రికవరీదీ అదే వరుస..
ముగిసిన చెరకు క్రషింగ్
హైదరాబాద్ - న్యూస్‌టుడే

కారణాలు ఇవీ
అంతక్రితం సంవత్సరం చెరకు మద్దతు ధరపై నెలకొన్న అనిశ్చితిప్రభావం సాగు విస్తీర్ణంపై పడింది. 2008-09లో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు కాగా 2009-10 సంవత్సరంలో అది కాస్తా 1.20 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయంగా పంచదార ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర రూ.15 నుంచి రూ.45ను తాకింది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరగడంతో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువే రైతులకు చెల్లించాయి. కేంద్రం ప్రతిపాదించిన లాభదాయకమైన ధర.. రూ.1,298..తో నిమిత్తం లేకుండా, టన్ను చెరకుకు రూ.1,700 నుంచి రూ.2,200 వరకు చెల్లించాయి.

రికవరీపై కరవు, వరదలు ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా సహకార రంగంలో నడుస్తున్న కర్మాగారాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. గత ఏడాది 9.66% రాగా ఈ ఏడు అది 8.44 శాతంగా ఉంది. సంయుక్త రంగంలో నడుస్తున్న కర్మాగారాలోనూఅదే క్షీణత కనిపించింది. ప్రైవేటు వాటిల్లో ఫరవాలేదనిపిస్తోంది. మొత్తంమీద 35 కర్మాగారాల పరిధిలో రికవరీ శాతం నిరుటి కన్నా 0.69% తగ్గింది. ఇది గతేడాది 9.89% ఉండగా, ఈసారి 9.20% ఉంది.