Monday, March 29, 2010

సామ్‌సంగ్‌ సంచలనం త్రీడీ టీవీ

హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్‌ రంగ అగ్రగామి హోమ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో మరో సంచలనానికి నాంది పలికింది. ఈ సంస్థ ఇటీవలే దేశంలో త్రీడీ టీవీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. లెడ్‌, ఎల్‌సీడీ, ప్లాస్మా రకాల్లో ఇవి లభ్యం కానున్నాయి. నోయిడా కేంద్రంలో ఉత్పాదనల తయారీ ద్వారా సంస్థ దేశీయంగానే వీటి తయారీకి శ్రీకారం చుట్టినట్లయింది. ఈ ఫుల్‌ హెచ్‌డీ త్రీడీ టీవీలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నట్లు సంస్థ పేర్కొంది. సంస్థ సౌత్‌వెస్ట్‌ ఏషియా ప్రెసిడెంట్‌, సీఈఓ జంగ్‌ సూ ఈ సందర్భంగా మాట్లాడుతూ, హోమ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రంగంలో అగ్రగామిగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2డీ కంటెంట్‌ను 3డీ లోకి మార్చుకునే సదుపాయం ఈ టీవీల్లో ఉంది. కేవలం ఒక బటన్‌ ప్రెస్‌ చేయడం ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

40 నుంచి 65 అంగుళాల వరకు 3డీ లెడ్‌ టీవీలు, ప్లాస్మా టీవీలను సామ్‌సంగ్‌ రూపొందించింది. త్రీడీ ప్రాసెసర్‌తో కూడిన బిల్ట్‌ ఇన్‌ వీడియో ప్రాసెసర్‌, 3డి ఆప్టిమైజ్డ్‌ ప్యానెల్‌, ఫ్రేమ్‌ రేట్‌ కన్వర్షన్‌ టెక్నాలజీ లాంటివి త్రీడీలో అత్యుత్తమ పిక్చర్‌ క్వాలిటీని అందిస్తాయి. హైపర్‌ రియల్‌ ఇంజన్‌ సాయంతో, ఫ్లూయిడ్‌ మోషన్‌, ఎక్స్‌పాండెడ్‌ నేచురల్‌ కలర్‌ చక్కగా కన్పిస్తాయి. పరిశ్రమలోనే తొలిసారిగా 2డీ కంటెంట్‌ను రియల్‌ టైమ్‌లో త్రీడీ కంటెంట్‌గా మార్చే సదుపాయాన్ని, టెక్నాలజీని ఈ టీవీలు కలిగిఉన్నాయి. లైవ్‌ మ్యాచ్‌లకు మరింత డెప్త్‌, క్లారిటీని ఈ టెక్నాలజీ అందిస్తుంది. బిల్ట్‌ ఇన్‌ ఇథర్‌నెట్‌ కనెక్షన్‌, వైర్లెస్‌ రెడీ సామర్థ్యాలతో కంటెంట్‌ వితౌట్‌ బార్డర్స్‌ అనే వీక్షకుల డిమాండ్‌ను ఇది తీర్చగలుగుతుంది. అప్‌గ్రేడెడ్‌ ఇంటర్నెట్‌ ఎట్‌ టీవీ ఫీచర్‌ కూడా దీనిలో ఉంది. దీని ద్వారా ది అసోసియేటెడ్‌ ప్రెస్‌, బ్లాక్‌ బస్టర్‌, ఫ్యాషన్‌ టీవీ, యూ ట్యూబ్‌ లాంటి వాటి కంటెంట్‌ను కూడా వీక్షించవచ్చు. ఆల్‌షేర్‌ ఫీచ ర్‌ ద్వారా యూజర్లు తమ టీవీని కంపాటబుల్‌ మొబైల్‌ ఉప కరణాలతో కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. మూవీలు, ఫోటోలు, మ్యూజిక్‌ ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు.

పర్యావరణ స్నేహపూర్వక టెక్నాలజీలను ఈ టీవీల రూప కల్పనలో వినియోగించారు. త్రీడీ టీవీలపై కొనుగో లుదారులకు ఆసక్తి కల్పించేందుకు సామ్‌సంగ్‌ వినూత్న మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌కు కూడా శ్రీకారం చుట్టింది. సామ్‌సంగ్‌ ప్లాజాలతో పాటు ముఖ్యమైన మల్టీబ్రాండెడ్‌ కౌంటర్లలో ఇన్‌స్టోర్‌ డిస్‌ప్లే చేయాలని కూడా యోచిస్తోంది. ఈ ఏడాది మొత్తం లెడ్‌ టీవీ వి క్రయాల్లో త్రీడీ టీవీల వాటా 10 శాతం దాకా ఉండ గలదని భావిస్తున్నట్లు సంస్థ డిప్యూటీ ఎండీ రవీందర్‌ జుత్షి అన్నారు. సామ్‌సంగ్‌ త్రీడీ లెడ్‌ టీవీలు 40-65 అంగుళాల స్క్రీన్‌సైజుల్లో రూ. 1,30,000 నుంచి రూ. 4.35 లక్షల వరకూ లభ్యమవుతాయి. 3డీ ఎల్‌సీడీ సిరీస్‌ 46-55 అంగుళాల స్క్రీన్‌సైజుల్లో రూ. 1,29,000 నుంచి రూ. 1.87 లక్షల వరకూ లభ్యమవుతాయి. 63 అంగుళాల త్రీడీ ప్లాస్మా టీవీ ధర రూ. 3 లక్షలు.