Monday, March 29, 2010

డిస్కౌంట్ల జాతర...

వచ్చే నెల నుంచి భారత్ స్టేజ్ ఐగ ప్రమాణాలు అమలులోకి రానున్న నేపథ్యంలో కార్ల డీలర్లు తమ దగ్గర ఉన్న స్టాక్‌ను భారీ డిస్కౌంట్లతో విక్రయించే పనిలోపడ్డారు. గత ఏడాదితో పోల్చితే డిస్కౌంట్లు ఈసారి 10-15 శాతం అధికంగా ఉన్నాయి.

ఏప్రిల్ 1 నుంచి 13 పట్టణాల్లో యూరో ప్రమాణాలు తప్పనిసరిగా మారాయి. మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో సగం ఈ నగరాల్లోనే జరుగుతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రమాణాల అమలుకు పూర్వమే పాత స్టాక్‌ను వదిలించుకోవాలని డీలర్లు చూస్తున్నారు. కార్ల ధరపై గరిష్ఠంగా 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు డిస్కౌంట్లను అందజేస్తున్నారు.

ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలు పెరగడం మూలా న గత రెండు వారాల్లో కొత్త కార్ల బుకింగ్స్ బాగా తగ్గాయని, తాజాగా భారత్ స్టేజ్ ఐగ నిబంధనల కారణంగా కార్ల ధరలు మరింత పెంచితే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని డీలర్ వర్గాలు అంటున్నాయి.