Saturday, March 27, 2010

ఇక రానుంది కరెన్సీ మాంద్యం

ముంబాయి: ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కసారిగా కుదిపేసిన ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఇప్పుడిప్పుడే బలహీన పడుతున్నాయి. అంతా బాగుంది అనుకునే లోగా మరో విపత్తు ముంచుకు రానుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మాంద్య పరిస్థితులను ఎదుర్కొన్న ప్రపంచ దేశాలు ఇక కరెన్సీ మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. భవిష్యత్‌ కాలంలో ఈ పరిస్థితులు నెలకొనవచ్చని ప్రముఖ కరెన్సీ విశ్లేషకులు, ఎలారా క్యాపిటల్‌ డైరక్టర్‌, అవినాశ్‌ ప్రసాద్‌ తెలిపారు. మాంద్య పరిస్థితు లను అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ప్రోత్సాహకర ప్యాకేజీలను ప్రకటిం చడం జరిగింది, తద్వారా వచ్చిందే ఫిస్కల్‌ (ఆర్థిక) మాంద్యం అనీ అన్నారు.

ఇప్పుడు ఫిస్కల్‌ మాంద్యం నుండి మరో అడుగు ముందుకేసి కరెన్సీ మాంద్యా న్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొన్నారు. ఫిస్కల్‌ మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు తమ తమ విధానాలను అనుసరించాయని, ముఖ్యంగా మాని టరీ పాలసీపై దీని ద్వారా ఒత్తిడి పెరిగిందని అవినాశ్‌ అన్నారు. అమెరికా, లండన్‌ వంటి దేశాలు ఇందు కొరకై తమ డాలర్‌ను బలహీన పరుచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అమెరికాలో అప్పటికే డాలర్‌ డీ-వాల్యువేషన్‌ పాలసీ ఉందని తెలిపారు. దీని కోసం భారత బ్యాంకింగ్‌ నియంత్రణ వ్యవస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎక్స్చేంజ్‌ రేటు పాలసీను అమలు పరిచిందనఇన్నారు.