Monday, March 29, 2010

బిజినెస్‌ గారడీలు

* రెక్కాడితే గానీ డొక్కాడదు
డీమ్యాట్‌ ఉంటేనే గాని షేరు కొనడం సాధ్యం కాదు

* గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు..
పాతిక రూపాయల బాకీ తీరిస్తే పోయేదానికి మొత్తం కంపెనీనే అమ్ముకోవాల్సి వచ్చినట్లు.

* పోయిన చోటే వెతుక్కోవాలి
నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లోనే మళ్లీ నోట్ల కట్టలు కుమ్మరించడమన్న మాట.

* తానొకటి తలస్తే దైవమొకటి తల్చిందట.
లాభం వస్తుంది అనుకుంటే నష్టాలు ముంచేశాయని.

* కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక వూడిందని..
ఎక్కువ వడ్డీ వస్తుందని అప్పు ఇస్తే.. చివరకు టీ తాగడానికి చిల్లర కూడా మిగల్లేదు.

* అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదు
ఆర్థిక మంత్రి ఏదో చేస్తారని అనుకుంటూ కూర్చుంటే.. పెరిగే ధరలు పెరక్క మానవు.

* రాజుగారు తలుచుకొంటే దెబ్బలకు కొదువా!
(కంపెనీ డైరెక్టర్ల) బోర్డు తలుచుకొంటే బోనస్‌ ఇష్యూలకేం తక్కువ.