాలక్షేపం తిళ్లకు కొదువలేని రోజులివి. ఒక్క పిల్లలనే కాదు.. పెద్దవాళ్లు సైతం ఈ 'ప్యాకింగ్ తిళ్ల'కు బాగా అలవాటు పడిపోయారు. బంధుమిత్రులతో ముచ్చట్లు, ప్రయాణాలు.. ఇలా సందర్భమేదైనా.. వీరికి అక్కరకొస్తున్నాయీ ప్యాకింగ్ తినుబండారాలు.

కుర్కురే, లేస్, బింగో, చీటోస్, అంకుల్చిప్స్, లెహర్ చిప్స్, పిక్నిక్
చీజ్‌బాల్స్, మంచ్ టైమ్, మినీ సమోస, ఆలూ భుజియా
'రెడీ టు ఈట్' ఫుడ్(ఎప్పుడంటే అప్పుడు తినడానికి సిద్ధంగా ఉండే ఆహార పదార్థాలు) ఇప్పుడో పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ప్యాకెట్లలో పల్లీలు, వేరుశెనగ అచ్చులు, ఉండలు, బంగాళదుంప చిప్స్, సమోసాలు.. ఇలా అన్ని రకాల పదార్థాలు లభిస్తున్నాయి. దేశం మొత్తం మీద ఈతరహా చిరుతిళ్లు 1000 రకాల్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,000 కోట్లు)కు చేరింది. ఇందులో బ్రాండెడ్ ఫుడ్ విక్రయాలు ఏటా 20% పెరుగుతున్నాయి. 'తక్కువ పరిమాణంలో, ఆరోగ్యానికి హాని చేయని, ఇంట్లో వండుకునే వాటికి ప్రత్యామ్నాయంగా' లభించే ఇలాంటి తినుబండారాలకు కొంచెం ఖరీదు ఎక్కువైనా కొనేందుకు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలు ముందుకొస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాలను ఆకట్టుకునేలా బ్రాండెడ్ కంపెనీలు నూతన ఉత్పాదనలతో ముందుకొస్తున్నాయి. విదేశీ కంపెనీలు స్థానిక ఉత్పత్తిదారులతో భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేసి మరీ మందుకు దూసుకుపోతున్నాయి.
ఎన్ని కంపెనీలో..: హిందుస్థాన్ లీవర్, పార్లే, హల్దీరామ్స్, నెస్లే, బ్రిటానియా, క్యాడ్బరీ,ఐటీసీ, కాన్ ఆగ్రా, మారికో, డాబర్, బికానో, ఫ్రిటో లే, కెలాగ్స్, బాలాజీ, నీలగిరీస్ వంటి సంస్థలు ప్యాకెట్ ఫుడ్ తయారీలో నిమగ్నమయ్యాయి. మన రాష్ట్రానికి సంబంధించి ప్రియా ఫుడ్స్, స్వీట్ మ్యాజిక్ సంస్థలు కూడా ఈ మార్కెట్లో ప్రవేశించాయి. అమూల్ బ్రాండ్‌తో ప్రసిద్ధి చెందిన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) కూడా గత జూన్ నుంచి రంగంలోకి దిగింది. ఇవికాక స్థానికంగా పేరొందిన దుకాణాలు, తయారీ సంస్థలు, ఇళ్లలో తయారు చేసి విక్రయించే వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మార్కెట్లో వీరి విక్రయాలు ఏటా 8% పెరుగుతున్నాయని అంచనా.
డిమాండ్ ఇలా: ప్రాంతాలకు అతీతంగా అత్యధికంగా అమ్ముడయ్యేవి బంగాళాదుంప చిప్స్. కారం, ఉప్పు జతచేసే స్నాక్స్ విక్రయాల్లో 85% ఇవే ఉంటాయి. మిగిలినవి వేరుసెనగ గుళ్లు, పప్పులతో తయారు చేసేవి. రిటైల్ చెయిన్ దుకాణాల్లో పాప్‌కార్న్‌తో పాటు సోయా గింజలు,బ్రెడ్, చాకొలేట్ కలిపిన పదార్థాలు,వేయించిన-ఉడికించిన పద్ధతిలో తయారుచేసేతినుబండారాలకు గిరాకీ అధికంగా లభిస్తోంది.
