Thursday, March 25, 2010

పెట్టుబడులిక తీసిపోతలు

న్యూఢిల్లీ: మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థకు పెట్టుబడులు సమకూర్చేందుకు ఉరుకు లు తీసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పెట్టుబడులను ఉపసంహ రించేందుకు అంతకు మించిన వేగంతో పరుగులు తీస్తోంది. ప్రణాళిక వ్యయానికి నిధులు సమ కూర్చుకు నేందుకు, ఆర్థిక ద్రవ్యలోటును తగ్గించుకు నేందుకు పెట్టు బడుల ఉపసంహరణలో వేగాన్ని పెంచాలని ప్రణాళిక సం ఘం సూచించింది. ఆయా సంస్థల్లో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకూడదని భావించినప్పటికీ, మిగిలిన పెట్టుబడుల ఉపసంహరణకు ఎంతో అవకాశం ఉందని ప్రణాళిక సంఘం ప్రధాని మన్మోహన్‌కు సమర్పించిన నివే దికలో పేర్కొంది. ఆర్థిక లోటు పై ఒత్తిడి పెంచకుండా ప్ర ణాళిక వ్యయాన్ని భరించేందుకు పెట్టుబడుల ఉపసం హరణ నిధులు తోడ్పడుతాయని తెలిపింది. ఆర్థిక లోటు సవాళ్ళు విసిరే రీతిలో ఉన్న నేపథ్యంలో ప్రణాళిక వ్యయా నికి ఇతర వనరులను అన్వేషించాల్సిన పరిస్థితి ఉందని ప్రణాళిక సంఘం అభిప్రాయపడింది.

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ తన బడ్జెట్‌ ప్రసంగంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు జీడీపీలో 5.5 శాతానికి తగ్గ గలదని, ఆ తదుపరి ఏడాదికి 4.8 శాతానికి తగ్గగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక లోటు 6.7 శాతంగాఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీని అమ్మేయడం ద్వారా సాధించాల్సిన నిధుల లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌లో పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఉప సంహరణల ద్వారా రూ. 25 వేల కోట్లు సాధించాలన్నది లక్ష్యం కాగా, 2010-11లో దీన్ని రూ. 40 వేల కోట్లకు పెంచారు. గత రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వం ఆయిల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్టీపీసీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌, ఎన్‌ఎండీసీలలో తన వాటాను కొంతమేర విక్రయించింది.

క్యాబినెట్‌ నిర్ణయం ప్రకారం లిస్ట్‌ అయి, లాభాల బాటలో నడుస్తున్న పీఎస్‌యూలు కనీసం 10 శాతం మేర ప్రభు త్వ వాటాను విక్రయించాల్సి ఉంది. అన్‌లిస్టెడ్‌ కేంద్ర ప్ర భుత్వరంగ సంస్థలు లిస్ట్‌ కావాల్సి ఉంది. ఈ ప్రాథమ్యాల ప్రకారం 60 ప్రభుత్వరంగ సంస్థలు ఈ విధమైన పెట్టు బడుల ఉపసంహరణకు అర్హమైనవిగా తేలింది. రూ. 40 వేల కోట్లు సమీకరించేందుకు గాను రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సెయిల్‌, కోల్‌ ఇండియా, హిందుస్థాన్‌ కాపర్‌, ఎస్‌జీవీఎన్‌ఎల్‌, ఈఐఎల్‌ తదితర సంస్థల్లో నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించ నుంది. ఏ సంస్థలో ఎప్పుడు వాటాను విక్రయించాలనే దానిపై రోడ్‌మ్యాప్‌ వచ్చే నెల చివరినాటికల్లా రూపొందనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఇందులో చేరే అవకాశం ఉం ది. సట్లజ్‌ జలవిద్యుత్‌ నిగమ్‌లో ఏప్రిల్‌ లో ప్రభుత్వ వాటా ఉపసంహరణ జరిగే అవకాశం ఉందని పెట్టుబడుల ఉపసంహరణ శాఖ సంయుక్త కార్యదర్శి సిద్దార్థ ప్రధాన్‌ ఇటీవల తెలిపారు. ఇంజినీర్స్‌ ఇండి యాలో మే-జూన్‌లో, కోల్‌ ఇండియాలో ఈ ఏడాది చివరకు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ జాతర ఆరంభం కానుంది.