Friday, March 26, 2010

జీతాలు 12 శాతం పెరుగుతాయ్‌: ఈ అండ్‌ వై

న్యూఢిల్లీ: భారత్‌లో పరిస్థితులు కుదుటపడుతుండటంతో కంపెనీలువచ్చే ఆర్థిక సంవత్సరంలో సగటున 9-12 శాతం మేర జీతాల పెంపులు ఇచ్చేఅవకాశం ఉన్నట్లు కన్సెల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈ&వై) తెలిపింది. పరిస్థితులు మెరుగై ఉద్యోగ అవకాశాలుపెరగడంతో రానున్న కొన్ని నెలల్లో ఉద్యోగ వలసలు పెరగవచ్చని భారతీయ కంపెనీలు భావిస్తున్నట్లుగా ఈ&వై సంస్థవెల్లడించింది. ప్రతిభావంతులు సంస్థలను వదిలి ఇతర కంపెనీలకు వలస పోకుండా ఉండేందుకు వారు వేతన పెంపులను ఒక మార్గంగాఎంచుకోనున్నట్లు ఈ&వై వెల్లడించింది. అయితే ఈపెంపులు భారీస్థాయిలో ఉండేట్లు కనిపించడం లేదని ఈ&వై పీపుల్స్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ విభాగం భారత అధిపతి రాజన్‌ అన్నారు.వేతన పెంపుల గురించి ఆయన ఇంకా ఏమన్నారంటే..
* వేతన పెంపులతో పాటుగా సంస్థలు ద్రవ్య నియంత్రణ,అదనపు జీతాల చెల్లింపు విషయంలో ఇంకా కూడా అప్రమత్తతతోనే వ్యవహరించే అవకాశం ఉంది.
* టెలికాంలో సగటు వేతన పెంపు 12-16 శాతానికిపైగా ఉండే అవకాశం ఉంది.
* ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలలో ఈ పెంపు గరిష్ఠంగా 10-13% మేర ఉండే అవకాశం ఉండగా..ఐటీ, టెక్నాలజీ రంగాల్లో వేతన వృద్ధి 8% నమోదవ్వొచ్చు.
* మాంద్యం సమయంలో ఎలాంటి పెంపుకు నోచుకోని బ్యాంకింగ్‌, బీమా రంగంలో వచ్చే ఏడాది వేతన పెంపులు గరిష్ఠంగా 10-12 శాతం ఉండవచ్చు.
* బోనస్‌ను నిర్ణయించడంలో సాధారణంగా వ్యక్తిగత పనితీరుతో కూడిన కంపెనీ పనితీరులు ప్రధాన భూమిక పోషిస్తుంది.
* ఇంకా ఆర్థిక వ్యవస్థ 2007నాటి స్థాయిని చేరనప్పటికీ అన్ని రంగాల్లోనూ మెరుగైన వాతావరణం కనిపిస్తోంది.