ప్యాకింగ్ కీలకం: ఆహార తయారీ పరిశ్రమలో ప్యాకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. స్నాక్స్ తయారీదార్లు బ్యాక్టీరియా నశించేలా నైట్రోజన్ ఫ్లష్ ప్యాకింగ్ చేస్తూంటారు. చిప్స్ వంటి తక్కువ బరువు ఉండే వాటిలో 35-40 గ్రాముల ప్యాకెట్లు ఎక్కువగా విక్రయమవుతాయి. 400 గ్రాముల వరకు ఆయా కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి.
ఎగుమతి, దిగుమతులు:ఆరంభంలో విదేశాల నుంచి మన దేశానికి ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా దిగుమతి అయ్యేది. ఇప్పుడు మన దేశం నుంచీ ఎగుమతి చేస్తున్నారు.
* 2002లో రూ.46 కోట్ల విలువైన సరకు దేశంలోకి దిగుమతి కాగా, 2006లో ఈ మొత్తం రూ.138 కోట్లకు చేరింది.
|
* 1999లో పెప్సికో అనుబంధ సంస్థ ఫ్రిటోలే తయారుచేసిన 'కుర్కురే'కు అనూహ్యమైన గిరాకీ ఏర్పడింది. భారతీయులను ఇంతగా ఆకట్టుకున్న ఈ ఉత్పాదనను అంతర్జాతీయంగా ప్రవేశపెట్టాలని పెప్సికో సన్నాహాలు చేస్తోంది. భారత్‌లోని కుర్కురే ఫ్లేవర్ ఉంటూనే, అంతర్జాతీయతకు అనువైన రుచి ఉండేలా తీర్చిదిద్ది అమెరికా, బ్రిటన్లలో ప్రవేశ పెట్టేందుకు పెప్సికో యత్నిస్తోంది. * భారత్‌లో జరిగే ప్యాకెట్ ఫుడ్ విక్రయాల్లో ఫ్రిటోలేకు 45% వాటా ఉంది. * భారత్‌లోని విభిన్న ప్రాంతాల ప్రజల అభిరుచికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ ఉత్పాదనల రుచులను స్వల్పంగా మార్చి, స్థానికంగా సరఫరా చేస్తున్నాయి. * 2005లో 155 బిలియన్ డాలర్లు ఉన్న భారత ఆహార పరిశ్రమ, 2025 నాటికి 344 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. * పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి స్నాక్స్ తలసరి వినియోగం 500 గ్రాములు, గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో పదోవంతు ఉంటుందని అంచనా. * దేశంలో అత్యధికంగా పశ్చిమ భారతావనిలో స్నాక్స్ వినియోగం అధికం కాగా, తర్వాతి వాటా ఉత్తరాదిదే. |
సన్న బియ్యానికి రెక్కలు...

లారీలతో ఉప్పుడు బియ్యం తరలింపునకు అనుమతి?
మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ధరలు పెరిగే ప్రమాదం
హైదరాబాద్ - న్యూస్‌టుడే

రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 'ఖరీఫ్ లెవీ మార్కెటింగ్ ఏడాది'లో 37 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 25 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు (బాయిల్డ్) బియ్యం సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 6 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సేకరించింది. గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో లెవీ సేకరణ మందగమనంలో సాగుతోంది. గోదాముల్లో సరకు వేరే ప్రాంతానికి వెళితే ఆ మేరకు కొనుగోలు చేస్తున్నారు.
