Saturday, March 27, 2010

పేపర్‌ పరిశ్రమకు మంచి రోజులు

దేశీయ పేపర్‌ పరిశ్రమకు మంచి రోజులు రాను న్నాయి. రానున్న మాసాల్లో ఊహించని విధంగా ఈ పరి శ్రమ వృద్ధి బాటలో నడవనుంది. తాజాగా చిలీ దేశంలో జరిగిన భూకంపం కారణంగా ముడి పదార్థాలు, టిష్యూ పేపర్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మన దేశీయ పేపర్‌ పరిశ్రమ డిమాండ్‌ పుంజుకోనుంది. అంతర్జాతీయ టిష్యూ పేపర్‌ సరఫరాదారుల రిపోర్టు ప్రకా రం, సుమారు 4మిలియన్‌ టన్నుల టిష్యూ పేపర్‌ ఉత్పత్తి సామర్థ్యం ఈ భూకంపం కారణంగా తగ్గిపోయిందని తెలి పింది. అసియా దేశాలకు పేపర్‌, టిష్యూ పేపర్‌ సరఫరాలో అంతర్జాతీయంగా అతిపెద్ద దేశమైన చిలీ భూకంపం ఇప్పు డు ఈ రంగ పరిస్థితులను మార్చివేసింది. ఇప్పుడు ఆసి యా ప్రాంత దేశాలతో పాటు చైనా కూడా ఇతర ఉత్పత్తి దారులైన ఇండోనేషియా, బ్రెజిల్‌, కెనడా దేశాలకై చూస్తు న్నాయి. దీంతో టిష్యూ పేపర్‌ సరఫరాపై ఒత్తిడి పెరిగి ఒక్క సారిగా ధరలు పెరిగాయి.

పెరగనున్న ధరలు..
దేశీయ పేపర్‌ పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం మాత్రం మార్చి మొదటి మాసం నుండి టిష్యూ పేపర్‌ (హార్డ్‌వుడ్‌) ధరలు సుమారు 100-150 డాలర్ల మేరకు ప్రతి టన్నుకు పెరిగి 850డాలర్లకు చేరవచ్చనీ, సాఫ్ట్‌వుడ్‌ టిష్యూ ధరలు 200 డాలర్లు పెరిగి 1000 డాలర్లకు చేర వచ్చనీ తెలిపాయి. దీంతో అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగాను పేపర్‌ ధరలకు రెక్కలు రానున్నాయి. గత జనవరి మాసంలో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రింటింగ్‌, రైటింగ్‌ పేపర్‌ ధరలు 180 డాలర్లు పలుకగా, ప్రస్తుతం 330 డాలర్లుగా ధరలు ఉన్నాయి. దేశీయ ఉత్పత్తి దారులు కూడా ఈ కోవలోనే ప్రైంటింగ్‌, రైటింగ్‌ పేపర్ల ధరలను టన్నుకు 1000-1500 రూపాయలకు పెంచారు.

వచ్చే ఏప్రిల్‌ మాసంలో ఇవి మరింత పెరిగి 1200 - 1500 రూపాయలుగా పెరగవచ్చనీ పరిశ్రమ వర్గాలంటు న్నాయి. అంతర్జాతీయంగా కూడా డిమాండ్‌ పెరగడంతో ఎగుమతి అవకాశాలు కూడా ఊపందుకున్నాయని ఉత్పత్తి దారులు అంటున్నారు. వార్షిక విభాగంలో కొత్త ఆర్డర్లు స్కూల్‌ సీజన్‌లో ప్రారంభమౌతాయి కాబట్టి దేశీయంగా కూడా డిమాండ్‌ పేపర్‌కు పుంజుకుంది. అతి పెద్ద ఉత్పత్తి సామర్థ్యం గల దేశ పేపర్‌ మిల్‌ సంస్థలు గత నవంబర్‌ - డిసెంబర్‌ కాలాల్లో పెద్ద ఎత్తున రికార్డుల ఉత్పత్తిని నమోదు చేశాయి. దాదాపు 1.25లక్షల టన్నుల పేపర్‌ స్టాక్‌లు నమోదయ్యాయని పరిశ్రమ వర్గాలు అంచనా. ప్రస్తుత పరిస్థితుల కారణంగా స్టాక్‌లు త్వరగా విక్రయమయ్యా యనీ, ’జీరో స్టాక్‌ ’ ఉత్పత్తి మార్చి పూర్తయ్యేనాటికి నమో దౌతుందనీ ఆశాభావం వ్యాక్తం చేస్తున్నారు. దేశీయ పేపర్‌ ఉత్పత్తి ఏటా 4లక్షల టన్నులుగా నమోదవుతోంది.

భారత్‌ పై ప్రభావం..
సుమారు 5000 టన్నుల టిష్యూ పేపర్‌ను ప్రతి నెలా సరఫరా చేసే చిలీ దేశంపై భారత్‌ ఆధారపడనం దున ఈ ప్రభావం కొంత వరకు తక్కువగానే ఉండ వచ్చు. ముడిపదార్థాల విషయంలో మాత్రం భారత్‌ తీవ్ర పోటీని ఎదుర్కోనుంది. దేశ పరిశ్రమ వర్గాల అనుసారంగా టిష్యూ పేపర్‌ ఉత్పత్తి సౌకర్యాలు కలి గిన దేశీయ పేపర్‌ మిల్లులుపై అంతర్జాతయంగా పెరిగి ధరల ప్రభావం ఉండనుందనీ, తద్వారా వీటి మార్జిన్లు వృద్ధి చెందే అవకాశాలున్నాయని పేర్కన్నాయి.దేశీయ టిష్యూ పేపర్‌ల ధరలు సుమారు 450 డాలర్లుగా ఉండవచ్చని, ఇది అంతర్జాతీయ ధరల కన్నా అరశాతం మాత్రమే అధికమని తెలిపాయి. దేశీ యంగా ’ఎ’ గ్రేడ్‌ పేపర్‌ మిల్లుల విభాగంలో ఉన్న తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్స్‌ లిమిటెడ్‌, శేషసాయి పేపర్‌ అండ్‌ బోర్డ్స్‌, జెకె పేపర్‌ సంస్థలు ఈ పరిణామంతో లాభపడనుండగా, అతిపెద్ద దిగు మతిదారు అయిన బిల్ట్‌ సంస్థపై ప్రతికూల ప్రభావం ఏర్పడనుంది. రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.