Thursday, March 25, 2010

భాగస్వామికై జీఎంఆర్‌ ఎదురుచూపులు

హైదరాబాద్‌ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న జీఎమ్‌ఆర్‌ రిఫైనరీ కొసం సదరు సంస్థ వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య కోసం ఎదురుచూపులు చూస్తున్నది. దీనిలో భా గంగా అమెరికాలో జరుగుతున్న వార్షిక కెమికల్‌ సదస్సుకు హాజర వుతున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.

కాకినాడ సెజ్‌ పరిధిలో జీఎమ్‌ఆర్‌కు రిఫైనరీ భాగస్వామ్యం ఉండడంతో ఈ రంగం లో విసృ్తత పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా జిఎమ్‌ఆర్‌ ప్రతి నిధులు అమెరికాలో జరగుతున్న బిజినెస్‌ సదస్సుకు బయలు దేరు తున్నట్లు తెలిసింది..2008లోనే రిఫైనరీ పనులు ఓఎన్‌జిసి ఆధ్వ ర్యంలో ఊపందుకోవాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సదరు సంస్థకు మౌలిక, ఇతర సదుపాయాలు కల్పించడంలో తాత్సారం చేయడంతో సదరు సంస్థ జిఎమ్‌ఆర్‌కు తన వాటాను విక్రయించి... ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగింది. అప్పట్లో ఈ అంశంపై ప్రతిపక్షాలు కూడా సర్కార్‌ తీరును ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.

చమురు మార్కెట్‌ కుదేలవడంతో...
గతంలో ఓఎన్‌జిసి కాకినాడలో ప్రతిపాధించిన రిఫైనరీ ప్రాజెక్ట్‌ను మంగుళూరుకు తరలించడం గమనార్హం. నాటకీయ పరిణామాల అనంతరం జిఎమ్‌ఆర్‌ కాకినాడ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను ఒఎన్‌జిసి నుంచి దక్కించుకున్న తర్వాత.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారల్‌ 104 డాలర్ల నుంచి 35 డాలర్లకు పడిపోవడంతో ప్రతిపాదిత ప్రాజెక్ట్‌పై జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ పునరాలోచనలో పడింది. ఓఎన్‌జిసిని నుంచి రిఫైనరీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్న జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ను వారం రోజుల్లోనే శంకుస్థాపన పనులు చేపట్టాలని దివగంత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆదేశించిన ప్పటికీ... చమురు మార్కెట్‌ కుదేలవడంతో జిఎమ్‌ఆర్‌ వెనుకంజ వేసింది. ఇప్పటికీ ఈప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చకపోవడం విశేషం. రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో ఏటా 15 మిలియన్‌ టన్నుల చమురును వెలికితీయాలని జిఎమ్‌ఆర్‌ ఫీజబిలిటీ రిపోర్ట్‌ను సిద్ధం చేయడం విశేషం. అదే సందర్భంలో గతంలో ఓఎన్‌జిసికి ప్రభుత్వం ఇస్తామన్న 2700 ఎకరాలతోపాటు అదనంగా మరో ఏడు వేల ఎకరాల వరకూ జీఎమ్‌ఆర్‌ రిఫైనరీకి డిమాండ్‌ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మళ్ళీ తెరపైకి రిఫైనరీ...
ఇంతలో ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వం భూసేకరణ పనులకు బ్రేకులు వేసింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినప్పటికీ జిఎమ్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ను పెట్టాలెక్కించడానికి వెనుకంజవేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక మాంద్యం రీత్యా చమురు డిమాండ్‌ తగ్గడంతోపాటు ధరలు కూడా పూర్తిగా చతికిలపడడంతో జిఎమ్‌ఆర్‌ తాత్కాలికంగా ప్రాజెక్ట్‌ పనులు చేపట్టలేదు. తాజాగా చమురు మార్కెట్‌ తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవడంతోపాటు.. రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో జిఎమ్‌ఆర్‌ గ్రూప్‌ తిరిగి రిఫైనరీ పనులను తెరమీదకు తేవడం విశేషం.

అమెరికాకు పరిశ్రమల అధికారులు
అమెరికా వార్షిక కెమికల్‌ సదస్సుకు కేంద్ర బృందంతోపాటు రాష్ట్రానికి చెందిన పరి శ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి బి శ్యాంబాబ్‌, ఎపిఐఐసి సిఎండి బిఆర్‌ మీనా హాజర వుతున్నారు. ఈ సదస్సులో కాకినాడ-విశాఖ మధ్య ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌, రసా యనాలు, రసాయన ఉత్పత్తుల పెట్టుబడుల రీజియన్స్‌(పిసిపిఐఆర్‌)లో విసృ్తత పెట్టు బడుల భాగస్వాములను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ అ ధికారులు తెలిపారు. ఈ నెలాఖరు వరకు పరిశ్రమల శాఖ ఉన్నత స్థాయి అధికారులు అమెరికా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, ఒరి స్సా, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు పాల్గొంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.