ఉన్నతాధికారిపై ఒత్తిడి
ఈ నేపథ్యంలో తమ దగ్గర భారీగా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నాయని, వీటిని లెవీ కింద ఎఫ్‌సీఐ సరిగా సేకరించడం లేదని మిల్లర్ల లాబీ.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారికి తెలిపింది. ఈ నిల్వలను లారీల ద్వారా రవాణా చేసుకుని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోనివ్వాలని ఒత్తిడి తెచ్చింది. మిల్లర్ల ప్రతిపాదన శుక్రవారం పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ధరల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. లారీల ద్వారా ఉప్పుడు బియ్యం తరలింపునకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించాలని ఈ కమిటీ నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదే జరిగితే..: ఈ ఖరీప్ పంట కాలంలో సన్న బియ్యం ఉత్పత్తి అధికంగా ఉండటంతో రాష్ట్రంలో నిల్వలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల కొద్ది కాలంగా సన్న బియ్యం రేట్లు తగ్గాయి. రెండు మూడు నెలల కిందటి వరకు రాష్ట్రంలో పాత సన్న బియ్యం రేట్లు కిలో రూ.35కు పైగా పెరిగాయి. ఇప్పుడు కొత్త పంట రావడంతో సన్న బియ్యం నిల్వలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి. అందువల్ల రేట్లు కూడా తగ్గి, నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం నాణ్యమైన కొత్త సన్న బియ్యం కిలో రూ.22 నుంచి రూ.25కే దొరుకుతోంది. ఈనేపథ్యంలో ఉప్పుడు బియ్యం నిల్వలను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తే.. ఉప్పుడు బియ్యం ముసుగులో సన్న బియ్యం తరలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాష్ట్రంలో ధరలు పెరిగాయని విజిలెన్సు విచారణలో తేలింది.
ఇలా చేస్తే మేలు..: పర్మిట్ల ద్వారా ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్లు రైల్వే వ్యాగన్లలో తరలించుకునే అవకాశం ఉంది. రైళ్ల ద్వారా తరలించేటప్పుడు లోడింగ్.. అధికారుల సమక్షంలో జరుగుతుంది. గమ్యస్థానం చేరాకే అన్లోడింగ్ జరుగుతుంది. మధ్యలో సరకును కదిలించడం కుదరదు. లారీల ద్వారా రవాణా చేసేటప్పుడూ అధికారుల సమక్షంలోనే లోడింగ్ జరిగినా.. మధ్యలో అనువైన చోట వాహనాన్ని ఆపి, సన్న బియ్యాన్ని ఎక్కించే అవకాశం ఉంది. దీన్ని విజిలెన్స్ అధికారులు లోగడ బయటపెట్టారు. మిల్లర్లు మాత్రం.. రైల్వేశాఖ వ్యాగన్లను ఇవ్వడంలేదని సాకు చెబుతున్నారు. కోరినన్ని వ్యాగన్లు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం మొదటి ప్రయత్నంగా మిల్లర్లు కోరినన్ని వ్యాగన్లను ఇప్పిస్తే లారీల ద్వారా బియ్యం తరలించాల్సిన అవసరం ఉండదు.
ఎఫ్‌సీఐ ఇంకా 19లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం రెండో ప్రయత్నంగా.. ఎఫ్‌సీఐ గోదాముల్లో సరకును ఇతర రాష్ట్రాలకు కేంద్రం తరలించేలా చేసి, మిగతా 19 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని లెవీ సేకరించేలా చర్యలు తీసుకుంటే లారీల ద్వారా ఉప్పుడు బియ్యం తరలించే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో చర్యలు తీసుకోకుండా లారీల ద్వారా తరలింపునకు అనుమతిస్తే రాష్ట్రంలో బియ్యం ధరలకు రెక్కలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
పన్ను ఎగవేతదారులపై ఐటీశాఖ 'పంచ్'నామా!
1 నుంచి విశాఖ ఉక్కు ధరలు పెంపు..!
పెద్ద షేర్లు 'చిన్న'బోయాయ్
'బి' గ్రూపు షేర్లపై పెరిగిన మదుపర్ల ఆసక్తి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుండడం సర్వసాధారణమేమీ కాదు. ఎప్పుడో కానీ అలా జరగదు. అయితే స్టాక్ మార్కెట్లో ఇటీవలి ట్రేడింగ్‌ను చూస్తే ఇది నిజమనిపించకమానదు. ఎందుకంటే ఎప్పుడూ మధ్య, చిన్న షేర్లపై ఏ విషయంలోనైనా పైచేయి సాధిస్తూ వచ్చిన పెద్ద షేర్లు చిన్నబోయాయి. వీటి ట్రేడింగ్ పరిమాణంతో పోలిస్తే చిన్న షేర్ల ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. మదుపర్లు వాటిపైనే ఆసక్తి చూపించారు. ఎందుకిలా?

