Monday, March 29, 2010

అదృశ్యమవుతున్న ఎక్స్‌పోర్లర్‌

ఒకప్పుడు ఇంటర్నెట్‌కు మారుపేరుగా నిల్చిన మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ ఇప్పుడు మార్కెట్‌లో గడ్డు రోజులను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా, భారతదేశంలో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఐరిక్‌ మెట్రిక్స్‌ సంస్థ స్టాట్‌ కౌంటర్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్‌ బ్రౌజర్ల రంగంలో గుత్తాధిపత్యం చలాయించింది. ఇప్పుడు ఆ ఆధిపత్యానికి గండి పడింది. ఎన్నో నూతన బ్రౌజర్లు మార్కెట్లోకి వచ్చాయి. గతంలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటుగా బండిల్డ్‌ ప్యాకేజీగా మైక్రోసాఫ్ట్‌ తన బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను కూడా అందించింది. దాంతో యూజర్లకు వేరే బ్రౌజర్‌ గురించి అంతగా తెలుసుకునే అవసరం కూడా లేకపోయింది. ఇప్పుడలా కాదు. ఎక్స్‌ప్లోరర్‌లో లేని సౌలభ్యాలను అనేక బ్రౌజర్లు అందిస్తున్నాయి.

దీంతో పలువురు యూజర్లు ఆయా బ్రౌజర్లను డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఎక్స్‌ప్లోరర్‌ గత రెండేళ్ళలో దాదాపుగా 20 శాతం మార్కెట్‌ షేర్‌ను కోల్పోయింది. గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు దేశంలో పీసీల్లో నూటికి 99 శాతం వాటిల్లో ఇంటర్నెట్‌ బ్రౌజర్‌గా మైక్రోసాఫ్ట్‌ ఉత్పాదన ఎక్స్‌ప్లోరర్‌ ఉండేది. 2008 నాటికి అది 70 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం 51 శాతానికి దిగజారిపోయింది. యురోపియన్‌ యూనియన్‌లో, ఇతర పలు దేశాల్లో ట్రేడ్‌ కమిషన్‌ నియమ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆయా దేశాల్లో వాటి ఆదేశాల ప్రభావం ఎక్స్‌ప్లోరర్‌పై పడింది. మనదేశంలో అలాంటి ట్రేడ్‌ కమిషన్‌ లాంటివి ఏమీ లేకున్నా కూడా ఎక్స్‌ప్లోరర్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.

యూరప్‌లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ గతంలో కంటే కూడా మూడింతల మార్కెట్‌ షేర్‌ను కోల్పోయింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌7 ద్వారా ఎక్స్‌ ప్లోరర్‌ను వాడేటప్పుడు ఒక బ్యాలెట్‌ నిర్వహించాల్సిందిగా యురోపియన్‌ యూనియన్‌ ఆదేశించింది. ఈ బ్యాలెట్‌ స్క్రీన్‌ యూజర్లకు మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌, ఆపిల్‌ సఫారి, ఒపెరా లాంటి బ్రౌజర్లను కూడా ప్రద ర్శిస్తుంది. వీటిలో యూజర్లు తమకు నచ్చిన బ్రౌజర్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల కూడా ఆయా దేశాల్లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వినియోగం పడిపో యింది. ప్రపంచ వ్యా ప్తంగా బ్రౌజర్‌ మార్కెట్‌లో ఎక్స్‌ప్లోరర్‌ వాటా 55 శాతం. ఫైర్‌ఫాక్స్‌ 31 శాతం వాటాను, క్రోమ్‌ 7 శాతం వాటాను, సఫారీ 4 శాతం వాటాను కలిగి ఉన్నా యి. స్టాట్‌ కౌంటర్‌ కథనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్‌ ఎక్స్‌ ప్లోరర్‌ వినియోగం ఒక్కసారిగా పడిపోవడం ఆరంభమైంది. క్రోమ్‌, ఫైర్‌ ఫాక్స్‌ల వంటి బ్రౌజర్ల వినియోగం పెరిగిపోయింది.

భద్రత పరమైన కారణా ల వల్లే గా కుండా స్లో కనెక్టివిటీ వంటి కారణాలతో కూడా యూజర్లు ఇతర బ్రౌజర్ల వాడ కంపై మొగ్గు చూపుతున్నారు. దేశంలో 71 మిలియన్ల ఇంటర్నె ట్‌ యూజర్లు ఉండగా కేవలం 8 మిలియన్ల మంది మాత్రమే బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌ను కలిగి ఉన్నారు. పీసీ తయారీదారులు, యూజర్లు పీసీలపై దేన్ని కావాలంటే దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశాన్ని కలిగిఉన్నా రంటూ మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఫైర్‌ఫాక్స్‌ ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లో రర్‌ను అధిగమించింది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వినియోగం తగ్గి తమ బ్రౌజర్ల వినియోగం పెరగడంతో క్రోమ్‌, ఒపెరా లాంటి వాటికి ఎంతో ఆనందం కలిగి స్తోంది. యురోపియన్‌ మార్కెట్‌లో బ్రౌజర్‌ బ్యాలెట్‌ నిర్వహించడంపై గూగుల్‌ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానిస్తూ యూజర్ల ఎంపిక అవకాశం ఎంతో ముఖ్యమని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్నెట్‌ కంపెనీలకు బ్రౌజర్లు ఎంతో ముఖ్యం. వాటి ద్వారా కూడా ఎంతో ఆదాయం పొందే అవకాశం ఉండ డమే దీనికి కారణం. బ్రౌ జర్‌ అనేది ఇంటర్నెట్‌కు గేట్‌వేగా తోడ్పడుతుంది. ఈ గేట్‌వే కు జోడించే ఏ అప్లికేషన్‌ అయినా ఆ బ్రౌజర్‌ కంపెనీకి ఎంతో ఆదాయం అందించగలుగుతుంది. వినియోగదారులకు ఎంపిక అవకాశం పెరగడం వల్లే తమకు మార్కెట్‌ బాగా పెరిగిందని ఒపెరా సంస్థ విశ్వసిస్తోంది. మిలియన్ల కొద్దీ ఇం టర్నెట్‌ యూజర్లు నూతన బ్రౌజర్లను వినియోగించి వాటి పనితీరుకు ఆక ర్షితులై వాటిని తమ డిఫాల్ట్‌ బ్రౌజర్లుగా ఉపయోగి స్తున్నారు. ఫలి తంగా ఎక్స్‌ప్లోరర్‌కు మేలైన, దీటైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సంగతిని తెలుసుకోగలుగుతున్నారని ఒపెరా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.