Saturday, March 27, 2010

కరెంట్‌ లేకున్నా సెల్‌ఛార్జింగ్‌!

10 నిమిషాల్లో ఒకేసారి ఐదు ఫోన్లకు
గ్వాలియర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల వినూత్న సృష్టి
గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌): అతి ముఖ్యమైన వ్యక్తితో మీరు సెల్‌ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంతలోనే బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయింది. మీ మొబైల్‌ మూగపోయింది. తిరిగి ఛార్జింగ్‌ చేద్దామంటే అదే సమయానికి కరెంట్‌ కోత. మళ్లీ విద్యుత్‌ సరఫరా అయ్యేవరకూ మీరు వేచి ఉండాల్సిందే. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కోసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే.ఇలాంటి సమస్యకు పరిష్కారంగా గ్వాలియర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు సంజయ్‌ గుర్జార్‌, జయేంద్ర గుర్జార్‌ (స్వయానా సోదరులు) కొత్తరకం ఛార్జర్‌ యంత్రాన్ని రూపొందించారు.

యంత్రానికుండే హ్యాండిల్‌ను వ్యతిరేక దిశలో తిప్పినప్పుడు జనించే యాంత్రిక శక్తి.. విద్యుత్‌శక్తిగా మారుతుంది. ఈ యంత్రం హ్యాండిల్‌ను 10 నిమిషాలు తిప్పితే చాలు.. ఒకేసారి ఐదు మొబైల్స్‌ ఛార్జింగ్‌ చేయొచ్చు. దీనికి విద్యుత్‌ కానీ, సౌరశక్తికానీ అవసరం లేదు.