'ఎ' గ్రూప్‌లో ట్రేడింగ్ పరిమాణం కంటే 'బి' గ్రూపులో ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. ఇలా మదుపర్లు ఉన్నట్టుండి చిన్న షేర్లవైపు మొగ్గుచూపడానికి కారణాలున్నాయి. ('ఎ' గ్రూపు షేర్లంటే భారీ మార్కెట్ విలువ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు. ఇక బి గ్రూపు షేర్లంటే మధ్య, చిన్న స్థాయి కంపెనీల షేర్లు.) మొదటి కారణం ఏమిటంటే మదుపర్లకు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లు ఓ మోస్తరు చౌక ధరలకే వస్తున్నాయి. ఇక చాలా వరకు ఫండ్ సంస్థలు ఇప్పటికే తమ వద్ద ఉన్న మధ్య విలువ షేర్లను భారీ స్థాయిలో కొంటున్నారు. తద్వారా ఆయా షేర్ల ధరలు దూసుకెళ్లేలా చేసి.. తమ పోర్ట్‌ఫోలియోలోని నికర ఆస్తుల విలువ(ఎన్ఏవీ)లను పెంచుకోవాలని భావించారు. ఇది రెండో కారణం.
గత మంగళవారమే చూస్తే బి గ్రూపు టర్నోవరు రూ.2,074 కోట్లుగా నమోదైంది. ఎ గ్రూపుతో పోలిస్తే ఇది రూ.197 కోట్లు ఎక్కువ. గురు(18న), శుక్ర(19న), సోమ(22న)వారాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది (పట్టిక చూడండి). ఇది సాధారణంగా కనిపించే ధోరణికి పూర్తి వ్యతిరేకం కావడం గమనార్హం.
ప్రస్తుతం మదుపర్లు చిన్న, మధ్య స్థాయి షేర్లు మంచి విలువకే వస్తున్నాయి. మూలాలు కూడా బావుండడంతో ఎ గ్రూపు కంటే ఎక్కువ లాభాలను ఆర్జించగలవన్న విశ్వాసంతో చిన్న షేర్లవైపు దృష్టి మళ్లించినట్లు తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాదు మధ్య విలువ షేర్లకు మంచి భవిష్యత్ ఉందని.. వీటిలో కొన్ని త్వరలో బ్లూచిప్ షేర్లుగా మారే అవకాశమూ ఉందని వారు చెబుతున్నారు. ఈ విషయమే మదుపర్లకు అత్యంత ఆకర్షణీయాంశంగా కనిపించిందంటున్నారు.
ప్రస్తుత నెలలో బి గ్రూపులో సగటున రూ.2,052 కోట్ల మేర ట్రేడింగ్ జరుగుతోంది. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. అదేఎ గ్రూపు విషయానికొస్తే సగటున రూ.2,566 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించాయి. కానీ మార్చి 17-23 మధ్య తేదీల్లో ఎ గ్రూపుపై బి గ్రూపు షేర్లు ఆధిపత్యం చెలాయించాయి. ఈ వ్యవధిలో దాదాపు 90 షేర్ల మధ్య విలువ షేర్లు 10% లాభాన్ని కూడగట్టుకోవడం విశేషం.
సిద్ధమవని కొత్త పారిశ్రామిక విధానం
పారిశ్రామిక వర్గాల్లో అయోమయం
హైదరాబాద్ - న్యూస్‌టుడే

వాగ్దానభంగం:ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న 2005-10 పారిశ్రామిక విధానం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. వచ్చే నెల మొదటి తేదీ నుంచి అది వర్తించదు. అందులోని రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వడం కుదరదు. ఈ ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు వీలుగా మార్చిలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం 2009 మార్చిలో ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే పరిశ్రమల శాఖ ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఫిబ్రవరిలో ముసాయిదాను రూపొందించి, మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రోశయ్యకి సమర్పించాలి. ఆయన అనుమతి తెలిపాక దానిని విద్యుత్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, నీటిపారుదల, న్యాయశాఖలకు పంపించాలి. అక్కడ ఆమోదం లభించిన వెంటనే మార్చి నెలాఖరుకల్లా నివేదికను విడుదల చేసి, ఆ వెంటనే జీవోను జారీ చేస్తే వెంటనే అమల్లోకి వస్తుంది.
