Saturday, March 27, 2010

అంతు పట్టని జీఎస్‌టీ..

మొదట్లో అంతా జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) పన్ను శాతం అన్ని వస్తువులు, సేవలపై ఒకే విధమైన రేటుగా ఉంటుందని ఊహించారు. ఆ తరువాత కొంత కాలానికి జీఎస్‌టీ విశ్లేషణ మారిపోయినట్టు కనిపించింది. కేంద్రంలో జీఎస్‌టీ రేటు ఒక విధంగా ఉంటే, ప్రతి రాష్ట్రానికి జీఎస్‌టీ రేటులు వేరు వేరుగా ఉంటాయని తేల్చారు. ఈ విధమైన ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల జీఎస్‌టీ రేటు కోసం పోటీ పడుతున్నాయి. ఈ పద్ధతితో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించట్లేదనేది సంబంధిత విభాగ అధికారులు చెబుతున్నారు. కేంద్ర జీఎస్‌టీ, రాష్ట్ర జీఎస్‌టీ రేట్లు వేరుగా ఉంటాయనేది ఇప్పుడు సుస్పష్టం.