Friday, March 26, 2010

చరిత్ర ఘనం.. ఆదరణ గగనం

ప్రొద్దుటూరు,మైదుకూరు,మేజర్‌న్యూస్‌: రాజుల కాలంలో కడప జిల్లా ప్రొ ద్దుటూరు తాలుకాలోని వనిపెంట గ్రామంలో రాగి, ఇత్తడి సామాన్లకు అమిత మైన గిరాకి ఉండేది. అప్పట్లో కంసాలి వనిపెంటగా పేరుండేది. అది క్రమేపి ఆదరణ కరవై చేతి వృత్తుల కళాకారులకు గుదిబండగా మారింది. 17వ శతా బ్దంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధిగా నిష్టవహించిన అనం తరం ఆయన భార్య గోవింద మాంబ పసుపు, కుంకుమ తీయకపోవడంతో బ్రహ్మంగారి మఠం సమీపంలోని వనిపెంట గ్రామానికి పర్యటన కోసం వెల్లగా అక్కడున్న రాగి, ఇత్తడి పరికారాలు చేసే విశ్వ బ్రాహ్మణులు భర్త చనిపోయినా నుదుట కుంకుమ తీయకపోవడంతో ఆమెను కించపరచగా అప్పట్లో ఆమె తోటి కులస్తులైన విశ్వబ్రాహ్మణులతో ‘వనిపెంట వల్లకాడు గా మారును’ అని శపించింది.


అప్పటి నుంచి విశ్వ బ్రాహ్మణులనే వారు ఆ గ్రామం నశించిపోవడం జరిగింది. అప్పట్లో రాగి, ఇత్తడి పరికాల తయారీలో విశ్వబ్రాహ్మణులదే అగ్రస్థానంగా ఉండేది. వారి అనంతరం ఇతర కులాలకు చెందిన ముస్లింలు, ఆర్య మరాఠీలు, బలిజ, ఒడ్డెరలు, రెడ్ల కులాలకు చెదిన వారు ఈ వృత్తులను కొనసాగించే వారు. అయితే మహారాష్టల్రోని సోలాపూర్‌ బిందెలు, మద్రాస్‌ బిందెలు, ఉబ్లి డేక్సాలు ఇటువంటి పరికరాలు తయారు చేసి ఉత్పత్తి చేసేవారు. దాదాపు 1980 సంవత్సరంలో ఈ ఉత్పత్తి అధికంగా ఉండే ది. పరికరాల కోసం రాగి, ఇత్తడి ముడి సరుకును మద్రాసు నుంచి లారీలతో రప్పించుకొనే వారు. అప్పట్లో లారి ముడి సరుకంటే చేతి వృత్తుల వారికి ఎంత పని ఉండేదో ఒక్కసారి ఆలోచించ వలసిన విషయం. ఈ వృత్తిలో దాదాపు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉండేవి. 1983 నుంచి 2003 వరకు కూడా వ్యాపారం సాజావుగా సాగుతూ వచ్చేది.

అయితే 2003 సంవత్సరంలో వాడుకలోకి యంత్రాలతో తయారు చేయబడిన నాణ్యత కలిగిన ఆధునిక గృ హోపకరణ వస్తువులు ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌, మన రాష్ట్రం వరంగల్‌ జిల్లాలోని పెంబర్తి నుంచి అధికంగా రావడంతో చేతి వృత్తుల వారికి పనులు సన్నగిల్లాయి. ముఖ్యంగా చేతి వృత్తి పనులలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న వనిపెంట కళాకారులు ఆధునిక పరికరాలు రావడంతో డీలాపడ్డారు. ఇక్కడ చే తి వృత్తులతో తయారు చేసే బిందెలు, గుడి గంటలు, కుండలు, దేవాలయా లకు సంబంధించిన పరికరాలను అతి సుందరంగా తయారు చేసేవారు. సం బంధించిన వ్యాపారాలు లేకపోవడంతో ఇక్కడున్న పనులు నేర్చుకున్న చేతి కాళాకారులు వసలు పోబట్టారు.

ఇత్తడి వస్తువుల ప్రాధాన్యత
రీబ్రేడ్‌ అనే జర్మనీ శాస్త్ర వేత్త ఇత్తడి, రాగిపై పరిశోధనలు చేయగా రోగాలు కల్గించే క్రిములను చంపే శక్తి ఒక రాగి, ఇత్తడికి ఉందని, రాగి ఇత్తడి పాత్రలలో నీరు ఎన్ని రోజులు ఉంచినా క్రిములు చేరవని, ప్లాస్టిక్‌, ఇతర పాత్రలలో నీరు ఉంచితే 24 గంటలలోపు పలు క్రిములు ఆనీటిలో చేరతాయని తెలిపారు. అలాగే రాగి పాత్రలలో ఉన్న నీరు తాగితే సుగర్‌, బీపీ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మానవుని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించేందుకు కూడా రాగి ఎంతో ఉపయోగపడుతుంది.

ఆలస్యంగా గుర్తించిన పభుత్వం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కడప జిల్లాలో ఉన్న వనిపెంట గ్రామంలో రాగి, ఇత్తడి తయారీదారుల పని తనాన్ని దేశం అంతటికీ చాటేం దుకు 2006సంవత్సరంలో మాపై దయ చూపడం జరిగిందని, వనిపెంట ఇత్తడి పని కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎఫ్‌ఎం ఇస్మాయిల్‌ పేర్కొన్నాడు. వైఎస్‌ కృషి వల్ల రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ వారు, డీఆర్‌డీఏ వారి సహకారంతో కామ న్‌ స్పెషలిటీస్‌ సర్వీసెస్‌ వారి ఆధ్వర్యంలో గుర్తింపు పొంది ప్రస్తుత ప్రజలు ఉప యోగించే వస్తువులు తయారు చేసుకునేందుకు నిధుల మంజూరుకు శ్రీకారం చుట్టింది.

2008 సంవత్సరంలోఅప్పటి కలెక్టర్‌ క్రిష్ణబాబు కార్మికుల అభివృద్ధి కోసం ఒక ఎకరా స్థలాన్ని ఏర్పాటు చేశారు. అంతలో ఆయన బదిలీపై వెళ్లిపోవ డం జరిగింది. అది మరుగున పడకుండా మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్‌ రవీంద్రా రెడ్డి, ప్రస్తుత కలెక్టర్‌ శశిభూషణ్‌కుమర్‌ల సహకారంతో రూ.25లక్షల నిధులు మంజూరు చేసి ఆధునిక మిషనరీ, టూల్స్‌ ఫ్యాక్టరీకి పనులు కొనసాగుతు న్నా యి. ప్రస్తుతం ఆధునిక ప్రపం చంలో రాగి, ఇత్తడి ద్వారా షోకేజ్‌లలో ఉంచు కొనే పరికరాలను తయారు చేస్తున్నామన్నారు.