ఇంతలోనే కమిషనర్ బదిలీ
ఈ ప్రణాళికను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామ్‌బాబు కమిషనరేటుకు 2009 మార్చిలో పంపించారు. అప్పటి కమిషనర్ రమేష్‌కు విధాన రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. అధ్యయన నివేదికలు వచ్చాక వాటిని పరిశీలించి ముసాయిదా సిద్ధం చేస్తుండగా, డిసెంబరు మాసంలో ప్రభుత్వం ఆయనకు వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. బదిలీ వల్ల పారిశ్రామిక విధానం విడుదలలో జాప్యం జరుగుతుందని పరిశ్రమల ముఖ్యకార్యదర్శి శ్యామ్‌బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసి, అనంతరామును కమిషనర్‌గా నియమించింది. దీంతో విధాన రూపకల్పన మళ్లీ మొదటికి వచ్చింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గత వారం సమావేశం నిర్వహించి పరిశ్రమలు లేని రెవెన్యూ డివిజన్లను గుర్తించి, కొత్త విధానంలో చేర్చాలని సూచించారు. ఈ గణాంకాలు అధికారుల దగ్గర లేకపోవడంతో వాటి సేకరణకు పూనుకున్నారు. ఈ లెక్కన ముసాయిదా తయారీ వచ్చే నెలలో కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
పొడిగించే ప్రయత్నాలు లేవు:కొత్త ఐటీ విధాన రూపకల్పనలో జాప్యం జరగడాన్ని పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం పాత విధానాన్ని మూడు నెలల పాటు అంటే వచ్చే జూన్ వరకు పొడిగిస్తూ గత వారం ఉత్తర్వులిచ్చింది. పారిశ్రామిక విధానానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నా దాన్ని పొడిగించే ప్రయత్నాలు చేయడం లేదు. రాయితీలు, ప్రోత్సాహకాలపై సందిగ్ధత వల్ల కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారు వెనక్కితగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మాంద్యం, విద్యుత్ కోత తదితర పరిణామాల వల్ల పారిశ్రామికరంగం మందగమనంలో ఉంది. కొత్త విధానం ఉత్సాహం నింపుతుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ జాప్యం ప్రతిబంధకంగా పరిణమించింది. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన విధానాన్ని విడుదల చేయాలనే తపన ప్రభుత్వ వర్గాల్లో కనిపించకపోవడం పారిశ్రామిక వర్గాలను విస్మయపరుస్తోంది.
హోటళ్లుగా ఆర్ అండ్ బీ అతిథి గృహాలు
ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన

పర్యాటకులను ఆకర్షించడానికి రోడ్ షోలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. మరోవైపు వచ్చే ఏడాది 'విజిట్ హైదరాబాద్' ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సందర్శకులను రప్పిస్తామని అధికారులు తెలిపారు. కేంద్రం సహకారంతోమొత్తం 35 ప్రాజెక్టులు చేపడుతున్నామని, వీటిలో నితమ్, నైట్‌బజార్, కొల్లేరు సరస్సు అభివృద్ధి, ఇడుపులపాయలో గోల్ఫ్‌కోర్సు తదితర ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. నిజాం సాగర్ వద్ద బృందావనం, అనంతగిరిలో సాహస పర్యాటక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలున్నాయని గీతారెడ్డి తెలిపారు.
మెహర్బానీ కోసం... రూ.1364 కోట్లు!
కొన్నింటిలో అక్రమాలు
అన్నీ చేస్తే... తీతీదే సంక్షోభంలోకి వెళ్లేది
కరుణాకరెడ్డి హయాంలో జరిగిన బాగోతం
కంగుతిన్న కొత్త పాలకమండలి
రూ. 500 కోట్ల పనులు నిలిపివేత
కరుణాకరరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న చివరి ఏడాది కాలం (2008 ఆగస్టుకు ముందు)లో వెనుకాముందూ చూడకుండా అక్షరాలా రూ.1364.56 కోట్ల విలువైన సివిల్ పనుల నిర్మాణానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఇలా మంజూరైన కొన్ని పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. అయితే ఒక వేళ మంజూరైన పనులన్నింటినీ ప్రారంభించి ఉంటే... ఏకంగా తీతీదే సంక్షోభంలో పడిపోవడమే కాకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కూడా తలెత్తేది.
