Saturday, March 27, 2010

ఇన్‌ఫ్రా బాండ్లను బ్యాంకులు ఆర్థిక సంస్థలే జారీ చేయొచ్చు: చావ్లా

ముంబయి: మౌలిక సదుపాయాల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) బాండ్లను కొన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు జారీ చేయవచ్చు కానీ, ప్రయివేటు కంపెనీలు జారీ చేయజాలవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ చావ్లా అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఈ సంగతి తెలిపారు. 'ఇక్కడ కొంత అవగాహనలోపం ఉన్నట్లు కనిపిస్తోంది.. ప్రజలకు, ప్రయివేటు సంస్థలకు బాండ్లను జారీ ద్వారా బ్యాంకులు సమీకరించే నిధులను ప్రత్యేకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కార్యకలాపాలకు రుణసాయం చేయడం కోసమేవినియోగిస్తార'ని చావ్లా వివరించారు.