Wednesday, March 24, 2010

నిధుల వేటలో ఏవియేషన్‌ పరిశ్రమ

ముంబాయి : దేశీయ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఏవియేషన్‌ రంగాల మౌలికసదుపాయాలకై 120 బిలియన్‌ డాలర్ల నిధులు మరో పదేళ్ళలో అవసరమౌతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. దేశీయ విమానరంగ మౌలికసదుపాయాలు మెరుగుపడాలని, విమాన ప్రయాణికుల సం ఖ్య 2020నాటికి వార్షికంగా 240-260మిలియన్లకు చేరనుందని తెలిపారు. ఈ పరిశ్ర మలోని ఒక్క ఎయిర్‌పోర్ట్‌ విభాగానికే 20బిలియన్ల పెట్టుబడులు మరో పదేళ్ళలో అవసర మౌతాయని తెలిపింది. 2020 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 160- 180 మిలియన్లకు చేరవచ్చని, ఇది అంతర్జాతీయంగా 80మిలియన్‌లు దాటవచ్చని ఇందు కోసం 120బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఏవియేషన్‌ పరిశ్రమ వర్గాలు ఇక్క డ జరిగిన సిటా సమావేశంలో పేర్కొన్నాయి.

దీని అనుసారంగా ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌ పోర్ట్‌ల వృద్ది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలతో పాటు ఇతర ఏటీసీ, ఎంఆర్‌ఓ, క్యాటరింగ్‌, శిక్షణ వంటి వాటికి పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉత్పత్తి దారు లైన బోయింగ్‌,ఎయిర్‌బస్‌ సంస్థలు ప్రస్తుతం ఉన్న 380 ప్లేన్‌ల దేశీయ విమాన ఫ్లీట్‌ సైజ్‌ ను 2028నాటికి 1000గా ఉండవచ్చని ఆశిస్తున్నాయి. ఈ నివేదికలో పరిశ్రమకు సంబం దించిన అదనపు మెరుగుదలను, హరితవానలతో కూడిన ఎయిర్‌పోర్ట్‌లను మెట్రో, నాన్‌- మెట్రో ప్రాంతాల వృద్ధి చేయాలని కోరారు. 2020నాటకి ఎయిర్‌పోర్ట్‌ వ్యవస్థ 400మిలి యన్‌ ప్యాసింజర్లను వార్షికంగా నిర్వహించగలదని పేర్కొంది.