విషయం తెలుసుకున్న ఆదికేశవులు నాయుడు నేతృత్వంలోని పాలకమండలి కంగుతింది. పాత పాలకమండలి మంజూరు చేసిన చాలా పనులను కొత్త పాలకమండలి నిలిపివేసింది. ఈ పనులు మంజూరు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. సాధారణంగా ఏ సంస్థ అయినా ఏడాదిలో తమకు వచ్చే ఆదాయన్ని బట్టి ఖర్చును నిర్ణయించుకుంటుంది. తితిదే ఆదాయం ఆ రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల వరకూ ఉండేది. నిర్మాణ పనులకు ఏకంగా రూ. 1364.56 కోట్లు మంజూరు చేయడాన్ని చూస్తే... పాలకమండలి ఏ విధంగా పనిచేసిందీ అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి కారణం.. పాలకమండలి మెహర్బానీ కోసమేనన్న విమర్శలు ఉన్నాయి. కరుణాకరరెడ్డి గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితునిగా పేరొందారు. ఆయన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.
అవసరంలేని వాటికీ నిధులు
ఇలా మంజూరైన కొన్ని పనుల్లో అక్రమాలు చోటుచేసుకోగా, మరికొన్ని అవసరం లేని పనులకు కూడా నిధులు మంజూరు చేశారు. వివరాలివి.
* తితిదే ఆధ్వర్యంలో పవన్ విద్యుత్తును గ్రిడ్‌కు కలిపేందుకు ఉద్దేశించిన 33 కేవీ హెచ్‌టీఓ లైను ఏర్పాటుకు అంచనాలను రూపొందించే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించగా... అది రూ.5.65కోట్లు అవుతుందని అంచనా వేసింది. అదే సంస్థకు ఈ పనిని నామినేషన్‌పై అప్పగించారు. దీనిపై అప్పట్లో 'ఈనాడు'లో వార్త రావడంతో అధికారులు స్పందించి మళ్లీ అంచనాలు రూపొందించగా రూ.2.2 కోట్లకే పనులు చేయవచ్చని తేల్చారు. ఈ పనికి టెండర్లను పిలిచి వేరే వారికి అప్పగించారు.
* తిరుమలలో ఉపయోగించేందుకు 107 అంగుళాల 30 ప్లాస్మా టీవీలను కొనుగోలు చేశారు. ఒక్కో టీవీ ఖరీదు అక్షరాల రూ.33 లక్షలట. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి.
* తిరుపతి పట్టణ శివారులోని తుడా పరిధిలో తుమ్మలగుంట-రాయల్ చెరువు మధ్య ఇటీవలే నాలుగు లైన్ల రహదారిని కొత్తగా నిర్మించారు. దీనికి రూ.14 కోట్ల తితిదే నిధులు వినియోగించారు. తుడా ఛైర్మన్, తితిదే పాలకవర్గం సభ్యుడైన చెవిరెడ్డి భాస్కరెడ్డికి చెందిన గ్రామం తుమ్మలగుంట కావడంతో ఈ రోడ్డును నిర్మించారని చెబుతున్నారు. భక్తులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించినా అసలు ట్రాఫిక్ లేని ఈ సింగిల్ లైను రోడ్డును రెండు లైన్లుగా విస్తరించినా పోనీలే అనుకోవచ్చు. రూ.14 కోట్ల నిధులతో నాలుగు లైన్ల రోడ్డును నిర్మించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి.
* ఒకవైపు తిరుపతిలో గోవిందరాజుల స్వామి పుష్కరణి ఆలనాపాలనా లేక గడ్డిమొలిచి పాడైపోయింది. దీన్ని పట్టించుకునేవారు లేరు. ఇదే సమయంలో చెవిరెడ్డి సొంతూరు తుమ్మలగుంటలో మాత్రం లక్షల రూపాయల తితితే నిధులతో పుష్కరణి నిర్మించారు.
* తిరుమలలో టీటీబీ ఏరియాలో 12వేల మంది భక్తులకు వసతికల్పించేందుకు ఏకంగా రూ.314కోట్లతో ఆరుబాక్లుల అతిథిగృహం నిర్మించాలని తలపెట్టారు. భారమైన ఈ ప్రతిపాదనను పాలకమండలి నిలిపి వేసింది. అతిథిగృహం నిర్మించే ఈస్థలాన్ని ఇప్పుడు కార్లపార్కింగ్గా ఉపయోగించడం విశేషం.
