Thursday, March 25, 2010

హైదరాబాద్‌ విమానాశ్రయం భేష్‌

బ్రిటిష్‌ సంస్థ స్కైట్రాక్స్‌ నుంచి అవార్డు
హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్‌లోనే అత్యుత్తమైందిగా గుర్తిస్తూ బ్రిటిష్‌ కన్సల్టెన్సీ సంస్థ స్కైట్రాక్స్‌ అవార్డు అందచేసింది. బ్రస్సెల్స్‌లో మంగళవారం జరిగిన సంస్థ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించింది. విమానరంగంలో నాణ్యతకు ప్రాధాన్యం కల్పించేందుకు సంస్థ ఈ అవార్డులు అందచేస్తోంది. 10 నెలల పాటు 95 దేశాల్లోని 196 విమానాశ్రయాల్లో 86 లక్షల మంది ప్రయాణికుల అభిప్రాయాలు సేకరించి, అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయంలో 35 అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలిపింది. సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయం ప్రపంచంలోనే ఉత్తమమని పేర్కొంటూ అవార్డు అందచేశారు. 'ఎయిర్‌పోర్ట్‌ ఆఫ్‌ 2010'గా, ఆసియాలోనే ఉత్తమమైందిగా గుర్తించిన ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల విశ్రాంతి సదుపాయాలు బాగున్నాయని పేర్కొన్నారు.