Friday, March 26, 2010

విదేశీ రోగులపై కన్నేసిన భారత కార్పొరేట్‌ ఆస్పత్రులు

దేశంలోని అతి పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రులు అపోలో, ఫోర్టీస్‌, మాక్స్‌ హెల్త్‌కేర్‌లు అమెరికాలోని కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఆ కార్పొరేట్‌లలో పనిచేసే ఎగ్జిక్యూటి వ్‌లకు ఇండియాలో చౌకరకమైన చికిత్సలతో పాటు నాణ్యమైన వై ద్యం అందిస్తారు. అమెరికాకు చెందిన మూడు కార్పొరేట్‌లతో ఒ ప్పందం కుదుర్చుకున్నట్లు ఫోర్టీస్‌, అపోలో సీనియర్‌ ఎగ్జిక్యూ టివ్‌లు చెప్పారు. ఫోర్టీస్‌ ఒక అడుగు ముందుకేసి తాము ఇప్పటికే 20 మంది రోగులకు చికిత్సలు కూడా చేశామని చెబుతోంది. అపో లో మాత్రం అమెరికా పెషంట్ల తాకిడి 100 శాతం పెరిగిందని చెబు తోంది.


మాక్స్‌ వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. తమ అగ్రిమెంట్‌ ప్రకారం వివరాల గోప్యమన్నారు. అమెరికాతో పోల్చుకుంటే ఇం డియాలో వైద్యం ఖర్చులు చాలా చౌక. అమెరికాలో జరిగే చికిత్స ఖరీదులో పదోవంతుతో ఇండియాలో నాణ్యమైన చికిత్సలు చేసుకోవచ్చు. అందుకే అమెరికన్‌లు ఇండియాలో చికిత్సకు మక్కువ చూపిస్తారు. ఉదా. అమెరికాలో మోకాలి చిప్పను తొలగించి కొత్త మోకాలి చిప్ప శస్రచికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతాయి. అదే ఇండియాలో కేవలం రూ.2.5 లక్షలు దీంట్లో రవాణా ఖర్చులు కూడా కలుపుకుని. అమెరికాతో పోల్చుకుంటే భారత్‌లో 60 శాతం ఖర్చు తక్కువ. గత ఆరు నెలల నుంచి తమ ఆస్పత్రికి నెలకు 2-3 రోగులు వస్తున్నారని ఫోర్టీస్‌ ఆస్పత్రి సీఈవో విశాల్‌బాల్‌ అన్నారు. ‚అమెరికా నుంచి విదేశీ రోగుల వరద ఇండియాకు తాకనుంది.

అపోలో ఆస్పత్రిలో ఇప్పటి వరకు నాలుగువేల మంది విదేశీ రోగులు చికిత్సలు చేయించుకున్నారు. వీరితో కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ఫోర్టీస్‌కు వచ్చే అంతర్జాతీయ రోగుల్లో ఎక్కువ మంది అమెరికన్లు. భారత్‌ ఆస్పత్రులపై అమెరికన్లకు మక్కువ ఎందుకంటే ఇక్కడ వైద్య ఖర్చులు చౌక. నాణ్యమైన వైద్యం అందు తుంది. అమెరికాలో వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం. ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యాలే హెల్త్‌ ఇన్సురెన్స్‌ చేయిస్తాయి. అయితే ఈ మధ్య హెల్త్‌ ఇన్సు రెన్సు చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఆర్థిక మాంద్యం. దీంతో అమెరికా కార్పొరేట్‌లు తమ ఎగ్జిక్యూటివ్‌లను భారత్‌ లాంటి చౌకగా, నాణ్యమైన వైద్యం లభించే దేశాలవైపే దృష్టి సారించింది.

అమెరికాయే కాకుండా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం అంతర్జాతీయ రోగులు ఇండియా వస్తున్నారని అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) సంగీతారెడ్డి చెప్పారు.ఆర్థిక మాంద్యంతో అమెరికాకు చెందిన చాలా మంది రోగులు ఇండియావైపు చూస్తున్నారు. వీరికి ప్రభుత్వం వీసా నిబంధనల్లో కొన్ని సడలింపులివ్వాలి విదేశీ రోగులకు వారితో పాటు వచ్చే ఒకరికి ఒక సంవత్సరం పాటు వీసా మంజూరు చేస్తున్నారు. దీన్ని మూడు సంవత్సరాలకు పెంచాలని ఫోర్టీస్‌కు చెందిన బాల్‌ కోరుతున్నారు. అయితే దీనికి గుర్తింపు పొందిన డాక్టర్లు సలహా మేరకు వీసాలు మంజూరు చేయాలని అన్నారు.మెడికల్‌ టూరిజంపై కొంత మంది ఉత్సాహం చూపిస్తున్న మరి కొంత మంది అంత ఉత్సాహం చూపించడం లేదు.

మాక్స్‌ హెల్త్‌ కేర్‌ సీఈవో ఎండి పర్వేజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, అమెరికా నుంచి భారత్‌ రావాలంటే చాలా దూరం. వారికి దగ్గరగా ఉండే కెనడా, దక్షిణ అమెరికాల్లో చికిత్సలకు వారు మొగ్గుచూపుతారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం దిణ ఆసియాలో సింగపూర్‌, బ్యాంకాక్‌లు విదేశీ రోగులను బాగా ఆకర్షిస్తోంది. భవిష్యత్‌లో భారత్‌ కూడా ఈ దేశాలతో పోటీ పడగలదని భావిస్తున్నారు. భారత్‌ టూరిజం శాఖ 2012 నాటికి మెడికల్‌ టూరిజం మార్కెట్‌ రూ.10వేల కోట్లకు చేరుకోగలదని చేరుకోగలదని అంచనా వేస్తోంది.