* తిరుపతిలో తూర్పు పోలీసుస్టేషన్‌ని రూ.1.75 కోట్లతో నిర్మించేందుకు గతంలో మంజూరు ఇవ్వగా.. ప్రస్తుతం దాన్ని రూ.85 లక్షలకే చేపట్టేందుకు అంచనాలు రూపొందించారు.
* ఇష్టానుసారం 20 కళ్యాణ మండపాలను కూడా మంజూరు చేశారు.
* ధర్మప్రచార పరిషత్కింద ఏటా రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేస్తుండగా గత పాలకమండలి బడ్జెట్‌ను ఆరేడింతలకు పెంచేసింది.
కొత్త పాలకమండలి వచ్చిన తరువాత ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీయగా మొత్తం రూ.1364.56 కోట్ల విలువైన పనులను ఏడాది కాలంలో మంజూరు చేసిన విషయం బయటపడింది. ఇందులో ఇప్పటి వరకురూ.102.90 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ. 475.96 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రూ.250 కోట్లకు పైగా పనులు చేపట్టబోతున్నారని చెబుతున్నారు. మిగిలిన పనులపై కొత్త పాలకమండలి చర్చించింది. ఈ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమేనని భావించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా భావించినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గత పాలకమండలి మంజూరు చేసిన రూ.500 కోట్లపైగా పనులను నిలిపి వేయాలని నిర్ణయించారు.
చిన్నచిన్న మార్పులతో ఏటా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఆదా

చిన్నచిన్న మార్పులతో ఏటా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఆదా
పాత బల్బులు, రెగ్యులేటర్లు, సాధారణ మోటర్లు మారిస్తే చాలు
పొదుపు నేర్పాల్సిన ప్రభుత్వమే భారీగా దుబారా
ట్రాన్స్‌కో, జెన్కోలదీ అదేదారి
హైదరాబాద్ - న్యూస్‌టుడే

వృథా అవుతున్న విద్యుత్(1200 కోట్ల యూనిట్లు)ను ఉత్పత్తి చేయాలంటే 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏడాదంతా పనిచేయాలి. ఇంత కరెంటు వినియోగదారుడి వరకు చేరడానికయ్యే మొత్తం ఖర్చు రూ.18000 కోట్లు. రెండేళ్ల కరెంటు దుబారా ఖర్చును విద్యుత్ పరికరాల ఆధునికీకరణకు పెట్టుబడిగా ఖర్చు పెడితే ఏటా 2 వేల మెగావాట్లకు సమానమైన విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. కరెంటు కోతలు ఉండవు. ఇది ఎవరిళ్లలో వారు పెట్టుకొనే ఖర్చు కాబట్టి ప్రభుత్వం మీద పెద్ద భారం ఉండదు. కానీ, సర్కారే తన సొంత కార్యాలయాల్లో విద్యుత్ పొదుపును పట్టించుకోవడం లేదు. ఇక ప్రజల్లో ఏం చైతన్యం కలిగించగలదు?

* కరెంటు పొదుపు పాటించాలని 2001 ఇంధన పొదుపు చట్టం చెబుతోంది. అమలు బాధ్యత సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌క్యాప్)ది. కానీ అందుకు తగిన సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం ఇక్కడ లేరు.
* ప్రభుత్వ భవనాల్లో కరెంటు వినియోగ సామర్థ్యం పెంచాలని రాష్ట్ర ఇంధన శాఖ 2006లో ఉత్తర్వు(నెం.256) జారీచేసింది. దుబారా పెరిగిందే తప్ప తగ్గలేదు. కనీస చర్యలు లేవు.
* బహుళ అంతస్తుల భవనాల్లో సూర్యరశ్మితో నీళ్లను వేడెక్కించే యంత్రాలు తప్పనిసరి చేశారు. వాటిని ఏర్పాటు చేస్తేనే నిర్మాణాలను అనుమతించాలని పురపాలక శాఖ 2006లో జీవో ఇచ్చింది. అమలు కాలేదు. పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విధానం పూర్తిగా అమలవుతోంది.
చిన్నమార్పు... భారీపొదుపు
ఒక యూనిట్ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి

* చౌక్ ఉన్న ట్యూబ్లైట్ల(55 వాట్) స్థానంలో చౌక్ లేకుండా పనిచేసే కోటిన్నర సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే ఏటా 500 మెగావాట్లు దుబారాను నివారించవచ్చు.
