Thursday, March 25, 2010

ఇక ఊపందుకోనున్న అవుట్‌సోర్సింగ్‌

ముంబాయి : చారిత్మాకమైన ఆరోగ్యరక్షణ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా అత్యంత లాభపడేది మన దేశ బ్యాక్‌-ఆఫీస్‌ సంస్థలే. దీర్ఘకాలంలో ఈ బిల్లుకు సంబంధించిన ట్రాన్సాన్‌ అవుట్‌సోర్సింగ్‌ అవకాశాలను మన దేశ సంస్థలకు అందజే యనున్నారు. తద్వారా అమెరికా ప్ర భుత్వం కాస్ట్‌ కటింగ్‌ పనులకు నడుం బిగించినట్టౌతుంది. ఈ బిల్లుపైనే ప్రత్యేక దృష్టి సారిస్తే, పరిపా లనా విభాగంలోని ఖర్చులను ప్రస్తుతానికి కన్నా తగ్గించు కోవచ్చని, ఇం దుకు ఆరోగ్యసంస్థలన్నీ (అవుట్‌సోర్సింగ్‌, ఆఫ్‌షోరింగ్‌ సంస్థలతో పా టు) ముందుకు రావాలనీ డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సేవల సంస్థ సీఈఓ కేశవ్‌ మురుగేశ్‌ అన్నారు. ఈ రంగానికి చెందిన వ్యక్తులకు ఇది దీర్ఘకా లిక సానుకూల పరిణామమనీ అన్నారు.

దేశీయంగా పెరగనున్న వివిధ శాఖల పనులు..
అమెరికా ఆమోదించిన ఈ కొత్త చట్టం ద్వారా సుమారు 32మిలియన్‌ మం ది ఇన్సురెన్సేతరులు, అసలు ప్రీమియంలు చెల్లించలేని వారికి కూడా ఇది వ ర్తించనుంది. హెల్త్‌కేర్‌ ఇన్సురెన్స్‌ రంగ వ్యవస్థలో కొత్త దేశీయ పద్ధతులు అమలౌతున్న కొద్దీ అదనపు పరిపాలనా నియామకాలు పెరుగుతాయనీ, ముఖ్యంగా పరిపాలన ఖర్చులకు స్వల్పకాలిక బడ్జెట్‌ల కేటాయింపుల ద్వారా వివిధ విభాగాలైన క్లెయిమ్‌ ప్రాసెసింగ్‌, రిజిస్ట్రేషన్లు, అండర్‌ రైటింగ్‌ సపోర్ట్‌ వంటి పనులకు అవుట్‌సోర్సింగ్‌ పెరుగుతుందనీ ఎస్సార్‌ గ్రూపుకు చెందిన ఎజిస్‌ బీపీఓ సంస్థ ఎండీ, సీఈఓ అపరూప్‌ సేన్‌గుప్తా అన్నారు.

ఈ పునరుద్ధరణా కార్యక్రమాల్లో భాగంగా పేదవర్గాలకు చెందిన ’మెడికెయిడ్‌’ పథకాన్ని మరింత మంది అమెరికన్లకు చేరువ చేసేందుకు విస్తరింప చేయాలని ఫస్ట్‌ ఛాయిస్‌ సొల్యూషన్స్‌ సంస్థ సీఈఓ ఆనంద్‌ ముఖర్జీ కోరారు. ఫెడరల్‌ పవ ర్టీ స్థాయికి 133 శాతం ఆదాయం కలిగిన అమెరికన్లకూ ఈ పథకం అమలవ్వాలి, అయితే ప్రస్తుతం ఈ పథకం పూర్తి స్థాయిలో అమలులో లేదు. ప్రస్తుతం పరీక్షిస్తున్నందున అన్ని వ్యాపార వర్గాల అర్హులకు మెడికెయిడ్‌ పథకం సానుకూలంగా ఉంటుందని ముఖర్జీ అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వానికి కూడా అర్హతగల సేవలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందనీ తెలిపారు. పేద వర్గాల ప్రజలకు ఇన్సురెన్స్‌ ఫండ్‌ పథకాలను లేదా అర్హులైన వారిని గుర్తించి ఆసుపత్రులకు అందించడమే ఫస్ట్‌ ఛాయిస్‌ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ రకమైన సేవల కొరకై ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుం టుంది. ఆరోగ్యరంగ కలెక్షన్లతో పాటు రెవెన్యూ ఆధారిత రీ-సైకిల్‌ మేనేజ్‌మెం ట్‌ సేవల ద్వారా మరింత వృద్ధిని ఫస్ట్‌ ఛాయిస్‌ సంస్థ ఆశిస్తోంది. భవిష్యత్‌లో హెల్త్‌కేర్‌ బిల్లు చట్టం ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డులను (ఈహెచ్‌ఆర్‌) సమానంగా వృద్ధి చేయించడం వంటి ప్రచారకార్యక్రమాలను చేపడుతుంది.

మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ సేవలు..
ఈ బిల్లు మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ రంగానికి పెద్ద అవకాశాలనే తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఈహెచ్‌ఆర్‌ ను పెంపొం దించడంలో గల పేపర్‌ రికార్డు పనులను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోకి మార్చడం వంటి ప్రక్రియను అన్ని ఆరోగ్యరంగ సంస్థల్లో తప్పనిసరి చేయనున్నారని సీ-బే సిస్టమ్స్‌ సంస్థ సీఈఓ, రమన్‌ కుమార్‌ తెలిపారు. భారత దేశానికి చెందిన సంస్థలకు ముఖ్యంగా అమెరికాలో గల కెనడా, మెక్సికో దేశాలలో ఉన్న డెలివరీ సెంటర్‌లకు ఈ బిల్లు చట్టం పెద్ద లాభదాయకంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. సంప్రదాయంగా ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఆఫ్‌షోరింగ్‌ పనులను భారత్‌ వంటి దేశాలకు ఇవ్వడంలో జాగ్రత్తపడటమే ఇందుకు గల కారణమనీ పేర్కొన్నారు.

రానున్న ఎన్నెన్నో అవకాశాలు
ఈ చట్టం మరో 35 మిలియన్ల అమెరికన్లను బీమా రక్షణ పరిధిలోకి తీసుకువస్తుంది. ఫలితం గా ఈ రంగంలో లావాదేవీలు, వ్యవహార కార్య కలాపాలు అధికమవుతాయి. కస్టమర్‌ సపోర్ట్‌కు కూడా అవకాశం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా కస్టమర్లు స్పష్టత కోరుకునే మొదటి రెండేళ్ళలో. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకూ కాగితాలపై జరిగే వ్యవహారాలన్నీ ఇకపై డిజిటల్‌ రూపంలో జరగాల్సిందే. ఆరె్కైవల్‌ డేటాను కంపాటబుల్‌ ఫార్మాట్‌ లలోకి మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలోని వైద్యుల్లో 30 శాతం మంది మాత్రమే ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను కలిగి ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ రంగంలో అవకాశాలు అపారంగా పెరిగిపో యాయి. భారత్‌, ఆమెరికాల మధ్య కార్మిక సంబంధాలను ఈ చట్టం మరింతగా పెంచుతుంది. అంత ర్జాతీయంగా పెరిగిన పోటీ వల్ల బీమా సంస్థలు తక్కువ రేటుకే తమ సేవలను అందించాల్సి వస్తుంది. దీనివల్ల మనకు మరిన్ని అవకాశాలు లభించే అవకా శం ఉంది. మనదేశానికి మరింత వాణిజ్యం వచ్చే అవకాశం ఉంది.

- పార్థ సర్కార్‌, సీఈఓ, హిందూజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