Wednesday, March 24, 2010

పెరిగిన సిమెంట్‌ ధరలు

ముంబాయి : కేంద్ర బడ్జెట్‌లో వడ్డించిన ఎకై్సజ్‌ సుంకాల కార ణంగా సిమెంట్‌ ధరలు పెరి గాయి. పెరిగిన ధర బస్తాకు 10 నుండి 12 రూపాయలుగా ఉంది. ఎకై్సజ్‌ సుంకం, ఆయా ప్రాం తాల వారీ రవాణా ఛార్జీలకు అనుగుణంగా సిమెంటు తయారీ సంస్థలు 10-12రూపాయలను పెంచాయని యాంజెల్‌ కమా డిటీస్‌ విశ్లేషకులు రూపేష్‌ సాంఖే తెలిపారు. ఎకై్సజ్‌ సుంకం కారణంగా 190 రూపాయలకు దిగువన ఉన్న సిమెంటు బ్యాగు లపై 3రూపాయలు, 190 రూపాయల కన్నా అధికంగా ఉన్న సిమెంటు బ్యాగులపై ప్రాంతాలను బట్టి 3.75రూపాయలకు ధరలు పెరిగాయి. గత నెల ఫిబ్రవరి మాసంలో సిమెంటు ధరలు మార్కెట్‌ను శాసించాయి. పుంజుకున్న డిమాండ్‌తో పాటు రవా ణాకు ఆటకం కలగడంతో చాలా ప్రాంతాల్లో సిమెంటు ధరలకు రెక్కలు వచ్చాయని తెలిపారు.

ఉత్తర ప్రాంతాల్లో 6శాతం పెరి గితే, రాజకీయ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ లో సిమెంటు ధరల్లో ఏమార్పు కనిపించలేదని సాంఖే తెలిపారు. వార్షికంగా సిమెంటు పరిశ్రమ 4.3శాతం వృద్ధితో మధ్య- పశ్చిమ ప్రాంతా ల్లో వరుసగా 13.9, 8.5శాతం వృద్ధిని నమోదు చేయగా, దక్షి ణ ప్రాంతం మాత్రం వెనుకబడి కేవలం 1శాతం వృద్దిని మాత్ర మే నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే జాతీయ సి మెంటు రంగ వినియోగ సామర్థ్యం గత ఫిబ్రవరి మాసంలో 83శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో వినియోగం 69శాతానికి పడిపోయింది.

మధ్య భారతంలో ఓ మోస్తారుగా 107శాతం వినియోగం మౌలికస దుపాయాల, స్థిరాస్థి రంగాల నుండి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నమోదైంది. దేశీయ సిమెంటు రంగ ఉత్పత్తుల్లో చాలా సంస్థలు మెరుగైన విక్రయాలను గత కొద్ది మాసాలుగా నమోదు చేశాయని శ్రీనివాసన్‌ అన్నారు. ఉత్పత్తి పెంచడం వల్లే అదనపు సామర్థ్యం సాధ్యమైందని తెలిపారు. బడ్జెట్‌లో పేర్కొన్న పలు ప్రొత్సాహకాలు గ్రామీణాభివృద్ధిని, మౌలికసదుపాయాల ప్రాజెక్టులను మరింత వృద్ది పరుస్తాయని పేర్కొన్నారు.

మెరుగుపడుతున్న మౌలిక సదుపాయాలు, అర్బన్‌ ప్రాంతాల్లో గృహ విభాగంలో వృద్ధితో పాటు కామన్‌ వెల్త్‌ క్రీడల కారణంగా ఈ ఏడాది మే మాసం వరకు ధరల్లో స్థిరత్వాన్ని ఆశిస్తున్నామని అన్నారు. జూన్‌ మాసం నుండి ధరల్లో మార్పు రావచ్చని నిర్మాణ రంగం పనులు వేగవంతం అయ్యే సమయంలో ఒత్తిడి కారణంగా ధరలు ఆ సమయంలో పెరగవచ్చని శ్రీనివాసన్‌ తెలిపారు. దక్షిణప్రాంతాల కన్నా ఉత్తర ప్రాంతాల వ్యాపారులు డిమాండ్‌-సరఫరాను సమానం చేసుకుంటారని అన్నారు.