* కొత్తగా ఎల్ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు.
* సాధారణ జెట్ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. 20 లక్షల పంపుసెట్లు మార్చినా ఏడాదికి 70 కోట్ల యూనిట్లు కరెంటు మిగిలినట్లే.
* చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.
* రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 20 శాతం కరెంటు అనవసరంగా ఖర్చు అవుతోందని 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ' వెల్లడించింది. ఇది 300 కోట్ల యూనిట్లకు సమానం.
వీళ్లే మనకు పొదుపు నేర్పాల్సినవాళ్లు
విద్యుత్ సౌధ... రాష్ట్రానికి కరెంటు వెలుగులు పంచే ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోల ప్రధాన కార్యాలయం ఇది. కరెంటు ఎంత విలువైందో నలుగురికీ చెప్పాల్సిన స్థితిలో ఉన్న ఈ సంస్థలే దుబారాలో ముందున్నాయని తాజాగా నిర్వహించిన కరెంటు తనిఖీ (ఎనర్జీ ఆడిట్) నివేదిక తెలియజేస్తోంది. ఏటా 2.51 లక్షల యూనిట్లను ఈ భవనంలో పొదుపు చేయొచ్చని తనిఖీలో తేలింది. దాంతో విద్యుత్ సౌథ కరెంటు బిల్లు రూ.11.48 లక్షలు తగ్గుతుందని అంచనా వేశారు. విద్యుత్ సౌధ మొత్తం వాడకంలో దుబారా వాటా 16.3 శాతం. ఉన్నతాధికారుల కార్యాలయాలున్న రెండు, ఆరో అంతస్తులో తనిఖీ జరపలేదు. అక్కడ దుబారా మరీ ఎక్కువ. విద్యుత్ సౌధలో పురాతన కాలం దీపాలు, ఫ్యాన్లు, పాత పంపుసెట్లు వాడుతున్నట్లు తనిఖీలో వెల్లడి అయ్యింది. వాటన్నిటినీ మారిస్తే కేవలం రూ.25 లక్షలు ఖర్చవుతాయి. కానీ, ఆ పని చేయరు.
దుబారాకు మార్గదర్శనాలయం
సచివాలయం రాష్ట్ర పాలనకు కేంద్రబిందువు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరేది ఇక్కడే. విధాన నిర్ణయాలు తీసుకొనేది ఇక్కడే. ఇన్ని పెద్ద తలలు పనిచేసేచోట ఏటా రూ.45 లక్షల విలువైన ఆరున్నర లక్షల యూనిట్ల కరెంటు వృధా అవుతోందని కరెంటు తనిఖీ చెబుతోంది. కార్యాలయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, దీపాలు ఆన్‌లో ఉంటాయి. ఇక్కడ సీఎఫ్ఎల్ వాడితే ఏటా 3 లక్షల యూనిట్లు తగ్గించొచ్చు. పాత ఏసీలు తొలగిస్తే మరో మూడు లక్షల యూనిట్లు ఆదా చేయొచ్చు. అలాంటి ప్రయత్నమే జరగదు.

* ఏడు పురపాలక సంఘాల్లో కరెంటు దుబారాను నివారిస్తే ఏటా రూ.5 కోట్లు ఆదాయ చేయొచ్చు.
* ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్, ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయాలున్న బూర్గుల రామకృష్ణారావు భవన్లో కరెంటు దుబారా ఎక్కువగా ఉంది.
* మూడేళ్ల క్రితం నెడ్‌క్యాప్ 4 కోట్ల సీఎఫ్ఎల్ దీపాలు రూ.15కే వినియోగదారులకు పంచుతామని ప్రకటించింది. విశాఖ జిల్లాలో 7 లక్షల దీపాలు పంచింది. కరెంటు సంస్థల సహాయ నిరాకరణతో నిలిచిపోయింది. ఈ విషయంలో హర్యానా, కేరళ, మహారాష్ట్రలు ఎంతో ముందున్నాయి.
* రాష్ట్రంలో రెండుకోట్ల మంది సీఎఫ్ఎల్ దీపాలు వాడితే 800 మెగావాట్ల డిమాండ్ తగ్గించవచ్చు.